. 6th Class Social Bits 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం

Ticker

6/recent/ticker-posts

6th Class Social Bits 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. ఆది మానవులు పనిముట్లను వీటితో తయారు చేసుకున్నారు?
A) రాళ్ళు
B) కొయ్య
C) ఎముకలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

2. ఆది మానవులు సంచార జీవనం చేయడానికి కారణం కానిది.
A) ఆహారాన్వేషణ కోసం
B) ఆవాసం కోసం
C) వ్యవసాయం కోసం
D) నీటికోసం
జవాబు:
C) వ్యవసాయం కోసం

3. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిరంతరం సంచరించే వారిని ఇలా అంటారు.
A) స్థిరజీవులు
B) కష్టజీవులు
C) సంచార జీవులు
D) శ్రమజీవులు
జవాబు:
C) సంచార జీవులు

4. ఆది మానవులు చిత్రించటానికి ఈ కుంచెలను ఉపయోగించారు.
A) రాతి
B) ఎముక
C) వెదురు
D) చర్మం
జవాబు:
C) వెదురు

5. వైఎస్సార్ కడప జిల్లాలోని చింతకుంట రాతి స్థావరాలు ఆది మానవులు గీసిన చిత్రాలు ఎన్ని టికి పైగా కనుగొనబడ్డాయి?
A) 100
B) 200
C) 2000
D) 20
జవాబు:
B) 200

6. దాదాపు ఎన్ని సం||రాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి.
A) 10,000 సం॥లు
B) 12,000 సం||లు
C) 14,000 సం||లు
D) 24,000 సం||లు
జవాబు:
B) 12,000 సం||లు

7. ఆది మానవులు నిప్పును ఈ విధంగా ఉపయోగించారు.
A) క్రూర మృగాలను తరిమి వేయటానికి
B) గుహలలో వెలుగు నింపటానికి
C) ఆహారాన్ని వండుకొని తినటానికి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

8. కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని ఈ విధంగా పిలుస్తారు.
A) నవీన శిలాయుగం
B) పాతరాతి యుగం
C) మధ్యమ శిలాయుగం
D) తామ్ర యుగం
జవాబు:
A) నవీన శిలాయుగం

9. ప్రఖ్యాత బెలూమ్ గుహలు ఈ జిల్లాలో కలవు.
A) కడప
B) కర్నూలు
C) నెల్లూరు
D) చిత్తూరు
జవాబు:
B) కర్నూలు

10. ఆది మానవులు దుస్తులుగా వీనిని ఉపయోగించారు.
A) జంతు చర్మాలను
B) ఆకులను
C) A & B
D) నేత గుడ్డలను
జవాబు:
C) A & B

11. మన రాష్ట్రంలో ఈ తెగలవారు నేటికీ వేటాడం ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నారు.
A) యానాదులు
B) చెంచులు
C) A& B
D) ఏదీకాదు
జవాబు:
C) A& B

12. BCE 8,000 సం||ల నుండి BCE 3,000 సం|| వరకు గల రాతియుగం
A) పాత రాతియుగం
B) మధ్య రాతియుగం
C) కొత్త రాతియుగం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

13. BCE 2.6 మిలియన్ సం||రాల నుండి 3,000 సం||ల వరకు గల కాలం
A) పాతరాతియుగం
B) మధ్య రాతియుగం
C) కొత్త రాతియుగం
D) రాతియుగం
జవాబు:
D) రాతియుగం

14. సింధూ నదీలోయ నాగరికత ఈ దేశంలో వర్ధిల్లింది.
A) చైనా
B) ఈజిప్టు
C) భారత్
D) మెసపటోమియా
జవాబు:
C) భారత్

15. ఆది మానవులు ఇళ్ళను వీటితో నిర్మించుకున్నారు.
A) మట్టితో
B) గడ్డితో
C) A& B
D) రాతితో
జవాబు:
C) A& B

16. ఎముకలతో చేసిన పనిముట్లు ఈ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు.
A) కర్నూలు జిల్లా గుహలలో
B) YSR కడప జిల్లా గుహలలో
C) అనంతపురం జిల్లా గుహలలో
D) చిత్తూరు జిల్లా గుహలలో
జవాబు:
A) కర్నూలు జిల్లా గుహలలో

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము.

1. ఆదిమానవులు కుండలను …. తో తయారు చేసారు.
2. ……… కొరకు విల్లు, అంబులను ఆది మానవులు తయారు చేసుకున్నారు.
3. బేతంచర్ల, బనగానపల్లె రాతి గుహలు కల ప్రాంతాలు …………… జి ల్లాలో కలవు.
4. చింతకుంట రాతి చిత్రకళా స్థావరం …………. జిల్లాలో కలదు.
5. BCE 10,000 సం||ల నుండి BCE 8,000 సం||వరకు గల రాతియుగం …………….
6. ఆది మానవులు ……… నిల్వల కొరకు మట్టి పాత్రలను, గుహలో బుట్టలు ఉపయోగిస్తారు.
7. పురాతన సామాగ్రిని అధ్యయనం చేయువారు ……………
8. దాదాపు 12,000 సం||రాల క్రితం ప్రపంచ ……………. లో గొప్ప మార్పులు సంభవించాయి.
9. ………. రంగు చిత్రాలలో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది.
10. ……………. రాతియుగ కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేసారు.
జవాబు:

  1. మట్టి
  2. జంతువుల వేట
  3. కర్నూలు
  4. YSR కడప
  5. మధ్యరాతియుగం.
  6. ఆహార
  7. పురావస్తు శాస్త్రవేత్తలు
  8. వాతావరణం
  9. ఎరుపు
  10. నవీన/కొత్త

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

Group – AGroup – B
i)  వినుకొండa) కర్నూలు
ii) నాయుడు పల్లిb) అనంతపురం
iii) నందిపాడుc) చిత్తూరు
iv) వెంబకండ్రిగd) నెల్లూరు
v) టినిగల్e) ప్రకాశం
vi)  ఆధోనిf) గుంటూరు

జవాబు:

Group – AGroup – B
i) – వినుకొండf) గుంటూరు
ii) నాయుడు పల్లిe) ప్రకాశం
iii) నందిపాడుd) నెల్లూరు
iv) వెంబకండ్రిగc) చిత్తూరు
v) టినిగల్b) అనంతపురం
vi)  ఆధోనిa) కర్నూలు

Post a Comment

0 Comments