TS TELUGU 5TH CLASS 2021 9th Lesson గోపి డప్పు Best Notes
ప్రక్రియ: కథ
ఇతివృత్తం : పిల్లల స్వభావం
ఉద్దేశం : మనం ఇతరులకు చేతనైన సహాయం చేస్తే మనకు కూడా మేలు జరుగుతుంది. దీనివల్లఅసలైన ఆనందం కలుగుతుంది అని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం.
TS TELUGU 5TH CLASS 2021 9th Lesson
పాత్రలు: గోపి, నాయనమ్మ, ముసలమ్మ, సరిత, రాజయ్య, వ్యాపారి, షావుకారు
రామాపురంలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు. నాయనమ్మతో కలిసి జీవించేవాడు.
” నాయనమ్మ కర్రలనమ్మి, మనవడిని చూసుకుంటూ జీవితం కొనసాగించేది.
ఒక రోజు నాయనమ్మ అంగడి నుండి ఏమి తీసుకురావాలని అడుగగా గోపి డప్పు’ కావాలనిఅడుగుతాడు.
22 రూపాయల డప్పును కొనలేక నాయనమ్మ కర్రచక్రం తీసుకుని వచ్చి గోపికి ఇస్తుంది.
చక్రంతో ఆడుకుంటూ పోతూ ఉంటే గోపీకి ఒకచోట ఒక ముసలమ్మ ఏడుస్తూ కనిపించింది.ఎందుకేడుస్తున్నావ్ అని అడగ్గా పొయ్యిలోకి కర్రలు లేవు, ఇంట్లో పిండి ఉంది, బాగా ఆకలిగా ఉంది. అనటంతో కర్ర చక్రాన్ని వేసి పొయ్యి వెలిగించి వంట చేసుకోమని గోపి చెప్పాడు.
అవ్వ ఇచ్చిన రొట్టెను తీసుకుని బయలుదేరగా దారి మధ్యలో కుండలు చేసే కనకయ్య కూతురు సరిత, వాళ్ళమ్మ ఒడిలో పడుకుని ఏడుస్తోంది. ఎందుకు అని అడగ్గా ఆకలి వలన అని తెలిసి రొట్టెను ఇచ్చాడు.ఆవిడ కుండ ఇచ్చింది.
ఆ కుండను తీసుకుని నడుస్తుండగా బట్టలు ఉతికే రాజయ్య కుమారుణ్ణి కుండ పగులగొట్టినందుకు మందలిస్తున్నాడు. దానిని చూసి రాజయ్యకి కుండ ఇవ్వగా గొంగడిని గోపికి రాజయ్య ఇచ్చాడు.
నది దగ్గర చలికి వణుకుతున్న వ్యక్తికి గోపి గొంగడిని కప్పగా, తాను వ్యాపారినని, దారి మధ్యలో దొంగలు మొత్తం దోచుకుపోయారని తెలిపాడు. కృతజ్ఞతగా గుర్రాన్ని తీసుకెళ్ళమనగా, గోపి గుర్రాన్ని తీసుకుని వెళ్తుండగా పట్నంలో ఊరేగింపు కనిపించింది. కాని ముందుకు సాగక అందరూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు.
TS TELUGU 5TH CLASS 2021 9th Lesson
గోపి ఏమైందని అడగగా ‘ఈ రోజు నా కొడుకు పెళ్ళి’ ఇప్పుడు ఊరేగింపు జరపాలి, కాని సమయానికి రావలసిన గుర్రం ఇంకా రాలేదు అని చెప్పాడు.
మీరమీ చింతించకంది. నా దగ్గర గుర్రం ఉంది. ఊరేగింపు మొదలు పెట్టండి అంటూ గోపి చెప్పాడు.
ఊరేగింపు ఘనంగా జరిగిన తర్వాత గోపితో పెళ్ళికొడుకు తండ్రి, గుర్రం ధర ఎంతో చెప్తే ఇస్తానని, సమయానికి అనుకున్నావు, నువ్వు చాలా మంచి బాలుడిని అని చెప్పగా గోపి నాకు డప్పు అంటే ఇష్టం అది ఇస్తే చాలు అని చెప్పాడు.
డప్పుతో పాటు ధనాన్ని కూడా ఆ షావుకారు ఇవ్వగా గోపి మనసులో “నేను వచ్చేటప్పుడు కర్ర చక్రంతో వచ్చాను. అందరికీ సాయం చేస్తూ వెళ్ళటం వలన నాకు ఇష్టమైన దానిని పొందగలిగానని” ఎంతో సంతోషపడతాడు.
TS TELUGU 5TH CLASS 2021 9th Lesson
నాయనమ్మ | కర్రచక్రం | |
ముసలమ్మ | కర్రచక్రం | రొట్టె |
కనకయ్యకూతురుసరిత | రొట్టె | కుండ |
రాజయ్య | కుండ | కంబళి |
వ్యాపారి | కంబళి | గుర్రం |
షావుకారు | గుర్రం | డబ్బు + డప్పు |
విభక్తి ప్రత్యాయాలు :
వాక్యంలో చేరి వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు.
ఉదా : 1. పాలు సేమ్యాతో పాయసం చేస్తారు..
2 రాజు కంటే రవి మంచి మార్కులు పొందాడు.
TS TELUGU 5TH CLASS 2021 9th Lesson
For more
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
0 Comments