Ticker

6/recent/ticker-posts

TS TELUGU 6TH CLASS 2021 4th lesson లేఖ

4. లేఖ

ప్రక్రియ : లేఖ

ఇతివృత్తం : చరిత్ర, సంస్కృతి

లేఖ – పరోక్షంగా ఉన్న వారికి సమాచారమును అందించుటకు, స్వీకరించుటకు లేఖలుఉపయోగపడతాయి. లేఖలను వ్యక్తిగత లేఖలు, వృత్తి లేదా వ్యాపార లేఖలు వంటి విభాగాలు చేయవచ్చు.

లేఖలో ప్రధానం అయినది విషయం.

పాఠ్యాంశ విశేషాలు:

 లేఖలలోని భేదాలు : కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు, వ్యక్తిగత లేఖలు మొ॥

లేఖ పాఠంలో ప్రస్తావించబడిన దర్శనీయ స్థలాలు – నాగార్జునసాగర్, వరంగల్, హైదరాబాదు

 లేఖ వ్రాస్తున్న శైలజది ఏ ఊరు — వేముల

శైలజ ఎవరికి లేఖ వ్రాస్తున్నది – రంగాపురానికి చెందిన లలితకు

నాగార్జున కొండ పై విశ్వవిద్యాలయాన్ని స్థాపించినవాడు – ఆచార్య నాగార్జునుడు

స్వయంభూ దేవాలయం, ఖుష్ మహల్, నాట్యమండపం ఎక్కడ ఉన్నాయి – వరంగల్ కోటలో

తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం ఎక్కడ నుండి గ్రహించారు – వరంగల్లు

ఇత్తడి కళాఖండాల తయారీకి ప్రసిద్ధి గాంచిన ప్రాంతం – పెంబర్తి

రామప్ప దేవాలయాన్ని కట్టించినవాడు – గణపతిదేవుని సేనాని రేచర్ల రుద్రుడు

 తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడానికి కారణమైన జినవల్లభుని శాసనంలోని పద్యాలు – కందపద్యాలు

సిరి వెలుగులు విరజిమ్మే –  సింగరేణి బంగారం

శాతవాహనుల రాజధాని – కోటిలింగాల

శాతవాహన వంశపు తొలిరాజు – శ్రీముఖుడు

కులీకుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కట్టించిన చారిత్రక కట్టడం – చార్మినార్

1750 ప్రాంతంలో పెద సోమభూపాలుడు కట్టించిన మట్టికోట ఎక్కడ ఉన్నది – గద్వాల (జోగులాంబ జిల్లా)

కోట లోపల చెన్న కేశవ స్వామి గుడి ఉన్నది.

గుడి ముందు గల గాలి గోపురం ఎత్తు – 90 అడుగుల ఎత్తు

అష్టదిగ్గజ కవులను పోషించిన గద్వాల సంస్థానాధీశుడు –చినసోమభూపాలుడు

 పిల్లల మట్టి ఎక్కడ ఉంది – పాలమూరు జిల్లా (మహబూబ్ నగర్ జిల్లా)

రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడు.

ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుడు రచించిన తొలి కంద పద్యాలు గల ‘కుర్క్యాల శాసనం’ కరీంనగర్ జిల్లాలోని బొమ్మలగుట్టలో లభించిందని ప్రతీతి.

విభక్తి ప్రత్యయాలు :

పదాల మధ్య అర్ధసంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ‘విభక్తి ప్రత్యయాలు’ అంటారు.

ప్రత్యయాలు    – విభక్తులు

డు, ము, వులు – ప్రథమా విభక్తి

ని(న్), ను(న్), కూర్చి, గురించి – ద్వితీయా విభక్తి

చేత(న్), (చేన్), తోడ(న్), తో(న్) – తృతీయా విభక్తి

కొఱకు(న్), కై (కోసం) – చతుర్థి విభక్తి

వలన(న్), కంటె(న్), పట్టి – పంచమి

కి(న్), కు(న్), యొక్క, లో(న్), లోపల(న్) –  షష్ఠీ విభక్తి

అందు(న్), న(న్) – సప్తమీ విభక్తి

ఓ, ఓరి, ఓయి, ఓసి – సంబోధన ప్రథమా విభక్తి

సంబంధం లేని దానిని గుర్తించటం

దుర్గం, కోట, ఖిల్లా,జాగ – జాగ

గుడి, బడి, దేవాలయం, మందిరం  – బడి

శిల, రాయి, దండ, బండ  – దండ

గాలం, నీరు, జలం, సలిలం – గాలం

కన్ను, నేత్రం, రెప్ప, నయనం – రెప్ప

 

Post a Comment

0 Comments