Ticker

6/recent/ticker-posts

5వ తరగతి | EVS Short Notes for DSC 2024 | Most IMP Bits

  5వ తరగతి  | EVS Short Notes for DSC 2024 | Most IMP Bits 
5వ తరగతి  

5వ తరగతి  | EVS Short Notes for DSC 2024 | Most IMP Bits


వలసలు
 

  • ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళడాన్ని వలస అంటారు .
  • వలస వలన కొన్ని సార్లు కుటుంబాలలో మార్పులు జరుగుతాయి .
  • వలసకు ప్రధానంగా 2 కారణాలున్నాయి
  • 1. సహజ కారణాలు 2. ఆర్థిక కారణాలు
  • వరదలు, తుఫానులు, భూకంపాలు మొదలయిన ప్రకృతి వైపరీత్యాలు వలసలకు సహజ కారణాలు.
  • ఉద్యోగ బదిలీలు, పేదరికం అనునది వలసలకు ఆర్థిక కారణాలు .
  • ప్రకాశం జిల్లాలో ప్రధాన పంట - పొగాకు
  • ప్రకాశం జిల్లాలోని పొగాకు వలస కూలీలు (పచ్చాకు కూలీలు) కాలానుగుణంగా వలస వెళ్ళే కూలీలు కు ఉదాహరణ .
  • పల్లెలనుండి పట్టణాలకు వలస పెరగడంవలన తాత్కాలిక నివాసాలు, వనరుల కొరత, జనసాంద్రత పెరిగిపోతున్నాయి .
  • పేదరికం, ఆర్థిక నియంత్రణ లేకపోవడం, ప్రణాళకాలోపం పట్టణ ప్రంతాలలో మురికి వాడలు ఏర్పడుటకు కారణం అవుతున్నాయి .
  • ఉమ్మడి కుటుంబంలో కుటుంబ పెద్ద ఆ కుటుంబాన్ని ముందుండి నడిపిస్తాడు .
  • కుటుంబ పద్దు (బడ్జెట్‌ అనునది ఆ కుటుంబం తన ఆదాయాన్ని ఏఏ అంశాలకోసం ఖర్చు చేశారో తెలియచేయు పట్టిక .
  • పై చార్జ్‌ వృత్తాకారంలో గీయబడిన ఒక రేఖాచిత్రం .
  • పై చార్జ్‌ అంకెలను భాగాల రూపంలో సూచించుటకు సహయపడుతుంది .
  • కుటుంబ పద్దు అనునది కుటుంబ సభ్యులకు డబ్బు యొక్క విలువను తెలియ చేస్తుంది.
  • కుటుంబ పద్దు డబ్బులను ఏ విధంగా ఖర్చు చేయాలో గుర్తించుటకు సహకరిస్తుంది .
  • అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి కుటుంబ పద్దు సహయపడుతుంది .
  • రక్త హీనతను తగ్గించేవి - ఐరన్‌ , ఫోలిక్‌ మాత్రలు
  • విజయం సాధించడానికి పేదరికం అడ్డంకాదు అన్నది - గనం కలాం
  • APJ కలాం పూర్తిపేరు - అవూల్‌ ఫకీర్‌ జైనులాబ్దిన్‌ అబ్బుల్‌ కలాం
  • APJ కలాం 1931 అక్టోబర్‌ 15 న జన్మించారు
  • APJ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు .
  • APJ కలాం నాన్న పేరు - జైనులాబ్బిన్‌
  • APJ కలాం సముద్రం ఒడ్డున ఎగురుతున్న పక్షిని చూసి తాను కూడా అలా ఎగరాలని కలగన్నాడు.
  • మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఎవరు - APJ కలాం
  • APJ కలాం భారత దేశానికి 11వ రాష్ట్ర పతి.
  • APJ కలాం రాష్ట్ర పతిగా పనిచేసిన కాలం - 2002 - 2007
  • APJ కలాం మరణించిన రోజు - 2015 జులై 27.
  • మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ లో ౧౮ కలాం విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ మరణించారు .
  • వాతావరణ మార్చు
  • సాధారణంగా ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలోని తేమ మొదలయిన పరిస్థితులను వాతావరణం అంటారు .
  • భూమి సుందరమైన ఒక నీలిగ్రహం .
  • ఆక్సిజన్‌ ఇవ్వడం ద్వారా , సూర్యకాంతి నుండి రక్షించడం ద్వారా అడవులు మనకు సహాయపడుతున్నాయి.
  • ధృవ ప్రాంతాలలో మంచు కరగడం వలన సముద్ర మట్టం పెరిగి సముద్ర తీరాలలోని ప్రాంతాలు సముద్రంలో కలసి పోతాయి .
  • సముద్ర జలాల ఉష్టోగ్రతలు పెరిగిపోవడం వలన సముద్రంలో పెరిగే మొక్కలు, జంతువులు చనిపోతాయి.
  • ప్లాస్టిక్‌ కప్పులలో వేడి ద్రవాలు తాగడం , ప్లాస్టిక్‌ ప్లేట్లలో ఆహర పదార్థాలు తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం .
  • భూమి రోజు రోజుకూ వేడెక్కడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ అంటారు.
  • వాతావరణంలో పెరిగిపోతున్న వేడి వలన అప్పుడప్పుడు అడవులు కాలిపోతున్నాయి .
  • గ్లోబల్‌ వార్మింగ్‌ కు కారణం అవుతున్న వాయువు -- కార్డన్‌ డై ఆక్సైడ్‌ ,
  • శీతోష్టస్థితిలో కలుగుతున్న మార్పులుకు కారణం -- అభివృద్ధి చెందిన దేశాలు .
  • నీరు, బొగ్గు అనునవి సహజవనరులు .
  • రిఫ్రీజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్లు మోటారు వాహనాలు హానికర రసాయనాలు విడుదల చేయడం ద్వారా గ్లోబల్‌ వార్మింగ్‌ కు కారణం అవుతున్నాయి .
  • భూమికి ఊపిరితిత్తుల లాంటివి - అడవులు .
  • సకల జీవరాశులకు ప్రాధమిక ఆహారవనరులు -- మొక్కలు
  • జీవావరణ సమతుల్యత కాపాడుతూ నేలకోతను అరికట్టేవి - మొక్కలు .
  • గ్రెటా ధన్‌ బర్గ్‌ పర్యావరణ వేత్త .
  • గ్రెటా ధన్‌ బర్గ్‌ ఏ దేశం -- స్వీడన్‌ .
  • గెటా ధన్‌ బర్గ్‌ వాతావరణ మార్పులపై చేపట్టిన ఉద్యమం అంతర్జాతీయ గుర్తింపు పొందింది .
  • గెటా ధన్‌ బర్గ్‌ 2018 వ సంవత్సరంలో ౮110 వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగం వినిపించింది.
  • 1970 మధ్య కాలంలో అడవులు నరకవద్దని మొదలయిన ఉధ్యమం -- చిప్కో ఉధ్యమం .
  • చిప్కో అనగా హిందీ భాషలో అర్థం -- హత్తుకొనుట .
  • వినాయక చవితి నాడు ప్లాస్టర్‌ ఆప్‌ పారిస్‌ తో చేసిన విగ్రహాలు వాడడం మానేసి మట్టితో చేసిన విగ్రహాలు వాడాలి .
  • కిస్మస్‌ సందర్భంగా కొనిఫర్‌ చెట్లు నరకడం ఆపివేయాలి
  • అరటి ఆకుల్లో భోజనం ఆరోగ్యానికి మంచిది. అరటి ఆకు ఖనిజ లవణాలను కలిగి ఉంది.
  • వాతావరణంలో కలిగే అసాధారణ మార్పులను వాతావరణ మార్పు అంటారు.
  • వాతావరణ మార్చు ప్రభావాలు - వరదలు, మంచు కరగడం , అడవులు తగలబడడం, కరవు మొదలయినవి .
  • భూమి మీద ఉష్టోగ్రతలు వాతావరణ మార్పుల వలన ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి.
  • మనం ధరించే దుస్తులు
  •  
  • తయారు చేయు విధానం బట్టి దుస్తులు రకరకాలుగా ఉంటాయి
  • బట్టలు తయారు చేయడానికి వాడే ముడి సరకు మనకు ప్రధానంగా మొక్కలు, జంతువుల నుండి లభిస్తుంది .
  • మొక్కలు, జంతువులు నుండి లభించే దారాలు - సహజాదారాలు.
  • రసాయనాలు ఉపయోగించి యంత్రముల ద్వారా తయారు చేయు దారాలు - కృత్తిమ దారాలు
  • నూలు, జనపనార అనునవి మొక్కల నుండి తయారయ్యే సహజ దారాలు కు ఉదాహరణ .
  • పట్టు మరియు ఉన్ని అనునవి జంతువుల నుండి తయారయ్యే సహజదారాలుకు ఉదాహరణ .
  • నూలు మెత్తగా, తెల్లగా ఉంటుంది .
  • నూలు దారాలు దేని నుండి సేకరిస్తారు - పత్తి మొక్కలు .
  • పత్తి మొక్కల కాయలనుండి ముడి దారా . తీస్తారు
  • ముడిదారాలను చరఖా పై వడికి నాణ్యమైన దారాలు చేస్తారు
  • ఈ దారపు కండెలను మగ్గంపై నేస్తారు. వీటిని నూలు వస్త్రములు అంటారు
  • నూలు వస్త్రములు చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి
  • నూలు వస్త్రములు మన వాతావరాణానికి అనుకూలమైనవి
  • లెనిన్‌ దుస్తులు ఏ మొక్కల నుండి తయారు చేస్తారు - అవిసె మొక్కలు
  • జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్‌ దుస్తులు జనపనార నుండి తయారు చేస్తారు .
  • పట్టు మృదువైనది, అందమైనది .
  • పట్టుపురుగు యొక్క గొంగళి పురుగులు మల్టరీ ఆకులను తింటూ కకూన్‌ గా మారుతుంది
  • నాణ్యమైన పట్టు తయారు చేయడానికి కకూన్‌ లను ఉడికిస్తారు
  • శీతాకాలంలో ఉన్ని దుస్తులు ధరిస్తాము
  • గొర్రె బొచ్చు కత్తిరించి ఉన్నిని దారాలుగా వాడుకుతారు
  • పరిశ్రమలలో రసాయనాల ద్వారా తయారయ్యే వస్త్రలను సింధటిక్‌ వస్తల లేదా కృత్తిమ వస్తలు అంటారు
  • Ex: పాలీస్టర్‌, రేయాన్‌, నైలాన్‌, టెర్లిన్‌
  • గొడుగులు, రెయాన్‌ కోట్లు జలనిరోధిత గుడ్డతో తయారు చేస్తారు
  • మనం ధరించే దుస్తులు మన శరీరాన్ని కాపాడడమే కాకుండా మన సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి.
  • కేరళలో మగవాళ్ళు లుంగీ ధరిస్తారు
  • తమిళనాడులో మగవాళ్ళు చొక్కా, ధోతి ధరిస్తారు
  • రాజస్థాన్‌ లో మగవాళ్ళు కుర్తా ధరిస్తారు
  • చలి ప్రదేశాలలో నివసించే ప్రజలు ఉన్నితో తయారైన దుస్తులు ధరిస్తారు
  • వేడి ప్రదేశాలలో నూలు వస్త్రములు వాడతారు
  • రంగు దుస్తులను నీడలో ఆరవేయాలి. లేకపోతే అవి రంగును కోల్పోతాయి
  • గాలిని మనం చూడలేము. కానీ అనుభూతి చెందగలం
  • వీచే గాలిని పవనం అంటారు
  • తేలికపాటి పవనాన్ని బ్రీజ్‌ అంటారు
  • బలమైన పవనాన్ని గేల్‌ అంటారు
  • గాలికి బరువు ఉంది. ఒత్తిడి కలిగిస్తుంది స్థలాన్ని ఆక్రమిస్తుంది. శబ్దాలు, వాసనలు మోసుకెళుతుంది .
  • గాలి జత్తిడి (పీడనం) కారణంగా పువ్వుల పరిమళం మనం ఆస్వాదించగలం
  • గాలి జత్తిడి (పీడనం) కారణంగా గొట్టాలతో పండ్ల రసాలు తాగగలము .
  • గాలి జత్తిడి (పీడనం) వలన పవర్‌ హెడ్‌ టాంక్‌ నుండి నీళ్ళు తీసుకోగలుగుతున్నాం .
  • మన అవయువ వ్యవస్థల గురించి తెలుసుకుందాం
  • మన శరీరం వివిధ భాగాలలో నిర్మితమై ఉంటుంది
  • బాహ్య అవయువాలు -- చేతులు, కాళ్ళు, కళ్ళు మొదలయినవి
  • అంతర్గత అవయువాలు -- గుండె, ఊపిరితిత్తులు, కాలేయం , మూత్రపిండాలు మొదలయినవి
  • పెద్దవారిలో 206 ఎముకలుంటాయి
  • ఈ ఎముకలు ఒక చట్రంలా అమర్హబడి ఉంటాయి . ఈ చటాన్ని అస్థిపంజర వ్యవస్థ అంటారు
  • కండరాలు ఎముకలకు అతకబడి ఉంటాయి
  • ఎముకల పెరుగుదల, శరీరం పొడవు ఎదగడంలో సహాయపడును .
  • అస్థిపంజర వ్యవస్థ , కండరాలు కలసి శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇస్తాయి
  • మెదడును రక్షించేది - కపాలం
  • ఊపిరితిత్తులు, గుండెను రక్షించేవి - ఉరః పంజరం
  • మానవుని శరీరంలో 12 జతల ప్రక్కటేముకలు ఉంటాయి
  • మన శరీరాన్ని నిటారుగా ఉండేలా చేసేది - వెన్నెముక
  • మృదులాస్థి అనే మెత్తని ఎముకతో తయారయ్యే మన శరీరంలోని భాగం - బాహ్యచెవి (పన్నా), ముక్కు చివరి భాగం
  • మన శరీరంలో అతి పెద్ద ఎముక -- తొడఎముక (ఫీమర్‌
  • మన శరీరంలో చిన్న ఎముక -- చెవి ఎముక (స్టెప్స్‌ )
  • ఎముకలు కాల్షియం, ఫాస్ఫరస్‌ తో తయారవుతాయి .
  • మనం తీసుకున్న ఆహారం నోటిలోని దంతాల సహాయంతో నమలబడి లాలాజలంతో కలసి మెత్తగా చూర్ణంగా చేయబడును
  • నమలబడిన ఆహారం ఏ భాగం ద్వారా జీర్దాశయం లోనికి ప్రవేశిస్తుంది - ఆహారావాహిక
  • ఆహారం జీర్ణాశయంలో జీర్ణరసాలతో కలుస్తుంది
  • జీర్ణాశయం నుండి ఆహారం చిన్న పేగులోకి చెరీ పూర్తిగా జీర్ణం అవుతుంది
  • పూర్తిగా జీర్ణమైన ఆహారం ఎచట రక్తంలోనికి శోషించబడుతుంది -- చిన్న పేగు
  • జీర్ణంకాని ఆహారం పెద్ద పేగులోనికి చేరుతుంది
  • జీరం కానీ ఆహారంలోని కొంత నీరు పెద్ద పేగులో శోషించబడుతుంది
  • పెద్ద పేగులో జీర్ణం కానీ ఆహారం ఏ భాగం ద్వారా బయటకు విసర్జించబడుతుంది - పాయువు
  • సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణరసాలలో ఉండే ఎంజైమ్‌ ల సహాయంతో రక్తంలోనికి శోషించబడి సరళ పదార్ధాలుగా మారడాన్ని జీర్ణక్రియ అంటారు
  • చిన్న పేగు 6 మీటర్ల పొడవు ఉండి, ముడుతలు పడి ఉంటుంది
  • చిన్న పేగులో ఆహారం జీర్ణమై రక్తంలో శోషించబడే దాకా ఉండడానికి ఈ ముడతలు సహాయపడతాయి .
  • నిరంతరం గాలిని పీల్లుకుంటూ, విడిచి పెడుతూ ఉండే ప్రక్రియను శ్వాస క్రియ అంటారు.
  • గాలి పీల్లడాన్ని ఉచ్చాసం అంటారు
  • గాలి విడిచి పెట్టడాని నిచ్చ్వాసం అంటారు.
  • శ్వాస వ్యవస్థలో భాగాలు -- ముక్కు, గాలిగొట్టం, ఊపిరిత్తులు
  • ముక్కుతో పిల్లుకున్న గాలి, గాలి గొట్టం ద్వారా ఊపిరితిత్తులు ఏ కుహరంలో ఉంటాయి -- ఉరః కుహరం
  • ఒక జత ఊపిరితిత్తులు స్పాంజీ ఆకారంలో ఉరః కుహరంలో ఉంటాయి .
  • మనం పీల్చే గాలిలో ఉన్న ఆక్సిజన్‌ ఆహార పదార్ధాలను విచ్చిన్నం చేసి, శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది .
  • ఉచ్చ్వాస సమయంలో ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి .
  • నిశ్వాస సమయంలో ఊపిరితిత్తులు సంకోచిస్తాయి
  • ఉచ్చ్వాస సమయంలో పీల్దే గాలిలో ఉన్న ఆక్సిజన్‌ ఊపిరితిత్తులలో చేరి ,రక్తంతో కలసి, కణాలను చేరి శక్తిని విడుదల చేస్తుంది
  • ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే కార్టన్‌ డై ఆక్సైడ్‌, నీటి ఆవిరి ఊపిరితిత్తుల నుండి బయటకు రావడాన్ని నిశ్వాసం అంటారు
  • రక్త ప్రసరణ వ్యవస్థలో భాగాలు -- గుండె, రక్తం, రక్తనాళాలు
  • రక్తాన్ని రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్నీ భాగాలకు పంపు చేసేది మరియు స్వీకరించేది - గుండె
  • రక్తనాళాలు ధమనులు, సిరలుగా ఉంటాయి .
  • మంచి రక్తాన్ని గుండె నుండి ఇతర శరీర భాగాలకు తీసుకుని వెళ్ళేవి - ధమనులు
  • పుపస ధమనులలో చెడు రక్తం ఉంటుంది
  • శరీర భాగాలు నుండి ఆక్సిజన్‌ లేని రక్తాన్ని గుండెకు చేరవేసేవి - సిరలు
  • పుపుస సిరలలో మంచి రక్తం ప్రవహిస్తుంది .
  • గుండె ఛాతిలో ఎడమ వైపు ఉంటుంది
  • గుండెలో గల గదులు - 4
  • గుండెలో పైన ఉన్న 2 గదులను కర్ణికలు, కింద ఉన్న రెండు గదులను జఠరికలు అంటారు.
  • గుండె మోటారు పంపు వలె పనిచేస్తుంది .
  • గుండె రక్తాన్ని పంపు చేసేటపుడు లబ్‌ - డబ్‌ ఆన్‌ శబ్దం వస్తుంది
  • ఆక్సిజన్‌ మరియు ఇతరపోషకాలను శరీర భాగాలకు సరఫరా చేసేది - రక్తం
  • రక్తం శరీర ఉష్ణోగ్రతను నియంతిస్తుంది
  • రక్తం రోగకారక క్రిములతో పోరాడుతుంది .
  • కార్టన్‌ డై ఆక్సైడ్‌ లాంటి వ్యర్ద పదార్ధాలను శరీరం నుండి తొలగించడంలో రక్తం సహాయపడుతుంది
  • రక్తంలో 3 రకాల కణాలుంటాయి
  • 1. ఎర్ర రక్త కణాలు
  • 2. తెల్ల రక్తకణాలు
  • 3. రక్త ఫలకికలు
  • రక్తం నకు ఎరుపు రంగు కలిగించే వర్ణకదార్థం - హిమో గ్లోబిన్‌
  • రక్తంలో హిమోగ్లోబిన్‌ తక్కువ అవడం వలన పిల్లలు రక్త హీనతతో బాధపడుతారు .
  • పల్లీలు , చిక్కిలు తినడం వలన శరీరానికి తగినంత రక్తం వస్తుంది .
  • AP ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పిల్లలకు హిమోగ్లోబిన్‌ పెంచడానికి పల్లీ చిక్కిలు సరఫరా చేస్తుంది
  • మన శరీరంలో అధికమైన, అనవసరమైన పదార్ధాలను బయటకు పంపిచే వ్యవస్థను విసర్జన వ్యవస్థ అంటారు
  • మన శరీరంలో 3 రకాల విసర్జక అవయువాలు కలవు -- 1. చర్మం 2.మూత్రపిండాలు 3.ఊపిరితిత్తులు
  • మన శరీరంలో రెండు మూత్రపిండాలు ఉదరకుహరంలో వెన్నెముకకు ఇరుప్రక్కలా ఉంటాయి .
  • మూత్ర పిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి
  • మూత్ర పిండాలు రక్తాన్ని వడగొట్టి రక్తంలోని మలినాలను తొలగిస్తాయి
  • ఈ మలినాలు మూత్రం రూపంలో బయటకు విసర్జించబడతాయి
  • ఊపిరితిత్తులు స్పాంజీ వంటి నిర్మాణాలు .
  • శ్వాసకియలో పీల్లుకున్న గాలిలోని ఆక్సిజన్‌ ఊపిరితిత్తులకు చేరి రక్తంలో కలుస్తుంది .
  • నిచ్చ్వాస క్రియలో కార్టన్‌ డై ఆక్సైడ్‌ ఊపిరితిత్తులనుండి బయటకు పంపి వేయబడుతుంది
  • మన శరీరంలో పైకి కనిపించే అతిపెద్ద విసర్ణ్ణో అవయువం -- చర్మం
  • చర్మం చెమట గ్రంథులని కలిగి ఉంటుంది .
  • మన శరీరంలోని అదనపు నీటిని, లవణాలను చెమట రూపంలో బయటకు విసర్జించేది - చర్మం
  • చెమట చర్మంలో స్వేద రంధ్రముల ద్వారా బయటకువస్తుంది
  • మెదడు నాడుల ద్వారా మన శరీరాన్నినియం త్రిస్తుంది .
  • నాడీ వ్యవస్థలో భాగాలు -- మెదడు, వెన్నెముక, నాడులు
  • శరీర భాగాల నుండి మెదడుకు, మెదడు నుండి శరీర భాగాలకు సమాచారాన్ని తీసుకు వెళ్ళేవి - నాడులు
  • జ్ఞానేంద్రియాలన్నీ నాదుల ద్వారా మెదడుతో కలుపబడతాయి
  • చంద్ర శేఖర్‌ వెంకట్రమన్‌ - 1888 - 1970
  • ASK the right questions and nature will open the doors to her secrets
  • CV రామన్‌ తమిళనాడులోని తిరచిరాపల్లిలో 1888 నవంబర్‌ 7న జనించారు
  • మద్రాసు విశ్వవిద్యాలయంలో చదివారు.
  • 1928 ఫిభ్రవరి 28న రామన్‌ ఎఫెక్ట్‌ కనుగొన్నారు
  • 1930 వ సంవత్రంలో CV రామన్‌ కు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది
  • ప్రతిసంవత్సరం ఫిభ్రవరి 28న జాతీయ సైన్స్‌ దినోత్సవం జరుపుకుంటారు
  • CV రామన్‌ గారికి 1954 వ సంవత్సరంలో భారతరత్న లభించింది
  • 1970 నవంబర్‌ 21 న 6౪ రామన్‌ గారు బెంగుళూరులో మరణించారు
  • వ్యవసాయం
  • వరిసాగులోని వివిధ దశలు:-
  • 1. పొలాన్ని దుక్కిదున్నడం:- మొదట రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్దం చేస్తారు. ఎడ్లతో గాని, టాక్టర్‌ తో గాని పొలాన్ని దున్నుతారు
  • 2. చదును చేయడం :- దున్నిన పొలాన్ని నీటితో నింపి నాట్లు వేయడానికి చదును చేస్తారు
  • 3. నాట్లు వేయడం: రైతులు వారి మదుల నుండి తెచ్లి చదును చేసిన పొలంలో నాటుతారు
  • 4. నీరు పెట్టడం :
  • 5. ఎరువులు వేయడం
  • 6. సస్వరక్షణ:. మొక్కలకు వ్యాధులు సోకుండా నివారించడానికి కిమీ సంహారక మందులు వాడతారు
  • 7. పంటకోత
  • 8. నూర్చడం
  • 9. తూర్చారబట్టడం :- తూర్పార బట్టడం ద్వారా గింజలను ఊకను వేరు చేస్తారు
  • 10. నిల్వచేయడం
  • 11. మర పట్టించడం :
  • పొలానికి నీటి సరఫరా చేయడాన్ని నీటి పారుదల అంటారు.
  • వరిని నీటి ఆధారిత పంటగా చెపుతారు...
  • వ్యవసాయానికి నీటి సరఫరా 4 రకాలుగా చేస్తారు
  • 1. క్షేత్ర నీటి పారుదల :- వర్ష పాఠం తగినంతగాలేనపుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు
  • 2.చాళ్ళు నీటి పారుదల :. చాళ్ళు మరియు కందకాలు తవ్వివాటి ద్వారా పొలానికి నీటి పారుదల చేస్తారు
  • 3. స్రింక్లర్‌ నీటి పారుదల :. నియంత్రిత పద్దతిలో ప్రత్యక్ష పైపుల ద్వారా వర్షం వలె నీటిని చల్లుతారు
  • 4.బిందు సేద్యం:- నీటి గొట్టానికి చిన్న రంధ్రములు చేసి నేలపై ఉంచి నీరు ఆ రంధ్రముల ద్వారా నేరుగా మొక్కల వేర్లకు చేరే ఏర్పాటు చేస్తారు
  • వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ పనిముట్లకు ఉదా:- నాగలి, గడ్డపార, కొడవలి, విత్తనాలు చల్లు గొర్రు.
  • ఆధునాతన వ్యవసాయ పనిముట్లకు దాహరణ -- వరినాట్ల యంత్రం, వరి కోత యంత్రం
  • మొక్కల పెరుగుదల పంట దిగుబడి, నేల సారంపై ఆధారపడి ఉంటుంది
  • ఎరువులు ఉపయోగించడం వలన పంట పెరుగుదల, దిగుబడి పెంచవచ్చు .
  • సహజ ఎరువులకు ఉదాహరణ :- కంపోస్ట్‌, మొక్కల అవశేషాలు, ఆవుపేడ, జంతువుల విసర్జితాలు
  • రసాయన ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని తగ్గిస్తాయి
  • గొంగళి పురుగు మాత్‌ గా మారి పంటను నాశనం చేస్తుంది
  • గొంగళి పురుగు వివిధ దశలలో పంటను నాశనం చేస్తుంది .
  • పరాగసంపర్కం మరియు విత్తనాలు పర్పడడంలో ప్రముఖపాత్రవహించేవి - సీతాకోకచిలుక, తేనెటీగ
  • సీతాకొక చిలుక జీవిత చరిత్ర :- గుడ్డు - లార్వా - ప్యూపా - ఇమాగో
  • కప్ప లార్వాను ఏమని పిలుస్తారు - టాడ్‌ పోల్స్‌ (తోక కప్పలు)
  • టాడ్‌ పోల్‌ చిన్న చేపను పోలి ఉంటుంది
  • టాడ్‌ పోల్‌ తరువాత కప్పగా మారుతుంది
  • కప్ప జీవిత చక్రం:- గుడ్ల సమూహం -- టాడ్‌ పోల్‌ - కాళ్ళు కలిగిన టాడ్‌ పోల్‌ - చిరుకప్ప - కప్ప
  • కప్ప టాడ్‌ పోల్‌ గా ఉన్నపుడు శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుంది
  • కప్పగా మారిన తరువాత కీటకాలను తిని ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుతాయి
  • పర్యావరణం దెబ్బతినడం గురించి తలియచేయడంలో మంచి సూచికలు -- కప్పలు, సీతాకొక చిలుకలు
  • కిమిసంహరక మందుల అధిక వాడకం అనునది కాన్సర్‌ వంటి రోగాలకు కారణం అవుతుంది
  • రైతులు సేంద్రీయ వ్యవసాయ పద్దతులు ఉపయోగించాలి
  • సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగించే ఎరువులు - పశువులవ్యర్దాలు , వర్షి కంపోస్ట్‌, నూనె మరియు జీవవ్యర్జాలు
  • సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం చేయడాన్ని - ZBNF అంటారు
  • ZBNF అనగా జీరోబడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌
  • సేంద్రీయ వ్యవసాయం వలన లాభాలు
  • 1. పర్యావరణ పరిరక్షణ
  • 2. కాలుష్యం తగ్గిస్తుంది
  • 3. నీటిని పొదుపు చేస్తుంది
  • 4. నేల కోత తగ్గిస్తుంది
  • 5. నేల సారం పెంచుతుంది
  • ధాన్యాన్ని ఎండబెట్టి గాలి, వెలుతురు ఉన్న గదులలో నిలువచేస్తారు.
  • ధాన్యాన్ని గదిలో నిలువచేసే ముందు పురుగు మందులు చల్లి గదిని శుభ్రం చేస్తారు .
  • ఆధునిక నిలువ చేయు పద్ధతిలో ధాన్యాన్ని గోదాములలో, శీతలీకరణ గోదాములలో నిల్వ చేస్తారు
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమైన పంట వరి
  • మన రాష్ట్రంలో 62 శాతం మండి వ్యవసాయం ముఖ్యమైన వృత్తిగా కలిగి ఉన్నారు
  • శ్రీకాకుళంలో ప్రధాన పంట -- వరి
  • విశాఖపట్టణంలో ప్రధాన పంట -- పసుపు
  • విజయ నగరంలో ప్రధాన పంట -- అరటి
  • తూర్పు గోదావరి ప్రధాన పంట -- వరి
  • పశ్చిమ గోదావరి ప్రధాన పంట -- వరి, అరటి
  • కృష్ణలో ప్రధాన పంట -- వరి, పశు గ్రాసం , పసుపు
  • గుంటూరులో ప్రధాన పంట -- వరి, పశుగ్రసం, జొన్న, పసుపు, టమాటా
  • ప్రకాశంలో ప్రధాన పంట -- పశుగ్రసం, జొన్న, కమలాలు
  • నెల్లూరులో ప్రధాన పంట -- వరి
  • కడపలో ప్రధాన పంట -- అరటి, టమాటా, కమలా, జొన్నలు
  • కర్నూలులో ప్రధాన పంట - టమాటా, కమలా, కీర, పసుపు, అరటి, జొన్న
  • చిత్తూరులో ప్రధానపంట -- టమాటా, పశుగ్రసం, కీర
  • అనంతపురంలో ప్రధానపంట - టమాటా, అరటి, కమల, వరి, కీర
  • చిరుధాన్యాలకు ఉదాహరణ -- కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఉదలు
  • వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్వత్తి చేయడంలో భారత దేశం ఎన్నవ స్థానంలో ఉంది - 2వ
  • మన ఆరోగ్యం మన ఆహార అలవాట్ల పై ఆధారపడి ఉంటుంది
  • మన ఆహారంలో పిండిపదార్థాలు, ప్రోటి లు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండాలి
  • నీరు ఎంతో విలువైనది
  • గ్రామాలలో చెరువులు, నూతులు, బోరుబావులు ప్రధానమైన నీటి వనరులు
  • నీటికి ప్రధాన వనరు - వర్షపు నీరు
  • వర్షపు నీటిని నిల్వచేయుటకు చెరువులు నిర్మిస్తాం
  • నదులలో నీరు నిల్వ చేయుటకు ఆనకట్టలు, జలాశయాలు నిర్మిస్తాం
  • జలాశయాలలో నీటి మట్టం పెంచడానికి నాదివాలుకి అడ్డుగా నీటిని నిలువ చేయుటకు నిర్మించబడిన అడ్డుకట్ట ను ఆనకట్ట అంటారు
  • మన రాష్ట్రంలో ముఖ్య నదులు - గోదావరి, వంశధార, పెన్నా
  • మన రాష్ట్రంలో ఉన్న జలాశయాలు -- పులిచింతల, తెలుగుగంగ, తోటతల్లి బ్యారేజ్‌, కండలేరు జలాశయం, వెలుగొండ
  • నాగార్జున సాగర్‌ , శ్రీశైలం ఆనకట్టలు ఏ నదిపై నిర్మించారు - కృష్ణానది
  • సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారెజ్‌ గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద నిర్మించబడింది
  • సర్‌ ఆర్థర్‌ థామస్‌ కాటన్‌ బ్రిటీష్‌ దేశానికి చెందిన నీటి పారుదల శాఖ ఇంజనీరు
  • గోదావరి నదిపై తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం మరియు పచ్చిమ గోదావరి జిల్లా విజ్ణేశ్వరం మధ్యలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించింది - సర్‌ ఆర్థర్‌ థామస్‌ కాటన్‌
  • భారతదేశంలో పొడవైన నదులలో కృష్ణానది 4వ స్థానంలో ఉంది
  • కృష్ణానది మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం వద్ద జన్మించింది
  • కృష్ణానది పొడవు సుమారు 1400 km
  • కృష్ణానదికి మరొకపేరు - కృష్ణవేణి
  • కృష్ణ నది మహారాష్ట్ర, AP, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలకు నీటి వనరు .
  • కృష్ణానది ఉపనదులు = భీమ , గాయతి, ఘటప్రభ, కోయన , మలప్రభ, మున్నేరు, నీర, పాలెం, పంచగంగ, తుంగబథ్ర, వేమన, వ్యర
  • కృష్ణానది కృష్ణాజిల్లా లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది
  • నాగార్జున సాగర్‌ అనే బహళార్ధక ప్రజెక్ట్‌ కృష్ణా నదిపై ఏ సంవత్సరంలో నిర్మించబడింది - 1967
  • నాగార్జున సాగర్‌ ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లా నాగార్జున కొండ, తెలంగాణా రాష్ట్రంలో నల్గొండ జిల్లా మధ్యలో నిర్మించారు
  • నాగార్జున సాగర్‌ కు 2 కాలువలు ఉన్నాయి
  • 1. కుడికాలువ         2. ఎడమ కాలువ
  • నాగార్జున సాగర్‌ కుడి కాలువను పమంటారు - జవహర్‌ కాలువ
  • నాగార్జున సాగర్‌ ఎడమ కాలువను ఏమంటారు -- లాల్‌ బహుదూర్‌ కాలువ
  • ప్రకాశం బ్యారేజ్‌ విజయవాడలో కృష్ణా నదిపై నిర్మించారు .
  • ప్రకాశం బ్యారేజ్‌ పొడవు - 1.2 km
  • ప్రకాశం బ్యారేజ్‌ ఏ రెండు జిల్లాల మధ్య ఉంది - కృష్ణా, గుంటూరు
  • ప్రకాశం బ్యారేజ్‌ ప్రారంభమైన సంవత్సరం -- 1957
  • ప్రకాశం బ్యారేజ్‌ ప్రారంభించింది -- ప్రకాశం పంతులు
  • ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి - శ్రీ టంగుటూరి ప్రకాశం
  • కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాలు - మహాబళేశ్వరం , ఆలంపూర్‌ జోగులాంబ , విజవాడ
  • కనకదుర్గ , అమరావతి అమరలింగేశ్వరుడు
  • కృష్ణానది ఒడ్డున గల నగరాలు -- విజయవాడ (AP) ,సింగిలి , కరడ (మహారాష్ట్ర
  • వంశధార నది ప్రవహించే జిల్లా - శ్రీకాకుళం
  • నాగావళి నది ప్రవహించే జిల్లా - శ్రీకాకుళం, విజయనగరం
  • గోదావరి నది ప్రవహించే జిల్లాలు -- తూర్పు, పశ్చిమ గోదావరి
  • పెన్నా నది ప్రవహించే జిల్లాలు - అనంతపురం, కడప, నెల్లూరు
  • కృష్ణానది చేపలు పట్టేవారికి జీవనాధారం .
  • AP టూరిజం శాఖ శ్రీశైలం వద్ద కృష్ణానది నిలువ జలాలతో బోట్‌ రైడింగ్‌ సౌకర్యం ఏర్పరచింది
  • విజయవాడలో భవానీ బ్వీపం ఒక పర్యాటక ప్రదేశం
  • 2009 కర్నూలు నగరంలో ఏ నది వలన వరద వచ్చింది - తుంగభథ్ర
  • కర్నూలు వరదలలో 30 అడుగుల ఎత్తు వరకు మునిగిపోయారు
  • కర్నూలులో నీరు తొలగించుటకు ౩ రోజుల సమయం పట్టింది
  • 2019 కృష్ణానది వరదల వలన కృష్ణా, గుంటూరు జిల్లా లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి.
  • పాముల లంక గ్రామం వరదలకు లోనయ్యే ప్రాంతం . ఇది తోట్లవల్లూరు మండలం, కృష్ణాజిల్లాలో గలదు
  • వర్షాభావ పరిస్థితులకు ఉదాహరణ -- అనంతపురం జిల్లా
  • మనకు ఎవరు సేవ చేస్తారు
  • ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించే ఒక సేవాసంస్థ -- ప్రభుత్వం
  • మనదేశంలో 3 స్థాయిలలో ప్రభుత్వాలు ఉన్నాయి
  • 1. స్థానిక ప్రభుత్వం
  • 2. రాష్ట్ర ప్రభుత్వం
  • 3. కేంద్ర ప్రభుత్వం
  • స్థానిక ప్రభుత్వం : గ్రామాలు, పట్టణాలలో, నగరంలో ఉండే స్థానిక ప్రభుత్వాన్ని స్థానిక ప్రభుత్వం అంటారు.
  • ఉదాహరణ: గ్రామపంచాయితీ, మండల పరిషత్‌,జిల్లా పరిషత్‌, పురపాలక మరియు నగర పాలక సంస్థలు
  • గ్రామపంచాయితీ :
  • గ్రామపంచాయితీ గ్రామంలో నివసించే ప్రజల బాగోగులు చూసుకుంటుంది.
  • 18 సంవత్సరాలు పైబడిన గ్రామస్తులచే గ్రామపంచాయితీ సభ్యులు ఎన్నుకోబడతారు .
  • పంచాయితీ సభ్యులను 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకొంటారు
  • గ్రామపంచాయితీ పెద్దను ఏమంటారు - సర్పంచ్‌
  • సర్పంచ్‌ పదవీ కాలం - 5 సంవత్సరాలు
  • గ్రామీణ ప్రాంత ప్రజలకు వారికి కావలసిన సేవలు పారదర్శకతతో అందించడానికి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులచే ఏర్పాటు చేసిన వ్యవస్థ -- గ్రామ సచివాలయం
  • గ్రామ సచివాలయంలోని ఉద్యోగుల సంఖ్య - 11
  • మండల పరిషత్‌ :
  • కొన్ని గ్రామాలు కలసి ఒక మండలం ఏర్పడుతుంది
  • మన రాష్ట్రంలో గల మండలాలు - 676
  • మండల స్థాయిలోని అన్నీ సంక్షేమ, అబివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేది - మండల అబివృద్ధి అధికారులు
  • మండల పరిషత్‌ అధ్యక్షుడు మండల పరిషత్‌ సభ్యులచే ఎన్నుకోబడతారు
  • MPTC అనగా  – mandal parishath territoriyal council
  • MPTC పదవీకాలం - 5 సంవత్సరాలు
  • మండల పరిషత్‌ కార్యాలయం -- విధులు:
  • మండల పరిషత్‌ కార్యాలయానికి అధిపతి - మండల అభివృద్ధి అధికారి (MPDO)
  • ప్రాధమిక విద్య అందేలా చూస్తుంది
  • వ్యవసాయం, పశువుల పెంపకం, చేపల పెంపకం, కోళ్ళ పరిశ్రమల అబివృద్ధిలో పాల్గొంటుంది .
  • రోడ్డు, నీటిపారుదల నిర్మాణం మరియు మరమత్తులు చేస్తుంది
  • రక్షిత మంచినీరు అందించడం, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, మురికి నీటి పారుదల సౌకర్యం వంటివి కల్పిస్తుంది .
  • పోలీస్‌ స్టేషన్‌ - విధులు:
  • దీనికి అధిపతి - సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ (SI)
  • శాంతి భధ్రతలు కాపాడుతుంది
  • ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి , నమోదు చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తుంది .
  • మండల రెవిన్యూ కార్యాలయం -- విధులు:
  • దీనికి అధిపతి -- తహసీల్డార్‌
  • గ్రామరెవిన్యూ అధికారుల (VRO) పనితీరు పర్యవేక్షిస్తారు .
  • MPDO తో కలసి అవసరం ఉన్నవారికి సంక్షేమ కార్యక్రమాలు అందచేస్తారు .
  • కులధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రము అందచేస్తారు.
  • వెట్టి చాకిరీ చేయు ప్రజలకు విముక్తి కలిగిస్తారు .
  • రైతులకు పట్టుదారు పాస్‌ పుస్తకాలు మంజూరు చేస్తారు .
  • భూ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తారు .
  • ఎన్నికలు నిర్వహిస్తారు.
  • ప్రాధమిక ఆరోగ్య కేంద్రం -- విధులు:
  • దీని అధిపతి - ఆరోగ్య అధికారి .
  • ఉప ఆరోగ్య కేంద్రములు నిర్వహించి వాటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.
  • మండలంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేస్తారు .
  • తల్లి బిడ్ద సంక్షేమం - పథకంలో భాగంగా సురక్షిత మైన కాన్సులకు బాధ్యత వహిస్తారు .
  • బ్యాంక్‌ - విధులు:
  • దీని అధిపతి - బ్యాంక్‌ నిర్వహణ అధికారి (Bank Manager)
  • ప్రజలనుండి సొమ్ము సేకరించి ఖాతాలో జమచేయడం, అవసరమైన వారికి రుణాలు అందజేస్తారు.
  • పొదువు మరియు డిజిటల్‌ లావాదేవీలు చూస్తారు.
  • మండల విద్యా వనరుల కేంద్రం:
  • దీని అధిపతి - మండల విద్యాశాఖాధికారి (MEO)
  • బడి ఈడు గల పిల్లలను పాఠశాలలో నమోదు చేస్తారు .
  • బడిలో పిల్లలకు మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య ఇతర కార్యక్రమాల అమలు పర్యవేక్షిస్తారు.
  • పశు వైద్యశాల:
  • దీని అధిపతి - పశువైద్యాధికారి
  • పశువుల ఆరోగ్యం సంరక్షణ, గాయపడిన జంతువులకు వైద్యం అందిస్తారు
  • జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులను గుర్తించి వాటికి నివారణ, వాటికి ఇవ్వవలసిన బలవర్జకం అయిన ఆహారంపై రైతులకు అవగాహన కల్పిస్తారు
  • జిల్లా పరిషత్‌:
  • కొన్ని మండలాలు కలసి జిల్లా ఏర్పడుతుంది
  • మన రాష్ట్రంలో గల జిల్లాలు - 13
  • ప్రజల సంక్షేమం కొరకు జిల్లాన్ధాయిలో అనేక కార్యక్రమాలు అమలు పరచేది - జిల్లా పరిషత్‌
  • ZPTC సభ్యులను ఎన్నుకునేది - మండలంలోని ఓటర్లు
  • ZPTC అనగా  – zilla parishath territorial council
  • ZPTC సభ్యులు అందరూ కలిసి జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు
  • జిల్లాలోని అన్నీ ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించేది - జిల్లా కలెక్టర్‌
  • పురపాలక మరియు నగర పాలకసంస్థలు:
  • పట్టణాలలో గల స్థానిక ప్రభుత్వం - పురపాలక సంస్థ
  • నగరాలలో గల స్థానిక ప్రభుత్వం - నగర పాలక సంస్థ
  • మన రాష్ట్రంలో గల పురపాలక సంస్థలు - 74
  • మన రాష్ట్రంలో గల నగరపాలక సంస్థలు - 16
  • పురపాలక సంఘ అధిపతి -- చైర్మన్
  • నగరపాలక సంస్థ అధిపతి - మేయర్‌
  • వగరపాలక పురపాలక సంస్థ విధులు:
  • 1. వీధి దీపాల ఏర్పాటు
  • 2. జనన,మరణాల నమోదు
  • 3. గృహాలు,పార్కుల నిర్మాణం
  • 4. ఆసుపత్రుల ఏర్పాటు
  • 5. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు నిర్వహణ
  • 6. రక్షిత మంచి నీటి సౌకర్యం కల్పించడం
  • 7. చెత్తను శుభ్రం చేయడం, వ్యర్థ పదార్థాలు తొలగించడం
  • రాష్ట్ర ప్రభుత్వం:
  • ప్రతి రాష్ట్రానికి సొంత ప్రభుత్వం ఉంటుంది.
  • రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి మరియు మంత్రి మండలి కలిగి ఉంటుంది.
  • AP గవర్నర్‌ - శ్రీ బిశ్వఛందన్‌ హరిభూషన్‌ గారు
  • AP ముఖ్యమంతిరి - శ్రీ ys జగన్మోహన్‌ రెడ్డి గారు
  • AP విద్యాశాఖామంత్రి -- శ్రీ బొత్స సత్యనారాయణ .
  • రాష్ట్రంలో చట్టాలు రూపోందించుకోవడంలో, వాటిని అమలు పరచడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది.
  • మంత్రి మండలిని ఎవరు నియమిస్తారు - ముఖ్యమంత్రి సలహామేరకు గవర్నర్‌.
  • కేంద్ర ప్రభుత్వం:
  • కేంద్ర ప్రభుత్వానికి అధిపతి - రాష్ట్ర పతి
  • ప్రధాన మంత్రి నియమించేది - రాష్ట్ర పతి
  • కేంద్ర మంత్రి మండలిని ఎవరు నియమిస్తారు - ప్రధాన మంత్రి సలహామేరకు రాష్ట్రపతి .
  • తపాలా, రైల్వేలు, టెలికాం,విమానాశ్రయాలు,ప్రకృతి విపత్తులు నిర్వహణ వంటి సేవలు అందించేది - కేంద్ర ప్రభుత్వం
  • రాష్ట్రాలలో అత్యున్నత న్యాయ వ్యవస్థ -- హైకోర్టు
  • దేశంలో అత్యున్నత న్యాయవ్యవస్థ - సుప్రీం కోర్టు
  • ప్రభుత్వ సంస్థలు ప్రజలు ప్రాధమిక అవసరాలు తీరుస్తాయి.
  • పప్రపంచాన్ని చుసివద్దాం
  • రాయచోటి ఏ జిల్లాలో గలదు - కడప .
  • విశాఖపట్టణంలో అంతర్జాతీయ విమానాశ్రయం కలదు .
  • కృష్ణపట్నం ఓడరేవు ఏ జిల్లాలో గలదు -- నెల్లూరు
  • ఒకదేశం నుండి ఇంకొక దేశానికి వెళ్లడానికి అంతర్జాతీయ రవాణా వ్యవస్థ ఉపయోగిస్తాం .
  • విదేశాలకు వెళ్లడానికి ప్రధాన మార్గాలు - వాయుమారాలు, జలమార్గాలు .
  • జలప్రయాణానికి వాయు మార్గంతో పొలిస్తే ఖర్లు తక్కువ, సమయం ఎక్కువ పడుతుంది .
  • శ్రీకాకుళం జిల్లా కింతలి గ్రామంలో రైతులు పండ్లుకూరగాయలు, ఆకుకూరలు పండించి మార్కెట్‌ లలో అమ్ముతారు .
  • మన ప్రదేశంలో తయారు చేయు ఉత్పత్తులు అధికంగా ఉంటే ఇతర ప్రదేశాలకు పంపబడతాయి. ఈ పద్ధతిని ఎగుమతి అంటారు.
  • ఎగుమతుల ద్వారా లభించేది - విదేశీ కరెన్సీ
  • విదేశీ కరెన్సీ ఆయాదేశాల ఆర్థిక వృద్ధికి సహాయపడును.
  • మనకు అవసరమైన ఉత్పత్తులు ఇతర ప్రాంతముల నుండి దిగుమతి చేసుకుంటారు .
  • పూసర్ల వెంకట సింధు బ్యాట్మింటన్‌ క్రీడాకారిణి.
  • 2016 లో PV సింధు ప్రపంచ బ్యాట్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ లో స్వర్ణ పథకం గెలుచుకుంది.
  • PV సింధు ఆటలలో పాల్గొనడం కోసం స్విట్టర్లాండ్‌, మలేషియా, రియోడి జెనీరో వంటి ప్రదేశాలు దర్శించింది .
  • PV సింధు భారత ప్రభుత్వం నుండి పొందిన పురస్కారాలు - పద్మ భూషణ్‌, పద్మశ్రీ, రాజీవ్‌ ఖల్‌ రత్న
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ౧౪ సింధు ఏ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సత్కరించింది - డిప్యూటీ కలెక్టర్‌
  • ఆంధ్రా కాశ్మీర్‌ గా పిలవబడే ప్రదేశం - లంబసింగి
  • లంబసింగి విశాఖపట్టణం జిల్లాలో ఉన్న గిరిజన ప్రాంతం. .
  • గ్లోబల్‌ విలేజ్‌ అనగా ప్రపంచం ఒక కుగ్రామం అని అర్థం .
  • సమాచార వ్యవస్థ మరియు రవాణా వ్యవస్థలు కలిసి ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేశాయి.కావున మొత్తం ప్రపంచాన్ని గ్లోబల్‌ విలేజ్‌ అంటున్నాం.
  • సమాచార, రవాణా వ్యవస్థలను ఇంటర్నెట్‌ విపరీతంగా ప్రభావితం చేసి ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్షి వేసింది .
  • గ్లోబలైజేషన్‌ వలన ప్రజల మధ్య దూరం తగ్గించబడింది. ప్రపంచంలో ఏ ప్రదేశంలో ప్రజలైనా చేరుకోదగ్గ విధంగా కనెక్ట్‌ చేయబడింది .
  • ప్రమాదాలు -  ప్రధమ చికిత్స
  • పాఠశాలలో అగ్ని ప్రమాదాలు నివారించడానికి ప్రతి పాఠశాల యందు మంటలను ఆర్పే యంత్రము ఏర్పాటు చేయాలి.
  • గోడలపై 6 అడుగుల కంటే ఎత్తులో స్విచ్‌ బోర్డ్‌ లు ఏర్పాటు చేయాలి .
  • వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం ర్యాంప్‌ నిర్మించాలి .
  • రోడ్లను దాటడానికి zebra crossing ఉపయోగించాలి .
  • హాస్పిటల్‌ కు వెళ్ళే లోపు బాధితుడుకు అందచేయు తక్షణ చికిత్సను ప్రధమ చికిత్స అంటారు.
  • ప్రధమ చికిత్స పెట్టె (+) ఆకారపు గుర్తు కలిగిఉంటుంది .
  • ప్రధమ చికిత్స పెట్టెలో ఉండేవి - దూది, టింక్షర్‌, అయోడిన్‌, అయింట్‌ మెంట్‌ , మెడికేటెడ్‌ ప్లాస్టర్‌, కత్తెర, బ్యాండెజ్‌ క్లాత్‌, యాంటీసెప్టిక్‌ క్రీం, పెట్రోలియం జెల్లీ, సబ్బు, జ్వరమానిని .
  • అ) గాయాలకు ప్రధమ చికిత్స
  • 1. తడి దూదిని ఉపయోగించి గాయాన్ని సబ్బు నీటితో గాని, సెప్టిక్‌ లోషన్‌ తో గాని శుభ్రం చేయాలి.
  • 2. దూదితో టింక్షర్‌ ఆయోడిన్‌ ను గానీ, యాంటీసెప్టిక్‌ క్రీము గాని రాయాలి.గాజు గుడ్డతో కట్టుకట్టి పైన ప్లాస్టర్‌ వేయాలి
  • ఆ) కాలిన గాయాలకు ప్రధమ చికిత్స
  • 1. కాలిన గాయం పై కొంత సేపు చల్లని నీరు పోయాలి
  • 2. కాలిన గాయం తీవ్రమైనది అయితే లేపనం పూయాలి
  • 3. కాలిన గాయం పైన ఏర్పడిన నీటి బొబ్బలను చిదమకూడదు,కట్టు కట్టకూడదు, రుద్దకూడదు, ఐస్‌ ఉపయోగించకూడదు
  • ఇ) కుక్క కాటుకు ప్రధమ చికిత్స
  • 1. కుక్క కరిచిన ప్రదేశమును సబ్బు లేదా యాంటీసెప్టిక్‌ లోషన్‌ కడగాలి .
  • 2. గాయాన్ని ప్లాస్టర్‌ తో గానీ గాజుగుడ్డతో కానీ కట్టుకట్టకూడదు .
  • ఈ) పాము కాటుకు ప్రధమ చికిత్స
  • 1. మొదట కాటు వేయబడిన భాగాన్ని నిశితంగా పరిశీలించి,విష సర్పమో కాదో నిర్ధారించుకోవాలి .
  • 2. సాధారణంగా పాము కాటుకు గురైన వ్యక్తి భయంతో స్పృహ తప్పి పడిపోతాడు అతని భయం తగ్గించేలా మాట్లాడాలి.
  • 3. విషం శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా ఒక గుడ్డతో గాయం పై భాగంలో గట్టిగా కట్టుకట్టాలి .
  • 4. పాము కరిచిన వ్యక్తి అచేతనంలోకి పోకుండా చూడాలి .
  • 5. వెంటనే బాధితుడిని డాక్టరు వద్దకు తీసుకువెళ్లాలి
  • ఉ) తేలు కుట్టినప్పుడు ప్రధమ చికిత్స
  • 1. సబ్బునీళ్లతో గాయాన్ని కడగాలి .
  • 2. గాయం భాగం పై నొప్పి తగ్గేటట్లు మెల్లగా ఒత్తాలి .
  • 3. వెంటనే బాధితుడిని డాక్టరు వద్దకు తీసుకువెళ్లాలి
  • ఊ) నీళ్ళలో మునిగినప్పుడు -- ప్రధమ చికిత్స
  • సాధారణంగా నీళ్ళలో మునిగిన వ్యక్తి ఎక్కువ నీళ్ళను మింగివేస్తాడు.అందువలన అచేతన అవస్థలోనికి వెళ్ళిపోతాడు.శ్వాస నాళాలు నీటితో మూసుకుపోతాయి .
  • 1. తాగిన నీరు బయటకు వచ్చేలా రెండు చేతులతో పొట్టపై ఒత్తాలి.
  • 2. శిక్షణ తీసుకున్నవారైతే నోటితో శ్వాస మార్గంలో నీళ్ళను తొలగించి మళ్ళీ శ్వాస ఆడేలా చేస్తారు.
  • భారత ప్రభుత్వం ఎవరైన ఒక వ్యక్తికి ఏదయినా అత్యవసర సేవ అవసరం అయినప్పుడు సహాయ చర్యల కోసం కొన్ని ఉచిత ఫోన్‌ సేవలు కల్పించింది .
  • వైద్య సేవల కొరకు , పోలీసు, అగ్ని ప్రమాదాలు నివారణ కొరకు 24 గంటలు అందుబాటులో ఉండే సేవలను అత్యవసర సేవలు అంటారు.
  • ఉచిత వైద్య సలహాలు అందించే సేవ - 104
  • 104 వారు ఫోన్‌ ద్వారా ఉచిత వైద్య సలహాలు అందిస్తారు
  • గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సేవలు బాగా ఉపయోగపడతాయి .
  • పోలీసుల నుండి లభించే అత్యవసర సేవ phone no - 100
  • ఎవరైనా వ్యక్తికి ఏదైనా అత్యవసర సేవ అవసరం అయినప్పుడు సంప్రదించవలసిన నంబర్‌ - 108
  • భారత స్వాతంత్ర్య  ఉద్యమం
  • 1947 ఆగప్ట్‌ 15 న మన దేశం బ్రిటీష్‌ వాళ్ళ నుండి స్వాతంత్రం పొందింది .
  • చంద్ర గుప్త మౌర్యుడు , అక్టర్‌ , షాజహాన్‌ , సముద్ర గుప్తుడు వంటి గొప్ప రాజులు భారతదేశాన్ని గొప్ప దేశంగా తీర్చి దిద్దారు .
  • భారతదేశంలో వీరి కాలంలో నలందా , తక్షశిల వంటి గొప్ప విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి.
  • భారతదేశాన్ని అరబ్బుల దండయాత్రలు , ఐరోపా వారు బలహీనపరచి భారతదేశాన్ని వారి పాలన కిందకు తెచ్చుకున్నారు.
  • ఒక వ్యక్తి లేదా ఒక సందర్భానికి గౌరవసూచనగా నిర్మించబడిన ఒక విగ్రహం లేదా భవనాన్ని చారిత్రక కట్టడం అంటారు .
  • చారిత్రక కట్టడాలకు ఉదాహరణ : తాజ్‌ మహల్‌ , ఎర్ర కోట, సాంచీ స్తూపం .
  • భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం -- 1498
  • భారతదేశానికి సముద్రమార్గం కనుగొన్న పోర్టుగీసు నావికుడు - వాస్కోడిగామా .
  • పోర్చుగీస్‌ వారు, డచ్చివారు, French వారు, British వారు ఒకరి తర్వాత ఒకరు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు .
  • బ్రిటీష్‌ వారు ఈస్ట్‌ ఇండియా కంపెనీ స్థాపించి 1757 నుండి భారతీయ రాజ్యాలను పాలించడం మొదలు పెట్టారు .
  • 1857 లో భారత దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రజలు 8149 వారిపై తిరిగుబాటు చేశారు .
  • ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగిన సంవత్సరం - 1857 .
  • భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పడిన సంవత్సరం -- 1885 .
  • భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపకుడు - ఉ౦ హ్యూమ్‌
  • గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత దేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం - 1915
  • మహాత్మాగాంధీ 1919 వ సంవత్సరంలో స్వాతంత్ర పోరాటంలో చేరారు .
  • గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు .
  • 1942 వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్‌ భారతదేశాన్ని వదిలి వెళ్లాలని బ్రిటిష్‌ వారిని డిమాండ్‌ చేసింది .
  • బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా గాంధీజీ ఇచ్చిన నినాదం - డూ ఆర్‌ డై.
  • 1947 ఆగప్ట్‌ 14 అర్థరాత్రి బ్రిటిష్‌ వారు భారతదేశం వదిలి వెళ్లారు .
  • ఆగష్ట్‌ 15 న మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు .
  • ౫భారత రాజ్యాంగాన్ని రచించే బాధ్యత ను రాజ్యాంగ పరిషత్‌ ఎవరికి అప్పగించింది - 8గ అంబేడ్కర్‌ .
  • భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది - 1950 జనవరి 26
  • గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు - జనవరి 26
  • యూరోపియన్‌ లు భారత సముద్రమార్గం కనుగొన్న సంవత్సరం -1498
  • భారతదేశంలో బ్రిటిష్‌ పాలన స్థాపన జరిగిన సంవత్సరం -- 1757
  • బ్రిటిష్‌ పాలనపై ప్రజల తిరుగుబాటు - 1857
  • భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన - 1885
  • బెంగాల్‌ విభజన జరిగిన సంవత్సరం - 1905
  • వందేమాతర ఉద్యమం ప్రారంభం అయిన సంవత్వరం -1905
  • సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభం అయింది -1920
  • ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభం అయ్యింది - 1930
  • స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ నాయకత్వం ప్రారంభం అయిన సంవత్సరం - 1919
  • క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభం అయింది - 1942
  • ఆంధ్రప్రదేశ్‌ నుండి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులకు ఉదాహరణ : అల్లూరి సీతారామరాజు , దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, దువ్వ్వూరి సుబ్బమ్మ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొండా వెంకటప్పయ్య, పోనాక కనకమ్మ, శ్రీ పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు...
  • భారత దేశం రిపబ్లిక్‌ గా మారిన సంవత్సరం - 1950 జనవరి 26
  • జనవరి 26 న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు
  • అవని నుండి అంతరిక్షానికి
  • సముద్ర ప్రయాణం ద్వారా భూమి గుండ్రంగా ఉందని నిరూపించింది - ఫెర్దినాండ్‌ మాజిలాన్‌ .
  • మాజిలాన్‌ ఏ దేశానికి చెందిన నావికుడు - పోర్టుగీస్‌
  • భూమికి నమూనా -- గ్లోబ్‌
  • భూమి మీద ఉన్న వివిధ రకాల ప్రాంతాలను గుర్తించడానికి సహాయపడేది -- గ్లోబ్‌
  • గ్లోబ్‌ మీద అడ్డంగా నీయబడిన ఊహారేఖలు -- అక్షాంశాలు
  • గ్లోబ్‌ మీద నిలువు గా గీయబడిన ఊహా రేఖలు - రేఖాంశాలు
  • అక్షాంశాలు ,రేఖాంశాలు రెండూ ఊహారేఖలే .
  • గ్లోబ్‌ ను అడ్డంగా రెండు సమాన భాగాలుగా విభజించే అక్షాంశం - భూమధ్య రేఖ.
  • గ్లోబ్‌ ను నిలువుగా విభజించు రేఖాంశాన్ని పమంటారు - ప్రైమ్‌ మెరిడియన్‌.
  • భూమి ఒక ఊహాజనిత అక్షం ఆధారంగా కొద్దిగా వంగి తిరుగుతుంది .
  • భూమి తన చుట్టూ తాను తిరగడాని ఏమంటారు - భూ భ్రమణం .
  • భూ భ్రమణానికి పట్టే సమయం -- 24 గంటలు.
  • భూ భ్రమణం వలన రాత్రి ,పగల్లు ఏర్పడతాయి .
  • భూమి తన అక్షం పై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు .
  • భూ పరిభ్రమణానికి పట్టే సమయం - 365 రోజులు.
  • భ్రూ పరిభ్రమణం వలన బుతువులు ఏర్పడడం ,బుతువులలో మార్చులు గమనించవచ్చు ం
  • ఖగోళ దూరదర్శిని తో మనం నక్షత్రాలు , గ్రహాలు , ఉపగ్రహాలను పరిశీలించవచ్చు .
  • సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గేయహాలను కలిపి సౌర కుటుంబం అంటారు .
  • సూర్యుని కక్ష్య లో ష్లానెట్స్‌, ఆస్ట రాయిడ్స్‌, తోక చుక్కలు ఇతర పదార్ధాలు ఉంటాయి .
  • సూర్యుని నుండి దూరంలో భూమి స్థానం - 3౩ వది.
  • సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం -- బుధుడు.
  • సూర్యునికి అతి దూరంగా ఉన్న గ్రహం -నెప్యూన్‌ .
  • భూమికి గల ఒకే ఒక సహజ ఉపగ్రహం -- చంద్రుడు .
  • చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది .
  • భూమి చుట్టూ ఒకసారి చంద్రుడు తిరగడానికి పట్టే సమయం -- 27 రోజులు.
  • సౌర కుటుంబంలో ఉన్న మొత్తం గ్రహాలు -8 , అవి -- బుధుడు , శుక్రుడు , భూమి ,కుజుడు ,గురుడు, శని, యురేనస్‌, నెప్ట్యూన్‌ .
  • రాకెట్లను ఉపయోగించి అంతరిక్షంలోని ప్రవేశ పెట్టిన మానవ నిర్మిత ఉపగ్రహాన్ని కృత్రిమ ఉపగ్రహం అంటారు.
  • భారతదేశం ప్రయోగించిన మొదటి కృత్రిమ ఉపగ్రహం -- ఆర్యభట్ట .
  • ఆర్య భట్ట ఉపగ్రహాన్ని భారత్‌ ప్రయోగించిన సంవత్సరం - 1975 .
  • చంద్రయాన్‌ -2 అను కృత్రిమ ఉపగ్రహాన్ని (2019) july 22 న ప్రయోగించారు .
  • చంద్రయాన్‌ -2 ఉపగ్రహాన్ని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వద్ద గల సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుండి GSLV-MK11-M1 ద్వారా ప్రయోగించారు .
  • చంద్రయాన్‌ -1 తర్వాత తర్వాత ప్రయోగించిన రెండవ ఉపగ్రహం -- చంద్రయాన్‌ -2
  • చంద్రయాన్‌ -2 లో అమర్హిన పరికరాలు -- ఆర్టిటార్‌, విక్రమ్‌ లాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్‌ .
  • కమ్యూనికేషన్‌ ప్రసారం , వాతావరణ శాస్త్రం ,సముద్ర శాస్త్రం ,వనరుల సేవ మొదలైన వాటి సేవలను కృత్రిమ ఉపగ్రహాలు అందచేస్తాయి .

Post a Comment

0 Comments