TS TELUGU 4TH CLASS 2021 6th Lesson సుమతీ శతకం Best notes
ప్రక్రియ: పద్యాలు
ఇతివృత్తం – నైతిక విలువలు,
బద్దెన రాసిన శతరం – సుమతీ శతకం
సుమతీ శతక పద్యాలు కందం అనే ఛందస్సులో ఉన్నాయి.
TS TELUGU 4TH CLASS 2021 6th Lesson
ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ.
చీమలు పెట్టిన పుట్టలు
పాములకిరవైనయట్లు పామరుఁడు తగన్
హేమంబు కూడఁ బెట్టిన
భూమీశులపాలఁ జేరు భువిలో సుమతీ.
TS TELUGU 4TH CLASS 2021 6th Lesson
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
దన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ.
ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పులుగఁ జెఱువు నిండినఁ
గప్పలు పదివేలు చేరుఁ గదరా సుమతీ.
TS TELUGU 4TH CLASS 2021 6th Lesson
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపందగున్
కని కల్ల నిజము తెలిసిన
మనుజుఁడె పో నీతిపరుఁడు మహిలో సుమతీ.
బలవంతుఁడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీములచేతఁ జిక్కి చావదె సుమతీ.
TS TELUGU 4TH CLASS 2021 6th Lesson
కూరిమిగల దినములలో
నేరము లెన్నఁడును గలుగనేరవు మఱియా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ.
లావు గలవాని కంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండా
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ.
TS TELUGU 4TH CLASS 2021 6th Lesson
ఆ మనకు మేలు చేసిన వాడికి మేలు చేయడం గొప్ప కాదు, మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనం అన్న భావం ఉన్న పద్యం – ఉపకారికి నుపకారం, నెపమెన్నక .
చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనయట్లు,అత్యాశతో దాచిన సొమ్ము ఎవరి పాలవుతుంది ? – రాజుల పాలవుతుంది.
బంధువులను బద్దెన వేటితో పోల్చాడు – కప్పలతో
శాంతమే రక్ష, సంతోషమే స్వర్గము అని తెలియజెప్పే బద్దెన పద్యం – తన కోపమే తన శత్రువు ….
కండబలం కంటే బుధ్ధి బలం గొప్పదని తెలియజేసే పద్యం – లావుగల వానికంటెను
భాష భాగాలు
విశేషణాలు – వేగం , పెద్దది, అందమైన మొదలైనవి
ఉదా : 1. విండీస్ వేగంగా తొలింగ్ చేసేవాడు.
2. రామప్ప చెరువు చాలా పెద్దది.
3. మంజీరా నదిలోని నీళ్ళు తియ్యగా ఉంటవి.
4. భువనగిరికోలు విశాలంగా ఉన్నది.
5.రామాపురం ఐడిలో అందమైన తోట ఉన్నది.
TS TELUGU 4TH CLASS 2021 6th Lesson
అర్ధాలు:
భూమీశులు = రాజులు
కల్లలు = అబద్ధాలు
కూరిమి = స్నేహము
హేమం = బంగారం
నిక్కముగా = నిజంగా
తథ్యము = తప్పకుండా
For more
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
0 Comments