Ticker

6/recent/ticker-posts

TET DSC సంధులు - TET and DSC 2022 | AP TET adn TS DSC No.1 Notes

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

TET DSC సంధులు 1మార్క్ గ్యారంటీ

సంధులు (  6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు )

“పూర్వ పర స్వరంబులకు బర స్వరంబేకాదేశంబగుట సంధియనంబడు” అనగా మొదటి అచ్చునకు తరువాతి అచ్చు పరముకాగా ఆ రెండు అచ్చులకు మారుగ రెండవ అచ్చే ఆదేశమగుటను “సంధి” అని అంటారు.

రెండు సమర్ధవంతమైన పదాలు ఒక అర్ధవంతమైన పదంగా కలిసి పోవడాన్నే “సంధి” అంటారు.

సంధిలోని రెండు పదములను విడదీయునపుడు ” గుర్తునకు ఎడమవైపు ఉన్న పదాన్ని పూర్వ పదమనియు, కుడివైపున గల పదాన్ని పరపదమనియు అంటారు..

* ఉచ్ఛారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసివచ్చినపుడు “సంధి పదం” ఏర్పడుతుంది.

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

* వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయికను “సంధి” అని ఆ రెండు స్వరాల మధ్య జరిగే మార్పును “సంధికార్యం” అని అంటారు.

 

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

సంధులు రెండు రకాలు.

అవి.

1. సంస్కృత సంధులు

2. తెలుగు సంధులు

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి

సూత్రం :’అ’ కార, ‘ఇ’ కార, ‘ఋ’ కారములకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములుఏకాదేశమగును.

ఉదా: ప్రళయ + అగ్ని = ప్రళయాగ్ని

స్నాన + అర్ధం – స్నానార్ధం

గౌరీ + ఈశ = గౌరీశ

భాను + ఉదయం = భానూదయం

శీత + ఆది = శీతాద్రి

పితృ + ఋణం = పితణం

అస్తోక + అంభోది = అస్తోకాంబోధి

జలజ + అంతస్థిత = జాలజాంతస్థిత

పరమ + అవధి = పరమావధి.

గోప + అరకుల్ = గోపారకుల్

దివిజ + అగ్రణి = దివిజాగ్రణి

దశ + అజ్ఞాలు = దశాబ్దాలు

మధురస + అశ్రుపూరము = మధురసాశ్రుపూరము

పీఠ + అధిపతి = పీఠాధిపతి

మహా + ఆత్మ = మహాత్మ

పండిత + ఆరాధ్యుడు పండితారాధ్యుడు

లతా + అంతము అతాంతము

గోవర్ధన + అది =, గోవర్ధనాద్రి

కవి + ఇంద్ర = కవీంద్ర

భూరూహ + ఆవళి = భూరూహావళి

శక్ర + ఆజ్ఞ = శక్రాష్ట్ర

గోత్ర + అచలము = గోత్రాచలము

నవ + ఆషాఢం = నవాషాఢం

స్ఫుట + ఆర్తి స్ఫుర్తి

విద్యా + అర్ధి = విద్యార్థి

ఉర్వి + ఈశ = ఉర్వీశ నల

(మధ్య + అహ్నం = మధ్యాహ్నం

లోల + అర్కుడు లోలార్కుడు

ఉత్సవ + అర్ధమై = ఉత్సవార్ధమై

ఇంద్ర + అగ్నులు = ఇంద్రాగ్నులు

శౌర్య + ఆది = శౌర్యాది

పుడమి + ఈశ = పుడమీశ

క్షీర + అభి = క్షీరాబ్ధి

హిమ + ఆలయం – హిమాలయం

ముని + ఇంద్రుడు = మునీంద్రుడు

మాతృ + ఋణం = మాత్రూణ౦

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

2.గుణ సంధి : –

సూత్రం:- అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్  ఏకాదేశం అవుతాయి.

ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు.

ఉదా:

అ + ఇ = ఏ నాగ +ఇంద్రము = నాగేంద్రము

అ + ఉ = ఓ మానవ + ఉత్తమ = మానవోత్తమ

అ + ఋ = ఆర్

* మహా + ఋషి = మహర్షి

నర + ఉత్తముడు = నరోత్తముడు

గణ + ఈశుడు = గణేశుడు

మహా + ఇంద్రుడు మహేంద్రుడు

మరికొన్ని ఉదాహరణలు:

గృహ + ఉపకరణం = గృహోపకరణం

మహా + ఉగ్ర =మహోగ్ర

దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు

కమఠ + ఇంద్ర  కమరేంద్ర

దశ + ఇంద్రియ

దశేంద్రియ

ధీర + ఉత్తములు = ధీరోత్తములు

పర + ఉపకారము = పరోపకారము

ప్రయాణ + ఉచితమైన = ప్రయాణోచితమైన

సౌరభ + ఉత్కరము = సౌరభోత్కరము

ఛల + ఉక్తి = ఛలోక్తి

కౌతుక + ఉద్ధతి = కౌతుకోద్ధతి

శుభ + ఉదయ = శుభోదయ

పూర్ణ + ఉదయం = పూర్ణోదయం

హరణ + ఉద్యోగము = హరణోద్యోగము =

బక + ఉత్తమ = బకోత్తమ

జీవన + ఉపాధి = జీవనోపాధి

* ఇతర + ఇతర = , ఇతరేతర

గంగ + ఉత్తరీయం గంగోత్తరీయం

సూర్య + ఉదయం = సూర్యోదయం

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

ఉర్వి + ఈశ = ఉర్వీశ

లోల + అర్కుడు లోలార్కుడు

ఇంద్ర + అగ్నులు ఇంద్రాగ్నులు

పుడమి + ఈశ = పుడమీశ

ముని + ఇంద్రుడు = మునీంద్రుడు

హిమ + ఆలయం = హిమాలయం

3.యణాదేశ సంధి :

సూత్రం:- ఇ, ఉ, ఋ లకు అసవర్ణమైన (సమానంకాని) అచ్చులు పరమగునప్పుడు క్రమంగా య వ, ర లు ఆదేశమగును.

ఉదా:- ప్రతి + అక్షం = ప్రత్ + య్ + అక్షం = ప్రత్యక్షం

అణు + అస్త్రం = అణ్ + చ్ + అస్త్రం = అణ్వస్త్రం

పిత్రంశ మరికొన్ని

ఉదాహరణలు: ప్రతి + ఏకం ప్రత్యేకం

అణు +ఇంధనం = అణ్వింధనం

పితృ + అంశ = పిత్ + ర్ + అంశ

గురు + ఆజ్ఞ = గుర్వాజ్ఞ

పితృ + ఆర్జితము  =పిత్రార్జితము

* అతి + అవసరం = అత్యవసరం

ప్రతి + ఉత్తరం = ప్రత్యుత్తరం

గురు + ఔన్నత్యం = గుర్వౌన్నత్యం

మాతృ + ఉపదేశం = మాత్రుపదేశం

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

4. వృద్ధి సంధి : సూత్రం: ‘అ’ కారానికి ఏ, ఐ లు పరమైతే ‘ఐ’ కారము ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారము, ఋ ఋ లు పరమైతే ‘ఆర్’ వస్తుంది. (ఐ, ఔ అను వృద్ధులంటారు)

ఉదా: భువన + ఏక = భువనైక (అ ఏ ఐ)

రస + ఏక = రసైక

అఖండ + ఐశ్వర్యం = అఖండైశ్వర్య (అ ఐ ఐ)

దివ్య + ఐరావతం = దివ్మైరావతం

పాప + ఓఘం = పాపౌఘం (అ ఓ ఔ) *

పరమ + ఔషధం = పరమౌషధం (అఔఔ)

ఘన + ఓషధి = ఘనౌషధి =

ఋణ + ఋణం = ఋణార్ణం (అఋ ఆర్)

మరికొన్ని ఉదాహరణలు:

రస + ఔచిత్యం = రసౌచిత్యం

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

సుర + ఏక = సురైక

ఏక + ఏక = ఏకైక *

వన + ఓషది = వనౌషది

స్వరూప + ఔచిత్యం = స్వరూపౌచిత్యం

దేశ + ఔన్నత్యం = దేశాన్నత్యం

5. అనునాసిక సంధి;

సూత్రం:- క, చ, ట, త, ప లకు న, మ లు పరమైతే వాటి అనునాసికాక్షరములు)ఆదేశమగును.

ఉదా: వాక్ + మయము వాజ్మయము

జగత్ + నాటకము = జగన్నాటకము

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

16. విసర్గ సంధి :

జగత్ + నిలయము జగన్నిలయము

మరుత్ + నగము = మరున్నగము

1వ సూత్రం: హ్రస్వ అకారం మీది విసర్గకు ‘అవర్గం’ గాని, వర్గ తృతీయ, చతుర్ధ, పంచమాక్షరాలు గాని, హ, య, వ, ర, ల అనే అక్షరాలు గాని పరం అయితే విసర్గకు లోపం వచ్చి దానికి ముందున్న హ్రస్వ అకారానికి ఓకారం ఆదేశంగా వస్తుంది.

ఉదా: అయ:+ మయం= అయోమయం (అయస్ + మయం అసకు బదులుగా ఓ వస్తుంది)

ఇత: + అధికం = ఇతోధికం

పయః + ది = పయోధి

పయః + ధరం = పయోధరం

* పవనాంధః + లోకముల్ = పవనాంధోలోకముల్

యశః + వా = యశోవా

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

నమః + నమః = నమోనమః

మనః + హరం = మనోహరం

2 వ సూత్రం: విసర్గకు ముందు అకారేతర అచ్చు పరమగునపుడు విసర్గకు రేఫం అంటే ‘ర’ కారం

వస్తుంది.

ముహు: + ముహుః = ముహుర్ + ముహుః = ముహుర్ముహు:

అదే విధంగా : చతుః + ముఖుడు = చతుర్ముఖుడు

ధనుః + బాణములు = ధరురాణములు

 

ఉదా:

మృత్యుః + వా = మృత్యుర్వా

ఆశీ: + వాదం = ఆశీర్వాదం =

దుః + అభిమానం = దురభిమానం

అంతః + మధనం = అంతర్మధనం

3వ సూత్రం: అహస్, స్వస్, ప్రాతస్, పునస్ శబ్దాల ‘స’ కారానికి ‘ర’ కారం వస్తుంది.

ఉదా:

అహః + నిశలు = అహర్ + నిశలు, = అహర్నిశలు

అదే విధంగా : పునః + ముద్రించు = పునర్ముద్రించు

అంతః + జాతీయ = అంతర్జాతీయ =

పునః + ఉద్ధరణ = పునరుద్ధరణ

 

4 వ సూత్రం: విసర్గకు శ, ష, స లు పరమైతే శ, ష, స లే వస్తాయి.

ఉదా: సభ: + సుమం = సభస్సుమం, మనః + శాంతి = మనశ్శాంతి, చతు: + షష్టి = చతుషష్టి 6 వ సూత్రం: ఇస్, ఉస్ అంతంలో ఉన్న పదాలలో ‘స’ కారం ‘ష’ కారమవుతుంది. ఉదా: బహిస్ + కారం = బహిష్కారం

దుస్ + కరం = దుష్కరం నిస్ + కారణం = నిష్కారణం ధనుస్ + ఖండం = ధనుష్కండం

ధనుః + కోటి = ధనుష్కోటి –

6వ సూత్రం: విసర్గకు ‘శ, ష, స’ పరమైతే శ, ష, స లు ద్విత్వాలుగా మారతాయి. ఉదా: మనః + శాంతి = మనశ్శాంతి. చతుః + షష్టి = చతుషష్టి సభ: + సుమం = సభస్సుమం 7వ సూత్రం: విసర్గకు ‘చ, ఛ’ లు పరమైతే ‘శ’ కారం, ‘ట, ఈ లుపరమైతే ‘ష’ కారం, త, థ లు పరమైతే ‘స’ కారం వస్తుంది.

ఉదా: ని: + తేజము = నిస్తేజము

దుః + చేష్టితము = దుశ్చేష్టితము

ధనుః + టంకారము = ధనుష్టంకారము

మనః + తాపము = మనస్తాపము

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

8వ సూత్రం: విసర్గకు క, ఖ, ప, ఫ లు పరమైతే విసర్గకు ఎలాంటి మార్పురాదు. ఉదా: అంతః + పురము = అంతఃపురము ప్రాంతః + కాలము = ప్రాతః కాలము 7. శ్చుత్వ సంధి: సూత్రం: ‘స’ కార, త వర్గములకు, ‘శ’ కార, ‘చ’ వర్గము పరమగునపుడు ‘శ’ కార, ‘చ’ వర్గము లే వచ్చును.

ఉదా. సత్ + జనులు = సజ్జనులు

సత్ + చరిత్ర = సచ్చరిత్ర

యశస్ + చంద్రికలు = యశశ్చంద్రికలు

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

8. జశ్వసంథి :

సూత్రం : క, చ, ట, త, ప లకు వర్గ ప్రధమ ద్వితీయాక్షరాలు, శ, ష, స లు కాక మిగిలిన హల్లు గానీ, అచ్చులు గానీ పరమైతే గ, జ, డ, ద, బలు ఆదేశంగా వస్తాయి.

\ఉదా, దిక్ + భ్రాంతి = దిగ్భ్రాంతి

వాక్ + దానం = వాగ్దానం

సత్ + ఆనంద = సదానంద

సత్ + భక్తులు సద్భక్తులు

దిక్ + అంతం = దిగంతం

వాక్ + యుద్ధం = వాగ్యుద్ధం

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

తెలుగు సంధులు

1. అత్వ సంధి (అకార సంధి) :

సూత్రం: అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళము.

ఉదా:

ఎంత + అడలు’ = ఎంతడలు

రాక + ఉండినన్ = రాకుండినన్

ఎంత + ఒఱలు = ఎంతొఱలు

పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు

ఎచట + ఎచట = ఎచటెచట

పెసర + అప్పడం = పెసరప్పడం

లేక + ఏమి = లేకేమి

నాయన + అమ్మ = నాయనమ్మ

ఇంక + ఎవరు = ఇంకెవరు

చింత+ ఆకు = చింతాకు

ఒక + ఇంత = ఒకింత

2. ఇత్వ సంధి (ఇకార సంధి) :

సూత్రం: ఇత్తునకు అచ్చు పరమైనపుడు సంధి వైకలికంగా జరుగుతుంది.

ఉదా: ఏమి + అయ్యె = ఏమయ్యే

చొచ్చితిమి + ఏని = చొచ్చితిమేని

అది + ఎట్లు = అదెట్లు

లాలి + అనుచు = లాలనుచు

పైని + ఇడి = పైనిడి

ఒకటి + ఏ = ఒక్కటే

వచ్చిరి + అప్పుడు = వచ్చిరప్పుడు

రానిది + అని = రానిదని

అతనికి + ఇచ్చెను = అతనికిచ్చెను

కావాలి + అంటే = కావాలంటే

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

3. ఉత్వపంథి (ఉకార సంథి) : –

సూత్రం: ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యం.

ఉదా, అతడు + అట్లు = అతడట్లు

ఊరు + ఎల్ల  =ఊరెల్ల

దిక్కు + ఇది = దిక్కిది

బిట్టు + ఉలికి = బిట్టుల్కి

దవ్వు + ఏగు = దవ్వేగు

రెండు + ఇక = లెండిక

నోరు + ఆచి = నోరాచి

నాకు + ఒక= నాకొక

ప్రాంతము + అంతా

ప్రాంతమంతా

దుర్బరము + ఐనా = దుర్ధరమైనా

నీవు + ఎక్కడ = నీవెక్కడ

4.యడాగమ సంధి :-

కాదు + ఏని = కాదేని

సూత్రం: సంధిలేని చోట స్వరంబు కంటె బరంబయిన స్వరంబునకు యడాగమంబగు.

ఉదా, నిగిడి + అడుగిడె = నిగిడి యడుగిడె

పెకల్చి + ఎత్త = పెకల్పియెత్త

నీ + అలఘు = నీయలఘు

నా+ ఎదుట = నాయెదుట

సెల + ఏఱు = సెలయేబు మేన + అత్త = మేనయత్త

ఎన్ని + ఏని = ఎన్నియేని

చెప్పినది + ఏమి =

చెప్పినదియేమి

6. ద్విరుక్తటకార సంధి :-

సూత్రం కుజు, చిబు, కడు, నడు, నిడు శబ్దముల “అడ” అకచ్చు పరంబగునప్పుడు ద్విరుక్తటకారంబగు.

ఉదా:

నిడు + ఊర్పు = నిట్టూర్పు

నడు + ఇల్లు = నట్టిల్లు

కడు + ఎదురు = కట్టెదురు

చిలు + ఎలుక = చిట్టెలుక

చిలు + అడవి = చిట్టడవి

6,సరళాదేశ సంథి (ద్రుతప్రకృతిక సంధి) : సమాసంలోనూ, సంయుక్త క్రియలలోనూ, ద్రుతం తర్వాత పరుషాలు సరళాలవుతాయి. (కావ్య భాషను నేర్చుకొనడానికి ఉపయోగపడే సంధి)

పురుషాలు అనగా – క, చ, ట, త, పలు

సరళాలు అనగా -గ, జ, డ, ద, బ,లు

1వ సూత్రం: ద్రుత ప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి.

2వ సూత్రం: ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి.

ఉదా: వేదిక( జాచు= వేదికన్ + చూచు

వేదికన్ + జూచు (1వ సూత్రం చే)

వేదికఁజూచు (2వ సూత్రం చే)

మరికొన్ని ఉదాహరణలు:

రాన్ + కలదు = రాఁగలదు

చచ్చియున్ + చావనివారు =

చచ్చియుఁజావనివారు

ప్రాణమున్ + తీయుట = ప్రాణముఁదీయుట

జున్ను విధానన్ + పట్టి = జున్ను విధానఁబట్టి

కానన్ + కాల్చు = కానఁగాల్చు

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

7.గపడదవా దేశ సంధి: –

1వ సూత్రం: ప్రధమ మీది పరుషములకు గసడదవలు బహుళము గానగు.

2వ సూత్రం: ద్వంద్వ సమాసంలో పదం తర్వాత గల పరుషాలకు గసడదవ లు ఆదేశంగా వస్తాయి.

ఉదా: కాయ + కూరలు = కాయగూరలు

ముద్దు + చేయు = మద్దుసేయు

అన్న + తమ్ములు = అన్నదమ్ములు

ఎక్కు + పెట్టి = ఎక్కబెట్టి

నీవు + టక్కరి = నీవుడక్కరి

ఊరు + పల్లెలు = ఊరువల్లెలు

రారు + కదా = రారుగదా

వాడు + కొట్టే = వాడుగొట్టె పా

లు + త్రావి = పాలుద్రావి

ప్రాణాలు + కోలోవు = ప్రాణాలు గోల్పోవు

ఆసు + పోయుట = ఆసుఖోయుట

టక్కు + టెక్కు = టక్కుడెక్కులు

కాలు + చేతులు = కాలుసేతులు

ఆ దేశ శత్రస్యా ఆగము మిత్రస్యా (కోడ్)

8.టుగాగమ సంధి : –

సూత్రం: కర్మధారయ సమాసంలో ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు ‘ట్’

ఇలా ‘ట్ ఆగమంగా రావడాన్ని టుగాగమ సంధి అంటారు.

ఉదా: తూగుటుయ్యేల, పులుంగుటెకిమీడు – ఇవి కర్మధారయ సమాసాలు

ఈ పదాలను విడదీస్తే క్రింది విధంగా ఉంటాయి.

తూగు + ఉయ్యేల

పులుంగు +ఎకిమీడు

వీటిలో మొదటి పదం చివర హ్రస్వ ఉకారముంది.

రెండవ పదం మొదట అచ్చు ఉంది. వీటికి ‘ట్ ఆగమంగా వస్తుంది.

తూగు +ట్  + ఉయ్యేల = తూగుటుయ్యేల

పులుంగు + ట్  + ఎకిమీడు

పులుంగుటెకిమీడు

మరికొన్ని ఉదాహరణలు:

కఱకు + అమ్ము = కఱకు +ట్  + అమ్ము = కఱకుటమ్ము

నిగ్గు + అద్దము = నిగ్గు +ట్  + అద్దము = నిగుటద్దము

తేనె + ఈగ = తేనెటీగ

పల్లె + ఊరు = పల్లెటూరు

చిగురు + ఆకు = చిగురుటాకు

పొదరు + ఇల్లు = పొదరుటిల్లు

ముద్దు + ఉంగరం = ముద్దుటుంగరం

9. రుగాగమ సంధి:  పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ, జవ, అయిదవ మొదలైన

శబ్దాలను పేదాది శబ్దాలు అంటారు.

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

1వ సూత్రం: కర్మధారయ సమాసంలో పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైతే ‘రు’ గాగమం వస్తుంది.

ఉదా: పేదరాలు = పేద + ఆలు

బీదరాలు = బీద + ఆలు

పేద మొదలైన పదాలకు ‘ఆలు’ పదం పరమైతే ‘రు’ ఆగమంగా వస్తుంది.

దీన్నే రుగాగమం అంట.

అపుడు…….

పేద + ర్ + ఆలు = పేదరాలు

బీద + ర్ + ఆలు = బీదరాలు

మరికొన్ని ఉదాహరణలు:

ముద్ద + ఆలు =ముద్దరాలు నందు

బాలెంత + ఆలు = బాలెంతరాలు

అయిదవ + ఆలు = అయిదవరాలు

2వ సూత్రం: కర్మధారయంబు సందత్సమంబులకాలు శబ్దము పరంబగునపుడు డత్వంబునకుత్వంబు రుగాగమంబును అగు. ధీర, గుణవంత, ధనవంత, సంపన్న గంభీర, ధైర్యవంత – ఇలాంటి పదాలు “తత్సమ పదాలు” అంటారు. తత్సమ పదాలకు ‘ఆలు’ పదం పరమైతే ఆ తత్సమ పదాలకు చివరన్న అకారం అవుతుంది. ఆర్” ఆగమంగా వస్తుంది.

ఉదా.

ధీర + ఆలు = ధీరు + ర్ + ఆలు = ధీరురాలు

గుణవంతు + ర్ + ఆలు = గుణవంతురాలు

నాయక + ఆలు = నాయకురాలు

10. నుగాగమ సంధి:-

1వ సూత్రం: ఉదంతమగు తద్ధర్మార్ధక విశేషణానికి అచ్చు పరమైతే నుగాగమం వస్తుంది.

(ఎగురు, పల్కు, ఉండు, చేయు, వచ్చు)

ఉదా. చేయి + అతడు = చేయునతడు

భక్త + ఆలు = భక్తురాలు

వచ్చు + ఒక = వచ్చునొక

2వ సూత్రం: షష్ఠీ తత్పురుష సమాసంలో ఉకార, ఋకారాలకు అచ్చుపరమైతే నుగాగమం!

వస్తుంది.

ఉదా. రాజు + ఆజ్ఞ = రాజునాష్ట్ర

 

3వ సూత్రం:

ఉదా: తళుకు + గజ్జెలు- తళుకుఁగజ్జెలు

విధాతృ + ఆనతి = విధాతృనానతి

తళుకునజ్జెలు = తళుకుంగజ్జెలు

1. ఉత్తు చివరగల స్త్రీ సమాలు అయినందు వలన నుగాగమం వచ్చింది.

ఆ) ఉన్నతంపు + గొడుగు- ఉన్నతంపు గొడుగు

ఉన్నంతపునొడుగు

ఉన్నంతపుంగొడుగు

2. పుంపులకు సరళాలు, పరుషాలు పరమైతే ‘ను’

ఇ) సరసము + తనము = సరసపున్దనము =

తెల్ల + తనము = : తెల్లన్దనము

కు లోపం కాని, సంశ్లేషగాని జరుగుతుంది.

3. ఉదంత స్త్రీసమాలకు, పుంపులకు అచ్చు అంతంగా ఉండే గుణవాచక (తెల్ల, పచ్చ మొదలగు) శబ్దాలకు ‘తనము’ పరమైతే నుగాగమం వస్తుంది.

11. దుగాగమ సంధి: –

సూత్రం: నీ, నా, తన శబ్దాలకు ఉత్తరపదం పరమైనప్పుడు దుగాగమం విభాషగా వస్తుంది.

ఉదా: నా + విభుడు = నాదు విభుడు

నీ + భవనం = నీదుభవనం

తన + ప్రాణేశుడు = తనదు ప్రాణేశుడు

గమనిక: పై ఉదాహరణల్లో ‘దు’ ఆగమంగా వచ్చింది కనుక దీనిని దుగాగమ సంధి అంటారు.

ఇలాంటి రూపాలు ఇప్పుడు మనం రాస్తున్న భాషలో లేవు. ఇవి కావ్యాలలో కన్పించే రూపాలు.

12.పడ్వాది సంధి:

సూత్రం: పడ్వాదులు(పడు, వడి, పట్టె, పెట్టు) పరమగునప్పుడు ము వర్గానికి లోప పూర్ణ బిందువులు

విభాషగా వస్తాయి.

ఉదా: ఆశ్చర్యము + పడి = ఆశ్చర్యపడి

భయము + పడి = భయపడి /భయంపడి.

ఆధారము + పడి = ఆధారపడి

కష్టము + పడి కష్టపడి –

ఆరాటము + పడు = ఆరాటపడు

13. పుంప్వాదేశ సంధి:

సూత్రం: కర్మధారయంబు నందు ము వర్ణకమునకు పుంపులగు.

ఉదా: పూర్వము + రోజులు పూర్వపు రోజులు మానవత్వము + విలువలు = మానవత్వపు విలువలు

రక్తము + పోటు = : రక్తపుపోటు

రాగితము + గుండెలు = : కాగితపు గుండేలు

యుద్ధము + దొరకంచులు = యుద్ధపు దొరకంచులు

గంధము + చెక్క గంధపు చెక్క

సరసము + మాట – సరసపుమాట (సరసంపుమాట)

సింగము + ఆదము – సింగపు కొదము

కొంచెము + నరుడు = కొంచెపు నరుడు

ముత్యము + సరులు = ముత్యపుసరులు ,

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

14. ప్రాతాది సంధి : ప్రాతాదులనగా ప్రాత, లేత, క్రొత్త, చెన్ను, క్రింద, రెంపు మొ|| బహుళవు జరుగుతుంది.

1వ సూత్రం: ప్రాతాది శబ్దాల తొలి అచ్చు మీది వర్గాలకు

ఉదా: లేత + మొగ్గ = లేమొగ్గ

లేత + నగవు = లేనగవు

రెండో పదం మొదటి హల్లు పరుషమైతే సరళంగా మారుతుంది.

ఉదా: ప్రాత + పలుకు = ప్రాబలుకు

లేత + కొమ్మ = లేగొమ్మ

పూవు + తేనె = పూదేనె

మీదు + కడ = మీగడ

పూవు + తోట = పూదోట

చెన్ను + తొవ = చెందొవ

పది + తొమ్మిది = పందొమ్మిది

| 2వ సూత్రం: కెంపు, చెన్ను, ముందు, మొదలైన శబ్దాలలో చివరి అక్షరానికి లోపం వస్తుంది.

ఉదా:

కెంపు + తమ్మి = కెందమ్మి

చెన్ను + కావి = చెంగావి

ముందు + చేయి = ముంజేయి

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

| 3వ సూత్రం: క్రిందు శబ్దంలో తొలి అచ్చుమీది వర్ణాలకు లోపమూ, తొలి అచ్చుకు దీర్ఘముగా వస్తుంది

క్రిందు + కన్ను = క్రీగన్ను క్రిందు + నీడ = క్రీనీడ

4వ సూత్రం: క్రిత్తాది శబ్దాల తొలి అచ్చుమీది వర్ణాలకు లోపమూ మీది హల్లుకు ద్విరుక్తా వస్తుంది.

ఉదా:

క్రొత్త + కారు = తొక్కారు

నిండు + వెఱ = నివ్వెలు

అన్ని నాళ్ళు = అన్నాళ్ళు

నెఱు + మది = నెమ్మది

క్రొత్త ,చేద శబ్దాలకు తొలి అచ్చుమీది వర్ణాలకు కొన్ని చోట్ల అనునాసికంఆదేశమవుతు .

ఉదా:

క్రొత్త + చాయ = క్రొంజాయ

చేద + తాడు = చేంతాడు

TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

5వ సూత్రం: మూడు శబ్దం మీద హల్లు పరమైతే తొలి అచ్చుమీది వర్ణాలకు లోపమూ, తొలి అచ్చు

హ్రస్వం కావడమూ, తరువాత హల్లు ద్విరుక్తం కావడమూ జరుగుతుంది.

ఉదా: మూడు + మారు =ముమ్మారు

మూడు + పాతిక = ముప్పాతిక

మూడు + లోకాలు = ముల్లోకాలు

గమనిక: నాళ్ళు (నాడులు) పరమైనప్పుడు మూడు శబ్దంలో దీర్ఘం హ్రస్వం కాదు.

ఉదా: మూడు + నాళ్ళు మూన్నాళ్ళు,

మూణాళ్ళు.

15. ఆమ్రేడిత సంధి:

1వ సూత్రం: అచ్చున కామ్రేడితం పరంబగునప్పుడు సంధియగు.

ఉదా: పగలు + పగలు = పట్టపగలు

కడ + కడ = కట్టకడ

ఎదురు + ఎదురు = ఎట్టయెదురు

బయలు + బయలు = బట్టబయలు

కొన + కొన = కొట్టకొన

చివర + చివర = చిట్టచివర

తుద + తుద = తుట్టతుద.

పిడుగు + పిడుగు = పిట్టపిడుగు

మంట ఒక్క + ఒక్క = ఒక్కొక్క

ఏమి + ఏమి = ఏమేమి +

ఓరి + ఓరి = ఓరోరి

ఎన్ని + ఎన్ని = ఎన్నెన్ని

2వ సూత్రం : ఆమ్రేడితం పరమగునప్పుడు కడాదుల తొలి అచ్చుమీది వర్ణాలకెల్లా అందంతమగు

ద్విరుక్తమగు ద్విరుక్తటకారం వస్తుంది.

లు, ల, నలసంథి : లు, ల, న లు పరమైనపుడు ఒక్కొక్కపుడు ‘ము’ వర్గానికి లోపమూ,

దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ వస్తాయి.

ఉదా: పుస్తకము + లు = పుస్తకాలు

జీవితము + న = జీవితాన

దేశము + ల = దేశాల

వృక్షము + న = వృక్షాన

17.త్రిక సంథి :  ఆ, ఈ, ఏ లను త్రికం అంటారు. అవి దీర్ఘాచ్చులు. ఆ, ఈ, ఏ లలో పూర్వ పదంగా ఉంటుంది. దాని మీద చేరే పదం హల్లుతో మొదలవుతుంది. సంధి జరిగినప్పుడు ఆ, ఈ, ఏ లు హ్రస్వాలు అవుతాయి. వాటి తరువాత వచ్చిన హల్లు ద్విరుక్తమవుతుంది.

1వ సూత్రం: ఆ, ఈ, ఏ అను సర్వనామాలు త్రికంబునాబడు

ఉదా: అమ్మేఘచయంబులు

ఇమ్మహోగ్ర సలిలంబు = ఈ + మహోగ్ర సలిలంబు = ఇ + మ్మహోగ్ర సలి                                                              లంబు = ఇమ్మహోగ్ర సలిలంబు ఆ + వారల అవ్వారల.

ఆ + కొమరుండు అక్కొమరుండు

మరికొన్ని ఉదాహరణలు.

ఏ + విధము = ఎ + వ్విధము = ఎవ్విధము.

ఆ + కన్య = అ + క్కన్య = అక్కన్య

ఆ + నలువురు = అ + న్నలువురు = అన్నలువురు ఆ + తరి

అ + తరి = అత్తరి

ఆ + ధరణీసురుడు = అ + ద్ధరణీసురుడు = అద్ధరణీసురుడు

ఆ + చోట = అ + చ్చోట = అచ్చోట

ఆ + తన్వి = అ +త్తన్వి = అత్తన్వి

ఏ + అది = ఎయ్యది (యడాగమ త్రిక సంధి)

ఆ + అనిమిషనది = అయ్యనిమిషనది (యడాగమ త్రిక సంధి)

ఆ + అనలుడు = అయ్యనలుడు (యడాగమ త్రిక సంధి)

For more

My Class Notes

TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము

 TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి

అలంకారాలు Usefull for TS AND AP Best Notes

TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన

TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం

My Vijetha

Telugu e Tutor

aptet2022, apdsc 2022, ap tet 2021 syllabus, ap dsc 2021 notification, apdsc 2021, ap dsc 2021, ap dsc official website, ap dsc 2021 syllabus, ap dsc 2020 notification, ap tet 2022 syllabus, ap dsc website, ap dsc full form, ap dsc 2020 age limit, ap dsc books, ap tet notification 2021 date, ap dsc books online, aptet 2022 notification, ap dsc qualification, ap dsc jobs, ap dsc age limit 2021, ap tet age limit 2021, ap tet 2022 notification, ap tet 2022, ap dsc 2022, ap dsc vacancies 2021, aptet2022.in, ap tet 2021 exam date, ap dsc 2022 notification, aptet telugu, apdsc telugu, ap tet maths, apdsc maths , apdsc new content , aptet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes

Post a Comment

0 Comments