Ticker

6/recent/ticker-posts

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

ప్రక్రియ – సంభాషణ

ఇతివృత్తం – పర్యావరణం

సంభాషణ – ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపునుసంభాషణ అంటారు. సంభాషణలు మనకళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్లు అనుభూతిని కలిగిస్తాయి

ఉద్దేశం – ప్రకృతిని కాపాడుకోవటం మనధర్మం అనీ తెలపడం

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

పాత్రలు – అన్నమ్మ, నర్సయ్య, గోపాల్, లక్ష్మీ

అన్నమ్మ –  అమ్మమ్మ

నర్సయ్య – తాతయ్య

గోపాల్ – మనువడు

లక్ష్మి – మనువరాలు

తోకవాయ కత్తి వచ్చే ఢాంఢాం… అంటూ కోతి పాట పాడినదేవరు – అన్నమ్మ

అడవి జంతువులు గ్రామాల్లోకి రావడానికి కారణం – మనుష్యులు అడవులను నరకడం

పక్షులంతరించి పోవడానికి కారణం – సెల్ ఫోన్ సిగ్నల్స్

 ‘మనం బతుకుతలేం మిగతా జీవులను బతకనిస్తలేమని’ –  గోపాల్

 అడవుల్ని పెంచాలె, జంతువుల నుంచాలె అంటూ బాలల గేయం పాడి వినిపించినది – గోపాల్

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

భాషాభాగాలు

రాధ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టింది. (నామవాచకం )

అమ్ముచేసిన పాయసం కమ్మగా ఉన్నది. (విశేషణం)

గోపాలు దాక్టరే కాదు అతను యాక్టరు కూడా (సర్వనామం)

నవీన్ బాసరకు వెళ్ళి సరస్వతీ దేవిని దర్శించుకున్నాడు. (క్రీయ)

రవి ఉరుకుతూ కిందపడి అబ్బా! అని అరిచాడు. (అవ్యయం)

ప్రకృతి – వికృతి:

రాత్రి – రాతిరి

సింహం – సింగం

లక్ష్మి – లచ్చి

శక్తి -సత్తువ

ఆశ – ఆస

అడవి – అటవీ

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

సంధులు :

రామాలయం – రామ + ఆలయం : సవర్ణదీర్ఘ సంధి

మేనత్త = మేన + అత్త : అత్వ సంధి

దేవేంద్రుడు = దేవ + ఇంద్రుడు – గుణసంధి

నీవెక్కడ = నీవు + ఎక్కడ–ఉత్వ సంధి

లేకుంటే = లేక + ఉంటే – అత్వ సంధి

మరేమి = మరి + ఏమి: ఇత్వ సంధి

మనసైన = మనసు + ఐన : ఉత్వ సంధి

ఏమంటివి – ఏమి + అంటివి : ఇత్వ సంధి

సమాసాలు:

కృష్ణార్జునులు – కృష్ణుడును, అర్జునుడును – ద్వంద్వ సమాసం

 శివకేశవులు – శివుడును, కేశవుడును:  ద్వంద్వ సమాసం

నిరాశానిస్పృహలు – నిరాశయు, నిస్పృహయు :  ద్వంద్వ సమాసం

భయాందోళనలు -భయమును, ఆందోళనయును – ద్వంద్వ సమాసం

న్యాయాన్యాయాలు – న్యాయమును, అన్యాయమును – ద్వంద్వ సమాసం

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

అలంకారాలు:

అడవుల్ని పెంచాలి

జంతువుల నుంచాలె దుబుడుక్కుడుండుం

నీళ్ళన్ని ఇంకా

బావులను పెంచాలె డుబుడుక్కుడుండుం –     అంత్యానుప్రాస అలంకారం

ఉపవాచకం

సోమనాద్రి

రచయిత : సురవరం ప్రతాపరెడ్డి

మూలం: హైందవ వీరులు

గద్వాల సంస్థానం పాలకులు వీరికి సామంతులుగా ఉండేవారు – నిజాం నవాబు

గద్వాల సంస్థానపు రాజులలో మొదటివాడు – సోమనాద్రి (పెద్ద సోమభూపాలుడు) – భార్య లింగమ్మ

సోమనాద్రి కాలం – క్రీ.శ. 1750

గద్వాల్ కోటని నిర్మించాడు.

సోమనాద్రి తల్లిదండ్రులు – బక్కమ్మ, పెద్దారెడ్డి

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

గద్వాల్ సంస్థాన ఆస్థాన కవి కాణాదం పెద్దన రచించిన గ్రంథం – రామాయణం

ఆరగిద్ద యుద్ధంలో సోమనాద్రి ఎవరిని ఓడించాడు – ఉప్పేడు పాలకుడు సయ్యద్ దావూద్ మియా, రాయచూరు నవాబు బసరుజంగు ప్రాగటూరు పాలకుడు ఇదురు సాబు,

యుద్ధ పరిహారంగా సోమనాద్రి దావూద్ మియా నుండి వసూలు చేసినవి – దావూద్ మియా యుద్ధ చిహ్నాలైన నగారా, పచ్చజెండా, ఏనుగులను

“ తెల్లారేసరికి సోమనాద్రి గుర్రం ఎవరు తేస్తారో వారికి జాగీరు ఇస్తాను “ – నిజాం నవాబు

సోమనాద్రి గుర్రాన్ని తిరిగి తెచ్చిన బొచ్చెంగన్నపల్లి బోయసర్దారు – హనుమప్పనాయుడు

సోమనాద్రి కి,నిజాం నవాబుకు మధ్య యుద్ధంలో నిజాం సైన్యం విడిది – తుంగభద్ర కి దక్షిణంగా నిడుదూరు

సోమనాద్రి కి,నిజాం నవాబుకు మధ్య యుద్ధంలో సోమనాద్రిసైన్యం విడిది – కలుగొట్ల

నిజాం నవాబు నుండి యుద్ధ పరిహారంగా సోమనాద్రీ గ్రహించినవి – ఎల్లమ్మ ఫిరంగి, రామలక్ష్మణ ఫిరంగులు

మనజాతర- జనజాతర

యాత్ర పదానికి వికృతి – జాతర

జాతర అసలు ఉద్దేశం – మనుషులు కలుసుకోవడం, ఒక ఊరిలో జరిగిన మార్పులు, వింతలు విశేషాలు మరో ఊరికి తెలియజేయడం

భారతదేశంలో జరిగే అతి పెద్ద జాతర – మేడారం గిరిజన జాతర

మేడారం జాతర జరిగే స్థలం – వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం (ప్రస్తుతం : ములుగుజిల్లా)

 మేడారంలో  సమ్మక్క సారక్క జాతర సమయం – రెండేళ్ళకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి మొదలు మూడు రోజులపాటు

గిరిజన హక్కుల కోసం పోరాడి దేవతలుగా పూజింపబడే వీరవనితలు – సమ్మక్క, సారక్క

12వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లా పొలవాస ప్రాంతాన్ని పాలించిన గిరిజన దొర – మేడరాజు

పులుల మధ్య ఆడుకుంటున్న సమ్మక్కను తెచ్చి పెంచి పెద్ద చేసినవాడు – మేడరాజు

సమ్మక్కను వివాహం చేసుకున్న కాకతీయ సామంతుడు – పడిగిద్దరాజు

సమ్మక్క పడిగిద్ద రాజుల సంతానం – నాగులమ్మ, సారలమ్మ, జంపన్న

కాకతీయులు పగిడిద్ద రాజు పై దాడి చేసింది –యుగంధరాయిడి నాయకత్వం లో , లక్కవరం వద్ద స్థావరం .

కాకతీయులతో వీరోచితంగా పోరాడి చివరికి సంపెంగ వాగులో దూకి వీరమరణం పొందినవాడు – జంపన్న

యుద్ధంలో గాయపడి చిలుకలగుట్టపై అదృశ్యమై కుంకుమబరిణగా కనిపించినది – సమ్మక్క

కాకతీయుల కులదైవం – ఏకవీరా దేవి

సమ్మక్కకు జాతర చేయించమని కలలో కాకతీయ ప్రతాపరుద్రుని అదేశించినది – ఏకవీరాదేవి

 సమ్మక్క గాయపడిన చోటు – తల్లిగద్దె

సారలమ్మ వీరమరణం పొందిన చోటు – పిల్లగద్దె

మూడవనాడు జాతరలో జరిగే చివరి ఘట్టం – దేవతల వనప్రవేశం

మేడారం జాతరలో బెల్లాన్ని ఏమని వ్యవహరిస్తారు – బంగారం

రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ఎప్పటి నుండి అధికారికంగా నిర్వహిస్తుంది – 1996

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

ఎలుకమ్మ పెళ్ళి

బ్రహ్మయ్య దంపతులు తుంగభద్ర నది ఒడ్డున నివసించేవారు.

బ్రహ్మయ్య భార్య కోరిక పై గాయపడిన ఎలుకను ఎలా మార్చాడు – పాపగా

ఎలుక బుద్ధులు గల పాపకేమని పేరు పెట్టారు – మూషిక బాల

మూషిక బాల ఎవరిని తన్మయత్వంతో పూజించేది –వినాయకుని

మూషిక బాల 4వ తరగతి లో ఉండగా కాపాడిన అమ్మాయి – గీత

మూషిక బాల సూర్యుని తన వరునిగా తిరస్కరించడానికి కారణం – సూర్యుడు వెలుగుచిమ్మడం

అందగాడే కాని నల్లగా ఉన్నాడు’ అని మూషిక బాల ఎవరిని తిరస్కరించింది – మేఘుని

మూషిక బాల వాయుదేవుని పెళ్ళాడటానికి తిరస్కరించడానికికారణం – నిలకడలేదని

బండబారినట్లుండటం చేత మూషిక బాలచే తిరస్కరింపబడినవాడు – మేరుపర్వతుడు

 మూషిక బాల చివరికెవరిని వివాహమాడినది – మూషికరాజును

తెలంగాణ పల్లెలు – సంస్కృతి

కొత్త పంట:

 పంట పండంగనే ఇంట్లో చేసుకొనే పండుగ – కొత్త

 కొత్తంత పండుగలేదు – అత్తంత ఆత్మలేదు అనునది – సామెత

సంవత్సరానికి రెండుసార్లు చేసుకునే పండుగ –కొత్త

కొత్త బియ్యం తీసి,వండి, పదిమందిని పిలిచి కడుపు నిండా భోజనం పేట్టి పంపే పండుగ – కొత్త

యాసంగికోత్తకు  ( ఏప్రిల్,మే ) – కూరగాయల కరువు

వానాకాలం కోత్తకు – పచ్చటాకుల కరువు

“ అరువయారు రోకండ్లు ఆరు కుందెన్లు

ముప్పయారు రోకండ్లు మూడు కుందెన్లు

రారమ్మా చెలులారా రాజనాలు దంచ

రాజనాలు దంచినారు రాసివేసినారు

అడ్డాగొప్పులవారు ఇద్దరుయారండ్లు

రామాలచ్చుమనులాది లగ్గమెల్లుండి ”  – కొత్త పండుగ

శుభకార్యాల్లో పూజించే ‘కూరాడు’ అనగా – కుండ

కూరాడు ను అలంకరించి,కొత్త అన్నాన్ని నైవేద్యంగా పెట్టే పండుగ – కొత్త పండుగ

ఐదురకాల కూరలతో కుటుంబ సభ్యులు, చుట్టుప్రక్కల వాళ్ళతో బంతి

కూర్చొని తినే పండుగ –కొత్త

రైతులు వ్యవసాయపు పనులు మొదలు పెడుతూ చేసుకునే పండుగ – సాగువాటు

 సాగువాటుకు మరొక పేరు – ఏరువాక లేదా ఏకాంక

వ్యవసాయపు పనిముట్లను శుభ్రంచేసి, ఎవరితో మాట్లాడకుండా పొలంవెళ్ళి, నాగలి కట్టి దున్ని తిరిగి వచ్చే వరకు కుటుంబసభ్యులు నిద్రపోకూడదనే ఆచారం గల పండుగ – సాగువాటు

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

సాగువాటు నాడు సాగకపోతే సాలంతా అగిపోతది అనునది – సామెత

సాగువాటు నాడు ఉపవాస ముందునది – రైతుదంపతులు

రైతులకు కావలసిన నాగండ్లను, గొర్రులను, కర్ర పనిముట్లను తయారుచేసేవారు – వడ్రంగులు

కొడవలి, పార, గడ్డపార, బండికమ్ములు వంటి ఇనుప పనిముట్లను చేసేది – కమ్మరివారు

కుండ, గురిగి, పటువ, ఎసుల వంటి మట్టి పనిముట్లను చేసేవారు – కుమ్మరివారు

బంగారు నగలు చేసేవారు – అవుసులవారు

పద్మశాలి వాళ్ళు బట్టలు వేస్తారు.

మేదరివాళ్ళు, ఎరుకుల వాళ్ళు – బుట్టలను అల్లుతారు.

రైతులు పండించిన పంటలను అన్ని కులాల వారికివారి వస్తువులు ఉపయోగించుకున్నందుకు  ఈ పేరుతో పంచేవారు – ఏరం

బట్టలు కుట్టి ఇచ్చేవారు – మేరవాళ్ళు

తమ దగ్గర ఉన్నది ఇచ్చి తమకు కావలసినది తీసుకోవడం – వస్తుమార్పిడి

కశికతో గీకి పిల్లలకు పెట్టే పాల కుండ అడుగున ఉంటుంది – పాలగోకు

పూర్వం పల్లెల్లో ఆడే ఆటలు – గోటీలు, చిత్ర గోనె, కబడ్డీ, గుడ్డిరాజు, ఓమనగుంటలు, గచ్చకాయలు, తొక్కుడుబిళ్ళ, పరమపదసోపానపటం, పచ్చీసు, అష్టాచెమ్మా, మట్టికుప్పలు, రేసు, కాశిపుల్ల దాల్చడి, దుస్సన్న పొడి మొ॥

ఆటలతో పాటు పాటలూ ఉండేవి – బతుకమ్మ, కోలాటం, జాజిరి, అలావా, చప్పట్లు మొ||

చెరువు నీళ్ళను పొలాలకు సమంగా పంచేవాడు – పెద్దనీరటికాడు (ఈ పదవి వంశపారంపర్యం)

చిన్న నీరటిగాళ్ళను నియమించుకునేది – రైతులు

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

లగ్గాలప్పుడు మైలహాలు తీసేవారు మంగలివారు కాగా సన్నాయి వాయించునది – బత్తినివారు , లగ్గాలలో పూలు అల్లి ఇచ్చేది – తమ్మలి వారు , పోలు ముంతలు, కూరాటి కుండలు ఇచ్చేవారు – కుమ్మరివారు

లగ్గాలలో పత్రికలు పంచి సమాచారమిచ్చెడివారు – చాకలివారు

ధాన్యాన్ని నిలువచేయడానికి ఉపయోగించే గది – గరిసె అగ్ర

పల్లె ప్రజల వినోదాలు – నాటకాలు, యక్షగానాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, చిందుబాగోతాలు

వాగ్గేయకారుడు రామదాసు

కవి : కంచర్ల గోపన్న (రామదాసు)

కాలం : 1620 – 1680

వ్యవహార నామం : గోపరాజు

తల్లిదండ్రులు – కామమ్మ, లింగన్న

బిరుదు : భక్తరామదాసు

జన్మస్థలం : ఖమ్మంలోని నేలకొండపల్లి గ్రామం

రచనలు – దాశరథీ శతకం, దాసబోధ, కీర్తనలు

గోదావరి – మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం క్షేత్రంలో పుట్టింది. దక్షిణ భారతదేశంలోని నదుల్లోకెల్లా పొడవైనది.

గోదావరి నది ఎన్ని మైళ్ళు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది – 900 మైళ్ళు

భద్రాచల పుణ్యక్షేత్రం ఎప్పుడు రూపుదిద్దుకున్నది – 16వ శతాబ్దం తర్వాత

 తెలుగు చాటువుల్లో కనిపించే మల్కిభరాముడు – ఇబ్రహీం కుతుబ్ షా

 నేటి హైద్రాబాద్ నగరాన్ని నిర్మించినవాడు – మహమ్మద్ కులీకుతుబ్ షా |

 గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చివరి రాజు – అబుల్ హసన్ కుతుబ్ షా

అబుల్ హసన్ బిరుదు – తానాషా (అంటే అర్ధం మంచిరాజు)

 తానాషా కొలువులో మంత్రి, దండనాయకుడు – • అక్కన్న

మాదన్న (ప్రధానమంత్రి) అసలు పేరు – సూర్యప్రకాశరావు

 శివాజీ, తానాషాకి సంధి జరిపింది – అక్కన్న, మాదన్నలు

కంచర్ల గోపన్న తల్లిదండ్రులు – లింగన్న, కామమ్మ

కంచర్ల గోపన్న 1620 ప్రాంతంలో ఎక్కడ జన్మించాడు – నేలకొండపల్లి

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

ఏ వైష్ణవదీక్షా గురువు గొప్పన్నకు బాల రామాయణాన్ని తాత్పర్య సహితంగా చెప్పడం వల్ల గోపన్న మనసులో శ్రీరాముని మహిమలు నాటుకొని పోయాయి – రఘునాధ భట్టాచార్యులు

 కంచర్ల గోపన్న భార్య – కమల

కంచర్ల గోపన్న కొడుకు – రఘురాముడు

కంచర్ల గోపన్నకు తారక మంత్రోపదేశం చేసినది – కబీరు

గోపన్నను భద్రాచలం తహసీలుదారునిగా నియమించినవాడు తానాషా

 భద్రాద్రిలో దేవతా విగ్రహాలకు ఆరులక్షల వరహాలు ఖర్చుచేసినవాడు – రామదాసు

చెరశాలలో గురదారుల కొరడా దెబ్బలు తినలేక రామదాసు పాడినపాట

అబ్బబ్బ దెబ్బలకు తాళ లేర, రామప్పా

గొబ్బున నన్నాదు కోరా

 రామదాసు చెరశాలలో ఎన్నాళ్ళున్నాడు – 12 సం||

ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి అనే కీర్తనని పాడినది

 రామనామము బల్కవే పాపపు జిహ్వా అనే కీర్తనను వ్రాసినది – రామదాసు

 రామదాసు రచించిన దాశరథీ శతకంలోని మకుటం – దాశరథీ! కరుణాపయోనిధీ!

‘శ్రీరామ నామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాల వెరువాం అన్నది’ – కంచర్ల గోపన్న.

ఇక్ష్వాకు కులతిలక! ఇకనైన పలుకవే రామచంద్రా!’ అనే కీర్తన రాసినది – రామదాసు,

 ‘సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా!” అన్నది – రామదాసు

తలుపు తియ్యవయ్య తానీషా! నీ కియ్యెడి పై కమునియ్యవచ్చితిమయ్య’ అని తానీషాతో మారువేషంలో ఉన్న రామలక్ష్మణులు అన్నారు.

మారు వేషంలో ఉన్న రామలక్ష్మణులు ఆరు లక్షల వరహాలను తానీషాకు చెల్లించి రామదాసును విడిపించారు.

6వ తరగతి విశేషాంశాలు

నలుడు : విశ్వకర్మ అంశతో పుట్టిన ఒక వానరుడు. ఇతడు వానర సేన లంకకు పోవడానికి సముద్రానికి సేతువు కట్టాడు.

గండభేరుండ పక్షి : రెండు తలలు గల పక్షి. ఇది ఏనుగులను తన్నుకొనిపోవు శక్తిగలది.

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

జానపద సాహిత్యం : జనపదం అంటే గ్రామం. జనపదాలలో నివసించేవారు. జానపదులు, జానపద సాహిత్యం ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా పుట్టిందో చెప్పడం కష్టం. జానపద సాహిత్యం మౌఖికంగా ప్రసారమవుతూ ఉంటుంది. జానపద సాహిత్యానికి కర్త ఎవరో తెలియదు. సామూహిక కర్తృత్వం, సామూహిక ప్రచారం దీని లక్షణం. జానపద సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యడం వల్ల ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవచ్చు.

జినవల్లభుని శాసనం : వేములవాడ చాళుక్య రాజైన రెండవ అరికేసరి ఆస్థానకవి పంపడు. పంపని తమ్ముడు జినవల్లభుడు,

ఈయన క్రీ! ఈ 940లో ‘కుర్క్యాల శాసనం’ వేయించాడు. ఇది తెలంగాణలో తొలి పద్యశాసనం. దీనిలోమూడు కందపద్యాలు ఉన్నాయి. కుర్క్యాల శాసనాన్నే జినవల్లభుని శాసనం అంటారు. కుర్క్యాల గ్రామం కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఉన్నది.

అజ్ఞాతవాసం : కౌరవులు పాండవులతో పాచికలు ఆడేటప్పుడు పందెం కాస్తారు. పందెంలో ఓడిపోయినవారు పన్నెండు ఏండ్లు వనవాసం, ఒక యేడు అజ్ఞాతవాసం చెయ్యాలి. మాయాజూదంలో పాండవులు ఓడిపోతారు.

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

పన్నెండేండ్లు వనవాసం పూర్తయ్యాక ఒక యేడు అంతవాసం చేస్తారు. అజ్ఞాతవాసంలో ఎవరూ పాండవులను గుర్తుపట్టారు. అట్లా ఎవరైనా గుర్తుపడితే తిరిగి పన్నెండేండ్లు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. పాండవులు విరాటరాజు రాజ్యంలో అజ్ఞాతవాసం చేస్తారు.

కన్నమ్మ కష్టాలు – కష్టాల మీద కష్టాలు పెట్టడం’ లేదా రాచిరంపాన పెట్టడం’ అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

రామవారధి : తమిళనాడులోని ధనుష్కోటికి, శ్రీలంకకు మధ్యన రాముడు వారధిని నిర్మించాడని ప్రతీతి. అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ ఉపగ్రహం ద్వారా భూమి ఛాయాచిత్రాన్ని తీసింది. ఈ ఛాయాచిత్రంలో సముద్రంలో కట్టబడిన సేతువు స్పష్టంగా కనబడుతుంది. ఈ వారధి మూలంగా భారతదేశానికి ‘సునామీల ప్రభావం అంతగా ఉండడం లేదు. దీనికి ఆంగ్లములో ‘ఆడమ్స్ బ్రిడ్జ్’ అని పేరు.

కాకతీయ శిలాతోరణం : తెలంగాణ చరిత్రలో సువర్ణ ఆధ్యాయం కాకతీయుల కాలం. వారు చాలా కాలంపాటు ఓరుగల్లు కోట నుండి పాలన సాగించారు. 1199లో కోట నిర్మాణానికి గణపతిదేవుడు శ్రీకారం చుడితే అరివీర భయంకర వీరనారి అయిన ఆయన కూతురు రుద్రమదేవి కాలంలో కోట నిర్మాణం పూర్తయింది. కోట ఒక అద్భుత నిర్మాణం. కోట ద్వారంగా కీర్తి తోరణాలు ఉన్నాయి. ఆ కీర్తితోరణమే ఇప్పటి తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం. 

TS TELUGU 6TH CLASS 2021 12th lesson కాపాడుకుందాం Best Notes

For more

My Class Notes

TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము

 TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి

అలంకారాలు Usefull for TS AND AP Best Notes

TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన

TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం

My Vijetha

Telugu e Tutor

Post a Comment

0 Comments