5వ తరగతి – తెలుగు తోట
1.ఏ దేశమేగినా...
కవి పరిచయం:
రాయప్రోలు సుబ్బారావు (13.03.1892 – 30.06.1984)
బిరుదులు – అభినవ నన్నయ్య, నవ్య కవితా పితామహుడు
రచనలు – తృణ కంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్ట కమల, ఆంధ్రావళి, జడ కుచ్చులు, వనమాల
లక్షణ గ్రంధాలు – రమ్యా లోకం, మాధురీ దర్శనం
పద్మ భూషణ్ బిరుదు కలవారు
పదాలు – అర్ధాలు:
పీఠం = గద్దె, సింహాసనం యోగం = అదృష్టం స్వర్గ ఖండం = స్వర్గం లాంటి భారతదేశం జనియించుట = పుట్టుట |
తెన్గు = తెలుగు కాలిడు = అడుగు పెట్టు భారతి = భారతదేశం |
గర్భము = కడుపు సోకు = తగులు అనంతం = అంతులేనిది |
వివేకానందుని షికాగో ప్రసంగం – స్వామి చిరతాననంద
1893 సెప్టెంబర్ 11 – సర్వమత మహాసభ – షికాగో కొలంబస్ హాల్
2.సాయం
కవి పరిచయం:
జాక్ కోప్ (1913 – 1991)
దక్షిణాఫ్రికా నవలా రచయిత
ఇది ఒక అనువాద కధ
పదాలు – అర్ధాలు:
దృశ్యం = చూడదగినది కష్టం = ఇబ్బంది |
ఆత్రం = తొందర అవధులు = హద్దులు |
గుంపు = సమూహం ఆసక్తి = అపేక్ష |
అనకు కనకు వినకు
గాంధీజీ 3 కోతుల గురించి మహాదేవ దేశాయికి వివరించారు
కవి పరిచయం:
జంధ్యాల పాపయ్య శాస్త్రి (04.08.1912 – 21.06.1992)
కరుణశ్రీ గా ప్రసిద్ధులు
ఖండ కావ్యాలు – ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు
పిల్లల కోసం తెలుగు బాల శతకం రాసారు
3.కొండవాగు
కవి పరిచయం:
చెరుకుపల్లి జమదగ్ని శర్మ (1920 – 1986)
కవి, కధకుడు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కధలు రాసారు
కలం పేరు – జమదగ్ని
రచనలు – మహోదయం, చిలుకా గోరింక, అన్నదమ్ములు, ధర్మ దీక్ష
పదాలు – అర్ధాలు:
మేట = ఇసుక ప్రదేశం వాగు = చిన్న ఏరు జాలువారు = జరుతున్న బాట = దారి |
క్షేమం = కుశలం పొద్దు = రోజు, దినం దృశ్యం = చూడదగినది |
బారులు = వరుసలు లంక = నదిలో పైకి లేచి ఉన్న భుబాగం కదం తొక్కు = ఉత్సాహంతో ముందుకెల్లు |
పదజాలం
మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండో వాక్యం ఆ పదంతో ప్రారంభం అవ్వడం – ముక్తపదగ్రస్తం
సెలయేటి దారినొక్క చెంగల్వ బాట
బాట వెంట పోతే పువ్వుల తోట
నేలపట్టు పక్షి రక్షిత ప్రాంతం – నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండల సమీపంలో
ఈ ప్రాంతమునకి సముద్ర రామచిలకలు (ఫ్లెమింగో), గూడబాతులు (పెళికాన్), ఎర్ర కాళ్ళ కొంగలు, నల్ల కాళ్ళ కొంగలు, నారాయణ పక్షులు, స్వాతి కొంగలు,తెడ్డు ముక్కు కొంగలు, చుక్కమూతి బాతులు లాంటి పక్షులు దేశ విదేశాల నుండి వస్తాయి
పెళికాన్ పక్షులు ఇక్కడ గూడు కట్టి గుడ్లు పొదుగుతాయి
ప్రతి సంవత్సరం జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్ళూరు పేటలో జరుగుతుంది
ఫ్లెమింగోలు నైజీరియా నుండి వస్తాయి
వడగళ్ళు
కవి పరిచయం:
ఏడిద కామేశ్వర రావు (12.09.1913 – 1984)
ఆకాశవాణిలో పని చేసారు. రేడియో అన్నయ్య గా ప్రసిద్ధులు
రచనలు – రాష్ట్ర గీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర,బాలల కోసం పాటలు, నాటికలు
4. జయగీతం
కవి పరిచయం:
బోయి భీమన్న (19.09.1911 – 16.12. 2005)
పాలేరు, కూలిరాజు వంటి నాటికలు,గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండ కావ్యాలు రాసారు
పద్యం, పాట, వచనం మూడింటిలో సిద్ధహస్తులు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ పొందారు
ఇతని స్వీయ చరిత్ర – పాలేరు నుండి పద్మశ్రీ వరకు
పదాలు – అర్ధాలు:
భాస్కరా! = సూర్యుడా సంవిధానం = రాజ్యాంగం తధాగతా = బుద్ధుడా వేదాంతం = ఉపనిషత్తులు మధించి = చిలికి జగతి = లోకం |
శోదించి = పరిశీలించి మహితము = గొప్పతనం అస్పృశ్యత = అంటరానితనం అంత్య = చివర ఉడిపి = తొలగించి యోద్ధ = వీరుడు |
సౌభ్రాత్రం = సోదర భావం పంకం = బురద / మట్టి మ్రోళ్ళు = ఆకులు రాలిన చెట్లు సంఘర్షణ = మధనపడు నిష్కుల = కులం లేని సూరి = పండితుడు |
భాషాంశాలు:
నామవాచక గుణాలని తెలిపే పదాలు – విశేషణం
చిన్న, పెద్ద, మంచి, శ్రావ్యమైన ...........
పనులను తెలిపే పదాలు – క్రియ
లేచింది, వచ్చాడు, వెళ్తున్నాడు ..........
--- క్రియా పదాలు ముందు కొన్ని విశేషణాలు వస్తాయి. వాటిని క్రియా విశేషణాలు అంటారు
చిక్కు ప్రశ్న – వివేకవంతమైన జవాబు – జానపద కధ
5. తోలుబొమ్మలాట ఒక జానపద కళ
ఈ పాఠానికి కె.వి.రామకృష్ణ రచించిన “తోలుబొమ్మలాట” వ్యాసం ఆధారం
తోలు బొమ్మలాట క్రీ. పూ. 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది
మన ఆంధ్రాలో తూ. గో., కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో తోలు బొమ్మలాట కళాకారులు ఉన్నారు
మహారాష్ట్ర నుండి వలస వచ్చిన అరె కులస్థుల నుండి దీనిని ఇతర కులస్తులు నేర్చుకున్నారు
తోలు బొమ్మలు జంతు చర్మంతో చేస్తారు. ఒక అడుగు నుండి నాలుగైదు అడుగుల ఎత్తు వరకు చేస్తారు
మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజసిద్ధమైన రంగులు వాడతారు
ప్రదర్శనకి ఆరు నుండి ఎనిమిది కళాకారులు ఉంటారు
తోలు బొమ్మలాట నాట రాగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారు
దీనిలో గల రహస్య పాత్రలు కేతిగాడు (జుత్తు పోలిగాడు), బంగారక్క
ముఖతః పారాయణం – ఒకరు చెప్తుంటే విని నేర్చుకోవడం
పదాలు – అర్ధాలు:
ప్రాచీన = పాత, పురాతన ప్రాముఖ్యం = ప్రాధాన్యం ఆమడ = ఎనిమిది మైళ్ళ దూరం శతాబ్దం = వంద సంవత్సరాలు |
నానుడి = వాడుకగా అనే మాట, సామెత తర్ఫీదు = శిక్షణ, అభ్యాసం రక్తి కట్టడం = అలరించడం |
శ్రుత పాండిత్యం = వినడం ద్వారా నేర్చుకోవడం చమత్కారం = నేర్పు పారాయణం = శ్రద్దగా చదవడం |
నానుడి – సామెత, వాడుకగా అనే మాట
శ్రుత పాండిత్యం – వినడం ద్వారా నేర్చుకోవడం
తప్పెట గుళ్ళు:
జానపద కళారూపాల్లో ఒకటయిన తప్పెట గుళ్ళు ప్రత్యేకించి ఉత్తరంధ్రాలో ఎక్కువ కనిపిస్తుంది. రేకుతో చేసిన తప్పెటలు మెడలో వేసుకుని వాయిస్తారు
దీన్ని గుండె మీద పెట్టి వాయించడం వల్ల దీనికి తప్పెట గుండ్లు అనే పేరు వచ్చింది
కోలాటం:
గ్రామీణ ప్రజలు తాము చేయు నిత్య కృత్యాలలో అలసట మర్చిపోవడానికి ఉపయోగించే కళారూపం కోలాటం
రెండు చేతుల్లో కోలలు ధరించి వాటిని ఆడిస్తూ కోలాటం ఆడిస్తారు
దీనిలో రకాలు – ఏక కోలాటం, జంట కోలాటం, జడ కోలాటం, స్త్రీల కోలాటం, పురుషుల కోలాటం
దీనిలో 16 నుండి 40 మంది పాల్గొనవచ్చు
సామెతలు :
ఆరునెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీల్లవుతారట
రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు
ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు
కుక్క కాటుకి చెప్పు దెబ్బ
కాకిపిల్ల కాకికి ముద్దు
మొక్కయి వంగనిది మానై వంగునా?
అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు నోరు మంచిది అయితే ఊరు మంచిది
భాషాంశాలు:
ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని “కర్త” అంటారు
ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే వాటిని “కర్మ” అంటారు
ఒక పని జరగడాన్ని తెలిపే పదాలు “క్రియ”
క్రియలు రెండు రకాలు – సమాపక క్రియ, అసమాపక క్రియ
ఒక క్రియా పదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ
ఒక క్రియా పదం వాక్యాన్ని పూర్తి చెయ్యకపోతే అది అసమాపక క్రియ
కూచిపూడి నృత్యం – ఒక సంప్రదాయ కళ
కూచిపూడి ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లా దివిసీమలో కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించిన కళారూపం. ఊరి పేరుతో ప్రసిద్ధం అయినది
కూచిపూడి నాట్య కళ మూలపురుషుడు – సిద్ధేంద్ర యోగి
సిద్ధేంద్ర యోగి రచించిన నాటకం – భామా కలాపం (ఇది మొదటి నృత్య నాటకం)
నాట్యం అభినయ ప్రధానం. అభినయం నాలుగు రకాలు అవి
ఆంగికాభినయం – అవయవాల కదలికతో భావ వ్యక్తీకరణ
వాచికాభినయం – భాష ద్వారా
ఆహార్యాభినయం – వేషం ద్వారా
సాత్వికాభినయం – శరీరంలో కలిగే మార్పుల ద్వారా
కూచిపూడి కళాకారులు పగటి వేషాలు కూడా వేస్తారు. పగటి వేషాల్లో ప్రధానం అయినది అర్ధనారీశ్వర వేషం
కూచిపూడి నాటక ప్రదర్శనలని “భాగవత మేళా” అని అంటారు
కూచిపూడి నాట్యం విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖులు – కీ.శే.భాగవతుల రామయ్య, హరి మాధవయ్య, చింతా వెంకట రామయ్య, తాడేపల్లి పేరయ్య, బాగవతుల విస్సయ్య, వెంపటి వెంకట నారాయణ, దర్భ వేంకటేశ్వరులు, వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకట చలపతి, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రాఘువయ్య, చింతా కృష్ణమూర్తి, వేణు గోపాలకృష్ణ శర్మ, వేదాంతం రత్తయ్య శర్మ, వేదాంతం సీతారామ శర్మ
6. పెన్నేటి పాట
కవి పరిచయం:
విద్వాన్ విశ్వం (21.10.1915– 19.10.1987)
సంస్కృత కావ్యాలు తెలుగులో అనువదించారు
రచనలు –పెన్నేటి పాట, విలాసిని, రాతలు-గీతలు
రాయలసీమ సౌందర్యాన్ని,విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండిక తీసుకున్నారు
పదాలు – అర్ధాలు:
హోరు = శబ్దం నిదానించు = నెమ్మదిగా జాలు = ప్రవాహం |
విదారించు = చీల్చుకుంటూ ఎద = హృదయం బొక్కసం = ధనాగారం |
నాళ్ళు = రోజులు, ప్రాంతాలు కంజర = ఒక రకమైన వాయిద్యం |
భాషాంశాలు:
జరిగిపోయిన కాలం – భూత కాలం,జరుగుతున్న కాలం – వర్తమాన కాలం, జరగబోయే కాలం – భవిష్యత్ కాలం
మూడు చేపలు
కవి పరిచయం:
శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి (23.04.1891 – 25.02.1961)
తేట తెనుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండగుర్తు లాంటి వారు
రచనలు – రాజరాజు నాటకం, ఆత్మబలి, రక్షా బంధనం నవలలు
స్వీయ చరిత్ర – అనుభవాలు జ్ఞాపకాలు. ఇది ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర
7. పద్య రత్నాలు
1. అప్పిచ్చువాడు వైద్యుడు ------------------- సుమతీ! (బద్దెన)
2. ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానమ్ము ------------------- నార్లమాట! (నార్ల వెంకటేశ్వర రావు)
3. చంపదగిన యట్టి శత్రువు తనచేత ------------------- వినురవేమ! (వేమన)
4. మచ్చిక లేనిచోట ననుమానము ------------------- సింగదీమణి! (చాటువు)
5. నిజము మీద భూమి నిలబడి యుండును ------------------- కాళికాంబ! (పోతులూరి వీరబ్రహ్మం)
6. ఒరులేయవి ఒనరించిన ------------------- ధర్మ పదములకేల్లన్ (తిక్కన)
7.నీతియె మూలము విద్యకు ------------------- నియత పదంబున్ (ఏటుకూరి వెంకట నరసయ్య)
8. చదువని వాడజ్ఞుండగు ------------------- చదువుము తండ్రీ! (పోతన)
9. తరవులతిరసఫల భార గురుతగాంచు ------------------- సహజగుణము (బర్త్రుహరి సుభాషితం)
పదాలు – అర్ధాలు:
ఎడతెగక = విడవకుండా, తెగిపోకుండా ద్విజుడు = బ్రాహ్మణుడు చొప్పడిన = ఉన్నట్టి పొసగ = తగినట్లుగా చిక్కెనేని = దొరికితే కీడు = హాని పరిణితి = మార్పు సంశయించు = సందేహించు ప్రాభవం = గొప్పతనం తరువు = చెట్టు గురుత = గొప్పతనం , బరువు నింగి = ఆకాశం
|
వ్రేలుచు = వేలాడుతూ అమృతం = తియ్యని వాన నీరు కోవిదుడు = విద్వాంసుడు మేఘుడు = మేఘం సమృద్ధి = ఎక్కువగలిగి ఉండడం పెన్నిధి = గొప్పదైన నిధి ఉపకర్త = ఉపకారం చేసేవాడు ఒరులు = ఇతరులు అప్రియము = ఇష్టం కానిది మనమునకు = మనస్సుకు పరాయణమ = అభీష్టం పరమధర్మం = గొప్ప ధర్మం |
వాక్కు = మాట ఆజ్నుడు = తెలివి తక్కువవాడు సత్ = మంచి అసత్ = చెడు ఆర్యులు = పూజ్యులు కుచ్చితము = కపటము మెండుగా = ఎక్కువగా బుధులు = పండితులు ఉద్ధతులుగారు = గర్వపడరు నియత = నియమం గల నిర్ణయకమున్ = నిర్ణయించేది |
ముక్తకం అనగా ఒక పద్యం. పూర్తి అర్ధం తనకి తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించేది.
తెలుగు ముక్తక రచనకి శతక, చాటు పద్యాలు ఉదాహరణ చెప్పవచ్చు
వేములవాడ భీమకవి, శ్రీనాధుడు, తెనాలి రామకృష్ణ చాటు పద్య రచనలో ప్రసిద్ధులు
ముక్తకం ఒక పద్య ప్రక్రియ
శతకంలో కూడా ముక్తక లక్షణం ఉంటుంది
పదాలు – అర్ధాలు:
కీడు = ప్రాభవం = తరువు = |
అప్రియం = పధం = నింగి = |
పెన్నిధి = వాక్కు = |
భాషాంశాలు:
పురుషులను సంభోదించే పదాలు – పులింగం
స్త్రీలను సంభోదించే పదాలు – స్త్రీలింగం
ఇతరులను సంభోదించే పదాలు – నపుంసకలింగం
తెలుగులో అర్ధం ప్రమాణం. తెలుగు వ్యాకరణంలో ఈ విభాగాన్ని వాచకం అంటారు
పురుషులను సంభోదించే పదాలు – మహత్తులు
తక్కినవి – అమహత్తులు
స్త్రీలను సంభోదించే పదాలు ఏకవచనంలో అమహత్తుతో, బహువచనంలో మహత్తుతో చేరతాయి
స్త్రీలను సంభోదించే పదాలని విడిగా చెప్పాలంటే మహతీ వాచకాలు అంటారు
కలమళ్ళ శాసనం
తొలి తెలుగు శాసనం కలమళ్ళ శాసనం
శాసనం రాజాజ్ఞ తెలుపుతుంది
శాసనాలు వాటిలో విషయం బట్టి మూడు రకాలు – దాన శాసనాలు (దాన ధర్మాలు), ప్రశస్తి శాసనం (విజయాలు), ధర్మలిపి శాసనం (మతపర నియమాలు)
ఆంధ్ర దేశంలో లభించే శాసనాలు కొన్ని శిలలపై చెక్కినవి. కొన్ని రాగి రేకులపై చెక్కినవి
మొదట ప్రాకృత భాషలో తర్వాత సంస్కృత ప్రాకృత భాష మిశ్రమం తర్వాత సంస్కృతంలో శాసనాలు వచ్చాయి
మొత్తం తెలుగులో మొదటి శాసనం వేసినది – రేనాటి చోళులు. రేనాడు అనగా ఇప్పటి కడప
కలమళ్ళ శాసనం –రేనాటి చోళరాజు ఏరికల్ ముత్తురాజ్ ధనుంజయుడు వేయించాడు. ఇది దాన శాసనం
8. ఇట్జ్ పండగ
కవి పరిచయం:
గిడుగు వెంకట రామమూర్తి (29.08.1863 – 22.01.1940)
వ్యవహారిక భాషా ఉద్యమానికి గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు
సవర భాషా మాద్యమంలో తొలి పాఠశాల నడిపారు
సవర వాచకాలు, సవర ఇంగ్లీష్ నిఘంటువు, సవర వ్యాకరణం రాశారు
గ్రంధాలు – బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా బేషజం
ఇట్జ్ పండగని కొందరు విటీజ్ అంటారు
విశాఖ విజయనగరంలో మన్యం వాసులు జరుపుతారు
మార్చి, ఏప్రిల్ నెలలో చేస్తారు
ఒడియా వారు దీనిని చైత్ పోరోబ్ (చైత్ర పర్వం) అంటారు
గిరిజనేతరులు ఇటుకల పండగ అంటారు
ఉగాది తర్వాత నవమి మధ్యలో ఈ పండగ చేస్తారు
వారు 12 నెలలకి 12 పేర్లు పెట్టారు. అందులో నాల్గవది ఇట్జ్
మొదటి రోజు - మామిడి ముక్కలు బియ్యంతో కలిపి వండుతారు దీన్ని బోనం అంటారు
రెండో రోజు – రోడ్డ కనుసు (రోడ్డ అనగా ఆకులు, కనుసు అనగా ఊరేగింపు). ఆకులు కట్టుకుంటారు
తలకి పక్షి ఈకలు కడతారు. ముఖంపై నలుపు, తెలుపు చారలు పూసుకుంటారు
పనసకాయ జంతు తల ఆకారంగా చేసి దానిపై బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ సంకు దేవుని వద్దకి వెళతారు
మూడు నుండి ఆరు రోజులు – ఏదో ఒకరోజు వేటకి వెళతారు
ఏడవ రోజు – మారు ఇటజ్ / నూరు ఇటజ్. శ్రీకాకుళంలో దీనిని మామిడి టెంక పండగ అంటారు
పదాలు – అర్ధాలు:
తుడుము = గిరిజన వాయిద్య పరికరం
కొమ్ము బూర = కొమ్ముతో చేసే బూర
సందడి = అందరూ కలిసి మెలసి తిరగడం
మొక్కుబడి = భగవంతునికి చెల్లించే ముడుపు
తోరణం = గుమ్మాలకి మామిడి ఆకులతో కట్టే దండ
కుదురు = కుండలు కదలకుండా నిలిపే అమరిక
హేళన = ఎగతాళి
థీమ్సా కోయ = గిరిజన నృత్యాలు
అటక =చిన్న మిద్దె
రోడ్డ కనుసు = గ్రామ ఊరేగింపు
దసరా పండగ
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి – నవరాత్రులు
దుర్గాదేవి మహిసాసురుడు అనే రాక్షసునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమి నాడు విజయం సాదించింది – విజయదశమి
జమ్మి చెట్టుపై పెట్టిన ఆయుధాలు పాండవులు తిరిగి తీసుకున్న రోజు – విజయదశమి
మొట్టమొదట = మొదట + మొదట
తుట్టతుద = తుద + తుద
అట్టడుగు = అడుగు + అడుగు
కట్టకడ = కడ + కడ
చిట్టచివర = చివర + చివర
పట్టపగలు = పగలు + పగలు
విభక్తి ప్రత్యయాలు:
వాక్యంలో పదాల మధ్య సంబంధం ఏర్పరిచేవి
డు, ము, వు, లు – ప్రధమా విభక్తి
నిన్, నన్, లన్, కూర్చి, గురించి – ద్వితీయా విభక్తి
చేతన్, చేన్, తోడన్, తోన్ – తృతీయా విభక్తి
కొరకున్, కై – చతుర్ధీ విభక్తి
వలనన్, కంటెన్, పట్టి – పంచమీ విభక్తి
కి, కు, యొక్క, లోన్, లోపలన్ – షష్టి విభక్తి
అందున్, నన్ – సప్తమి విభక్తి
ఓ, ఓయి, ఓరీ, ఓసి – సంబోధనా ప్రధమ విభక్తి
తేనె కన్నా మధురం రా తెలుగు ఆ తెలుగుదనం మా కంటి వెలుగు – ఆరుద్ర
క్రిస్మస్
డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్, డిసెంబర్ 25 క్రిస్మస్
జీసస్ బేతలహంలో ఒక పశువుల శాలలో జన్మించాడు
తల్లి మేరీ మాత
వెదురు బద్దలు రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రం తయారు చేసి ఇంటి కప్పు మీద ఎత్తులో పెట్టెదరు
ప్రతి ఇంటిలో ఒక క్రిస్మస్ చెట్టు ఏర్పాటు చేయుదురు
9. తరిగొండ వెంగమాంబ
ప్రధమ మహిళా ఉపాధ్యాయిని – సావిత్రి భాయి పులే
భారత కోకిల – సరోజినీ నాయుడు
తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి – ఆతుకురి మొల్ల
వెంగమాంబ రెండున్నర దశాబ్దాల క్రితం చిత్తూరు జిల్లా తరిగొండలో జన్మించింది
తండ్రి – కానాల కృష్ణమార్యుడు, తల్లి – మంగమాంబ
యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు
చలివేంద్రాలు, అన్నసత్రాలు ఏర్పాటు చేసింది
నృసింహ జయంతి ఉత్సవాలు జరిపింది
అష్ట ఘంటాలు అనే ఎనిమిది మంది రాతగాళ్లని నియమించి తన గ్రంధాలకి ప్రతులు రాయించింది
రాజయోగసారం, భాగవతం అనే ద్విపద కావ్యాలలో తానేమీ చదువుకోలేదు అని చెప్పింది
ద్విపద రచన వెంగమాంబకి ఇష్టం
వెంగమాంబ ప్రతిరోజూ శ్రీనివాసునికి ముత్యాల హారతి ఇచ్చేది. అందుకే తాళ్ళపాక వారి లాలి తరిగొండమ్మ హారతి అనే నానుడి వచ్చింది
గ్రంధాలు – నారసింహ శతకం, నారసింహ విలాస కధ, శివ నాటకం, రాజయోగసారం, కృష్ణ నాటకం, పారిజాతాపహరణం, చెంచు నాటకం, శ్రీకృష్ణ మంజరి, శ్రీ రుక్మిణీ నాటకం, ద్విపద భాగవతం, వాశిష్ట రామాయణం, ముక్తి కాంతా విలాసం, శ్రీ వెంకటాచల మహాత్మ్యం, అష్టాంగ యోగసారం
పదాలు – అర్ధాలు:
అంతరాలు = తేడాలు శతాబ్దం = వంద సంవత్సరాలు పాటవం = సామర్ధ్యం ద్విపద = రెండు పాదాల పద్యం |
మూఢాచారం = అవివేక ఆచారం కట్టుబాట్లు = నిబంధన ఆంక్షలు = నిర్భందాలు |
సిద్ధహస్తురాలు = నేర్పరి ఆనాఘాత్ములారా = పుణ్యాత్ములారా చలివేంద్రాలు = వేసవిలో మంచినీరు ఇచ్చే చోటు |
పాణాకా కనకమ్మ :
నెల్లూరు జిల్లా మినగల్లు గ్రామం – 10.06.1892
తల్లిదండ్రులు – మరుపూరు కొండారెడ్డి, కామమ్మ
ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృతం నేర్చి పాండిత్యం సాధించారు
1913 – నెల్లూరు దగ్గర పాట్లపూడి గ్రామంలో సుజన రంజని సమాజం అనే సేవా సంస్థ స్థాపించారు
నెల్లూరు రామానాయుడు వంటి వితరణ శీలురు ప్రోత్సాహంతో కొత్తూరు గ్రామంలో వివేకానందగ్రంధాలయం ఏర్పాటు చేశారు
చూడూరు రత్నమ్మ :
తూ. గో. జిల్లా కాకినాడ – 07.02.1891
తండ్రి – రావు బహదూర్ పైడా వెంకట చలపతి
ప్రముఖ గాంధేయవాది, సంఘ సంస్కర్త
1940 లో ఎన్నో వితంతు వివాహాలు జరిపించారు
మహిళల ఉపాధి కోసం మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పాటు. వీరికి కుట్టు మిషన్లు అందించారు
జయంతి సూరమ్మ :
శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారం – 1887
తాగడం వల్ల అనర్ధాలు తెలుపుతూ కల్లు మానవోయి బాబు అంటూ ధర్నా
వీరేశలింగం గారి ప్రభావంతో సంఘ సేవే పరమావధిగా భావించారు
ఈమెతో పాటు దువ్వూరి సుబ్బమ్మ, దుబాగుంట రోశమ్మ మద్యపాన నిషేదానికి కృషి చేశారు
భాషాంశాలు:
సామాన్య వాక్యం
క్రియా సాహిత్య వాక్యం – ఒక సమాపక క్రియ ఉంటుంది
క్రియా రహిత వాక్యం – క్రియా పదం ఉండదు
ఒక సమపక క్రియ ఉండి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే సంశ్లిష్ట వాక్యం
ఒకటి కన్నా ఎక్కువ సమాపక క్రియలు – సంయుక్త వాక్యం
లలిత పాట పాడింది, వివేకానందుడు షికాగోలో ఉపన్యసించాడు – సామాన్య వాక్యం
శారదా టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది సౌజన్య చాలా తెలువైనది, చురుకైనది – సంయుక్త వాక్యం
బలరాం సంతకి వెళ్ళి కూరగాయలు తెచ్చాడు, కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది - సంశ్లిష్ట వాక్యం
కవిత్రయం
మహాభారతం – వేద వ్యాసుడు – సంస్కృతంలో
తెలుగులో – నన్నయ్య, తిక్కన, ఎర్రన
నన్నయ్య :
11వ శతాబ్దం
రాజ మహేంద్రవరం రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి
భారతంలో ఆది, సభా పర్వాలు అరణ్య పర్వంలో కొంత భాగం రచించారు
బిరుదులు – ఆదికవి, వాగాను శాసనుడు
తిక్కన :
13వ శతాబ్దం
నెల్లూరు మనుమసిద్ధి ఆస్థాన మంత్రి
విరాట పర్వం నుండి పదిహేను పర్వాలు రచన
నిర్వచనోత్తర రామాయణం రచించారు
బిరుదులు – కవి బ్రహ్మ, ఉభయకవి మిత్రుడు
ఎర్రన :
14వ శతాబ్దం
అద్దంకి పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి
అరణ్య పర్వంలో మిగిలిన భాగం, నృసింహ పురాణం, హరివంశం రచించారు
బిరుదులు – ప్రబంధ పరమేశ్వరుడు, శంభు దాసుడు
10. మంచి బహుమతి
ద కింగ్ డం ఆఫ్ గాడ్ ఈజ్ వితీన్ యు అనే పుస్తకం తనని అహింస వైపు నడిపింది అని గాంధీ చెప్పారు
భగత్ సింగ్ తనని ఉరి తీసే ముందు తనకి ఇష్టం అయిన పుస్తకం లెనిన్ రాసిన రాజ్యం విప్లవం చదవాలి అన్నారు
అంబేద్కర్ గ్రంధాలయంలో 52 వేల పుస్తకాలు ఉండేవి
అంబేద్కర్ 32 పుస్తకాలు రచించారు. 23 డిగ్రీలు సాధించారు
సరోజినీ నాయుడు గారు సరోవర రాణి అనే పుస్తకం రాశారు
పుస్తకాలు శాశ్వత స్నేహితులు అన్నది – అబ్దుల్ కలాం
పదాలు – అర్ధాలు:
బహుమతి = కానుక నిర్మాత = తయారుచేసినవారు |
అహింస = హింస లేని మాజీ = మునుపటి |
సరోవరం = కొలను / చెరువు నేస్తాలు = స్నేహితులు |
తాటాకుల మీద ఘంటంతో రాసిన గ్రంధాలు – తాళపత్ర గ్రంధాలు
తర్వాత కాలంలో రాగి రేకుల మీద రచించారు
తర్వాత కాగితం కనుగొన్నారు
అచ్చు యంత్రం తయారీ – జాన్ గూటన్ బర్గ్ - క్రీ. శ. 1440
పుస్తకం హస్త భూషణం – చేతికి పుస్తకమే ఒక అలంకరణ
భాషాంశాలు:
లింగ, వచన, విభక్తి భేదాలు లేని వాటిని అవ్యయాలు అంటారు
ఉదా – ఆహా!, ఔరా, అబ్బా, ఓహో,..
నవ్వుల తాతయ్య చిలకమర్తి
చిలకమర్తి లక్ష్మీ నరసింహం – 26.09.1867 – 17.04.1946
చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు 1890 లో పకోడీ మీద పద్యం చెప్పారు
గయ్యాళి గంగమ్మ, ప్లీడర్ తమాషా, పెళ్లి కొడుకు ధరలు, గొట్టాలమ్మ, కనకయ్య పంతులకాంతి, ఆకాశ రామన్న మొదలైన నవ్వు తెప్పించే రచనలు
నాటకాలు – గయోపాఖ్యానం, కీచక వధ
నవలలు – రామచంద్ర విజయం, గణపతి
శతకాలు – భల్లట, కృపాంభోదిని
వీరేశలింగం గారి స్పూర్తితో దళితుల విద్య కోసం పాఠశాల నిర్వహణ
0 Comments