. AP Class 3 EVS Best Notes for AP TET and DSC

Ticker

6/recent/ticker-posts

AP Class 3 EVS Best Notes for AP TET and DSC

3 తరగతిపరిసరాల విజ్ఞానం

అందమైన కుటుంబం

  • ఒక కుటుంబంలో తాతయ్య, నానమ్మ, అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి మొదలైనవారు ఉంటారు.
  • అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళని “తోబుట్టువులు” అంటారు.
  • కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఇంటిపనులు నిర్వహిస్తారు.
  • పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమగా ఉంటూ భద్రత కల్పిస్తారు.
  • మన గ్రామంలో వివిధ వృత్తి పనులు చేసేవారు ఉంటారు. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులు “వృత్తులు”.
  • కుటుంబ పేద పరిస్థితుల కారణంగా కొందరు పిల్లలు బడికి వెళ్లలేని స్థితి ఉంటుంది – బడిబయట పిల్లలు.
  • సాధారణంగా కుటుంబ సభ్యులు పెద్దవారి పోలికలతో ఉంటారు. తమ ప్రవర్తనలో కూడా వారిని అనుసరిస్తూ ఉంటారు.
  • పిల్లలు రంగు, ఎత్తు వంటివి తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తాయి.

మన చుట్టూ ఉన్న మొక్కలు

  • మొక్కలకి వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు మొదలైన భాగాలు ఉంటాయి.
  • వేర్లు నేల దిగువన ఉంటాయి. ఇవి మొక్క భాగాలు అన్నింటిలో ముఖ్యమైనవి. నేలలో లవణాలు, నీరు పీల్చుకుని మొక్క కాండం, ఆకులకి పంపుతాయి.
  • వేర్లు పీల్చుకున్న లవణాలు, నీరును కాండం మొక్కలో వివిధ భాగాలకి అందిస్తుంది. మొక్కకి ఊతం ఇస్తుంది.
  • టమాటా మొక్క కాండం సన్నగా ఉంది నూగుగా ఉంటుంది. కాండాలు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని మెత్తగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కొన్ని గట్టిగా గోధుమ రంగులో ఉంటాయి. కొన్ని లావుగా ఉంటాయి.
  • మొక్క పెద్దయ్యే కొద్దీ కొన్ని కాండాలు బలంగా మారతాయి. ఈ బలమైన కాండాన్ని “మ్రాను” అంటారు. మ్రానులు బెరడుతో కప్పి ఉంటాయి.
  • పెద్దగా, బలంగా ఉండే మొక్కలు – చెట్లు
  • ఉదా : మర్రిచెట్టు, చింత చెట్టు
  • గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగి మొక్కలు – పొదలు
  • ఉదా : గులాబీ, మందార
  • మెత్తగా ఆకుపచ్చ కాండాలు గల మొక్కలు – గుల్మాలు
  • ఉదా : తులసి, గోధుమ
  • ఏదైనా ఒక ఆధారం పట్టుకుని పెరిగే మొక్కలు – ఎగబ్రాకే మొక్కలు
  • ఉదా : ద్రాక్ష, కాకర
  • నేలపై పాకుతూ పెరిగే మొక్కలు – పాకే మొక్కలు
  • ఉదా : పుచ్చకాయ, గుమ్మడికాయ
  • ఆకులు మొక్కలకి కావాల్సిన ఆహారం తయారుచేస్తాయి. ఆకులు ఆహార కర్మాగారాలు. ఇవి ఆహారం గాలి, నీరు, సూర్యరశ్మి సాయంతో తయారుచేస్తాయి.
  • అరటి ఆకులు – పెద్దవిగా
  • మందార – వెడల్పు, రంపపు ఆకారం అంచు
  • బొప్పాయి – హస్తం ఆకారం
  • కొబ్బరి – పొడవు ఈనెలు
  • చింత – చిన్న ఆకులు
  • పుదీనా, కొత్తిమీర, తులసి – మంచి వాసన కలవి
  • కొత్తిమీర, మునగాకు, కరివేపాకు మొదలైన ఆకులు తింటాం.
  • తేయాకు – టీ
  • వేపాకు, తులసి – వైద్యం
  • అరటి, మర్రి ఆకులు మొ. – విస్తర్లు, పాత్రలు తయారీ.
  • రాలి పడిన ఆకులు ఎరువుల తయారీలో వాడతారు.
  • మొక్కలు కార్బన్ డై అక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ మనకి ఇస్తాయి.
  • పెద్ద మొక్క వేర్లు నేలలో బలంగా చొచ్చుకుపోవడం వల్ల భూసార నష్టం కాకుండా కాపాడతాయి.

మన చుట్టూ ఉన్న జంతువులు

  • మన ఇళ్లల్లో మనతో పాటు నివసించే పిల్లులు, కుక్కలు మొదలైన జంతువులు – పెంపుడు జంతువులు
  • ఆవులు పాలు ఇస్తాయి. ఎద్దులు, దున్నలు వ్యవసాయ పనుల్లో సహాయ పడతాయి. కోడిపెట్ట, బాతు గుడ్లు పెడతాయి. మేకలు పాలు, మాంసం ఇస్తాయి. గుర్రాలు, గాడిదలు బరువులు మోస్తాయి. ఇవి అన్నీ కూడా మచ్చిక చేసుకునే జంతువులు.
  • అడవుల్లో నివసించే పులి, సింహం మొదలైనవి – వన్య మృగాలు
  • జంతువులు వివిధ ప్రదేశాల్లో నివసిస్తాయి. కొన్ని చెట్లపైన, కొన్ని నీటిలో, కొన్ని నేల మీద నివసించును.
  • నేల మీద నివసించేవి – భూచర జీవులు. ఆవు, కుక్క, కోడి మొదలైనవి.
  • నీటిలో నివసించేవి – జలచర జీవులు. పడవ ఆకారం శరీరం, వాజాలు, మొప్పలు, తోక నీటిలో నివసించడానికి వీటికి సహాయపడెను. ఉదా. చేపలు
  • నేల మీద, నీటిలో నివసించేవి – ఉభయచరాలు. తేమగా ఉండే చర్మం, వేళ్ళ మధ్య చర్మం, బలమైన వెనుక కాళ్ళు అనేవి వీటికి నేలమీద, నీటిలో నివసించడానికి సహాయం చేస్తాయి. ఉదా. కప్ప, సాలమండర్
  • మొక్కల నుండి లభించే ఆహార పదార్ధాలను తినేవి – శాఖాహారులు. ఉదా. ఆవు, గుర్రం, జింక, ఏనుగు మొదలైనవి.
  • ఉడుతలు కాయలు, గింజలు తింటాయి.
  • ఇతర జంతువుల మాంసం తినేవి – మాంసాహారులు. ఉదా. పులి, సింహం, నక్క
  • మొక్కల్ని, మాంసాన్ని తినేవి – ఉభయహారులు. ఉదా. ఎలుగుబంటి, కాకి, కోతి, కుక్క మొదలైనవి.
  • తేనెటీగలు, సీతాకోకచిలుకలు, పుష్పల్లో మకరందం పీల్చుకుంటాయి.
  • రాబందులు, కాకులు, నక్కలు చనిపోయిన, కుళ్ళిపోయిన జంతు కళేబరాలు తింటాయి. వీటిని “సహజ పారిశుధ్య కార్మికులు” అంటారు.
  • జంతువులు ఇతరుల్ని హెచ్చరించుటకు, తమ నివాస ప్రాంతాలకు రాకుండా ఉండడానికి రకరకాల ధ్వనులు చేస్తాయి, అరుస్తాయి.
  • పక్షులు తమని గుర్తించడానికి, ఇతర పక్షులకు సమాచారం అందించడానికి రకరకాల ధ్వనులు చేస్తాయి.

మన శరీరం

  • మన శరీరం మూడు భాగాలుగా విభజించి ఉంటుంది. తల, మొండెం, కాళ్ళు చేతులు.
  • మెడ తలని మిగతా శరీర భాగాలలో కలుపును. తల అటు ఇటు కదపడానికి మెడ ఉపయోగపడెను.
  • చర్మం శరీరం లోపల భాగాలని కప్పి ఉంచుతుంది. స్పర్శ గుర్తిస్తుంది.
  • చైల్డ్ లైన్ – 1098. ఆపదలో ఉన్న బాలలని కాపాడడానికి 24 గంటలు పని చేయు అత్యవసర వ్యవస్థ.

ఆహారంఆరోగ్యం

  • మనకి లభించే ఆహారపదార్ధాల బట్టి మన ఆహార అలవాట్లు ఉంటాయి.
  • మన ప్రాంతంలో వరి ఎక్కువ లభిస్తుంది. కనుక మనలో చాలా మంది వరి అన్నం తింటాం.
  • అన్నంతో పాటు పాలు, పెరుగు, ఇడ్లీ, దోశ, గుడ్లు తింటాం.
  • ఆహారం మనకి శక్తి ఇస్తుంది.
  • ఆహార అలవాట్లు అనేవి వయసు బట్టి మారుతూ ఉంటాయి.
  • మనకి ఆహారం మొక్కలు, జంతువుల నుండి లభిస్తుంది.
  • మొక్కలో ఆకులు, కాండం, పుష్పం, పండ్లు, విత్తనాలు, వేర్లు మనం తింటాం.
  • వరి కాకుండా మనం సజ్జలు, సామలు, కొర్రలు, రాగులు మొదలైన ఆహార ధాన్యాలు తీసుకుంటాం.
  • మనం తినే ఆహారపదార్ధాల్లో జొన్న, గోధుమ ముఖ్యమైనవి.
  • మనకి చెరుకు నుండి చక్కెర, బెల్లం లభించును.
  • మొక్కలో పోషక విలువలు అధికంగా ఉండే భాగం – ఆకులు
  • మనం రకరకాల ఆకులు తింటాం. తోటకూర, మునగ, పాలకూర, కరివేపాకు
  • అరటి, కాలీఫ్లవర్ పుష్పాలు ఆహారంగా తీసుకుంటాం.
  • లవంగాలు మొగ్గలు రుచిగా ఉంది మసాలాగా వాడెదరు.
  • కుంకుమ పువ్వు ప్రత్యేక వంటకాలు చేయుటకై వాడెదరు.
  • పుట్టగొడుగు ఒక శీలింద్రం. అనేక పోషకాలు కల్గి ఉంటుంది.
  • టమాటా, దోస కూడా పండ్లు. వీటిని మనం కూరగాయలుగా ఉపయోగిస్తాం.
  • నూనెలు – వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం, ఆలివ్ విత్తనాలు
  • జీడిపప్పు, పచ్చి బఠానీ, రాజ్మా గింజలు, ఎరుపు కిడ్నీ బీన్స్, జనములు, వేరుశనగ విత్తనాలు తింటాం.
  • ఆవు, మేక, బర్రెలు మనకి పాలు ఇచ్చెను. పాలు నుండి పెరుగు, వెన్న, నెయ్యి లభించెను.
  • మాంసం, గుడ్లు కోసం కోడి, బాతు పెంచుతాం.
  • చేపలు, పీతలు, రొయ్యలు నత్తలు మొదలైన సముద్ర జీవులు నుండి ఆహారం లభించెను.
  • తేనెటీగలు పూల నుండి మకరందం సేకరించి నిల్వ చేస్తాయి.
  • వంటకి వంట పాత్రలు, వేయించుటకి – పెనం, ఆవిరితో ఉడికించుటకు – కుక్కర్
  • తక్కువ సెగ పై కాల్చుటకు – గ్రిల్

నీరుప్రకృతి వరం

  • ప్రపంచ జల దినోత్సవం – మార్చి 22
  • నీరు దొరికే సహజవనరులు – సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు, చెలమలు.
  • మానవులు చేయు వివిధ పనుల ద్వారా నీరు కలుషితం అవుతుంది.
  • సీలు వేయని సీసాలలో ప్యాకెట్లలో చాలాకాలం నిల్వ ఉండే నీరు వాడరాదు.
  • నీరు వేడిచేయడం, వడపోయడం, శుద్ధి చేయు సాధనాల ద్వారా శుద్ధి చేయవచ్చు.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పాఠశాలలో నీటి గంట పరిచయం చేశారు. ఇది రోజుకి రెండుసార్లు మొగుతుంది. దీని ఉద్దేశ్యం విద్యార్థులు తగినంత నీరు తాగేలా చెయ్యడం.

మన ఇళ్లు

  • మనకి ఎండ, వాన, చలి నుండి రక్షణకు ఇల్లు అవసరం.
  • నివాసాల పరిణామ క్రమం : గుహలు – పురిల్లు – మట్టిల్లు – పెంకుటిల్లు – డాబా – బహుళ అంతస్థుల భవనం
  • ప్రజలు ఇల్లు కట్టడానికి ఆధారపడిన అంశాలు – వాతావరణం, ఆర్ధిక పరిస్థితి, స్థలం లభ్యత, లభ్యం అయ్యే సామాగ్రి.
  • గుడిసె – గోడలు వెదురుతో నిర్మించబడి పైకప్పు కొబ్బరి లేదా తాటాకులతో లేదా గడ్డితో కప్పబడి ఉంటుంది.
  • రాతి ఇల్లు – గోడలు, పైకప్పు రాతితో కట్టబడి ఉంటుంది. ఈ రకమైన ఇల్లు రాయలసీమలో కనబడతాయి.
  • ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళవలసిన వారు గుడారాలు నిర్మించుకుంటారు.
  • కారవన్ – ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి నడపడానికి వీలుగా బండి చక్రాలు, టైర్లతో నిర్మించబడి ఉంటుంది.
  • ఒక చోటు నుండి మరో చోటుకి మార్చేవి తాత్కాలిక నివాసాలు.
  • మార్చే వీలు లేనివి – శాశ్వత నివాసాలు.
  • కచ్చా ఇల్లు – మట్టి, గడ్డిచే నిర్మించబడి ఉంటుంది.
  • పక్కా ఇల్లు – ఇసుక, ఇటుక, ఇనుముతో నిర్మించింది.
  • జంతువులకు కూడా నివాసాలు అవసరం. ఎండ, వాన, చలి, శత్రువుల నుండి రక్షణకు.
  • సింహం, ఎలుగుబంటి అడవిలో గుహల్లో ఉంటాయి.
  • కుందేలు, ఉడుతలు బొరియాల్లో నివసించెను.
  • పక్షులు గుళ్లలో నివసించెను.పక్షులు తమ పిల్లల్ని రక్షించడానికి గుళ్ళు కడతాయి. పుల్లలు, గడ్డి పరకలు, ఆకులు, పత్తి, తీగలు మొ. ఉపయోగించి కట్టెను.
  • చేపలు, తిమింగలం – నీటిలో
  • కప్ప/మొసలి – నేల/నీరు
  • కోతులు, ఏనుగులు వంటి వాటికి ప్రత్యేక నివాసాలు ఉండవు.
  • పిచ్చుక – చెట్లు, ఇల్లు దూలాలపై గుళ్ళు కట్టెను కర్రపుల్లలు, ఆకులు, గడ్డి. పత్తి ఉపయోగించెను.
  • వడ్రంగి పిట్ట – చెట్టు కాండాలకి పెద్ద తొర్రలు చేసి నివాసం ఉంటుంది.
  • గిజిగాడు – చెట్లు చిగురుల్లో గడ్డి, కర్రపుల్లలు ఉపయోగించి గూడు కట్టెను. క్రింది వైపు ప్రవేశించడానికి ఒక ద్వారం ఏర్పరుచుకుంటుంది.

ఊరికి పోదాం

  • బస్సులు నిలుపు స్థలం – బస్టాండ్.
  • బస్సు కోసం వేచి ఉండడానికి, కూర్చోడానికి అనువైన స్థలం – ఫ్లాట్ ఫారం.
  • రోడ్డు తయారీకి వాడే పదార్ధాల బట్టి రోడ్డులు ఆరు రకాలు. అవి మట్టిరోడ్డు, గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తారు రోడ్డు, కాంక్రీట్ రోడ్డు.
  • ప్రయాణీకుల  అవగాహన కోసం, ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ అసౌకర్యాలు అరికట్టడానికి వివిధ సూచికలు తెలిపే బోర్డులు వాడతారు.
  • సిగ్నల్ లైట్స్ : ఎరుపు – ఆగడం, పచ్చ – వెళ్లడం, ఆరెంజ్ – సిద్ధంగా ఉండుట
  • వాహనాలు నడపడానికి పెట్రోల్, డీజిల్, CNG వంటి ఇంధనాలు వాడతారు.

మాట్లాడుకుందాం

  • ఇతరులకు మన భావాలు ఆలోచనలు తెలిపే విధానం – భావ వ్యక్తీకరణ
  • నృత్య కళాకారులు, మైమ్ కళాకారులు వివిధ రకాల సంజ్ఞల భాష వాడతారు.
  • నృత్య కళాకారులు భావ వ్యక్తీకరణకి ముద్రలు వాడతారు.
  • కమ్యూనికేషన్ ముఖ్య ఉద్దేశ్యం మన భావాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం.
  • భావ వ్యక్తీకరణ రెండు రకాలు. అవి
  •                 మౌఖిక సంభాషణ – పరస్పరం మాట్లాడడం
  •                 శబ్ద సంభాషణ – హావభావాలు ద్వారా
  • ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ – భావాలు, ఆలోచనలు వారి శరీర కదలికలు ద్వారా వ్యక్త పరచడం.
  • కరచలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ
  • పరోక్ష భావ వ్యక్తీకరణ – పోస్ట్ కార్డ్, మెయిల్, ఫోన్, మెసేజ్, దూరదర్శిని చూడడం మొదలైనవి.
  • పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉండేవారితో వారు చెప్పదలచినది డంకా ద్వారా గాని, పొగ ద్వారా సంకేతం ఇవ్వడం, పావురాల ద్వారా లేఖలు పంపడం, గుర్రపు స్వారీ చేయువారు ద్వారా వర్తమానం పంపేవారు.
  • చెవిటి, మూగ వ్యక్తులు తమ భావాలు వ్యక్తపర్చడానికి సంకేత భాష వాడతారు.
  • చీమలు తమ కాళ్ళు, తల ద్వారా ఒకదానితో ఒకటి భావాలు వ్యక్తపరుస్తాయి.
  • దృశ్య భావ వ్యక్తీకరణ :
  •                 తాబేలు, నత్తలు బెదిరింపుకి గురి అయితే వాటి తల ముడుచుకుంటాయి.             
  •                 కుక్కలు సంతోషంగా ఉంటే వాటి తల ఊపుతాయి.
  • శ్రావణ భావ వ్యక్తీకరణ :
  •                 ఏనుగులు ఘీంకారం ద్వారా ఇతర గుంపుతో మాట్లాడెను.
  •                 ఇతర తోడేళ్లను పిలవడానికి తోడేళ్ళు ఊళ వేస్తాయి.
  • రసాయన భావ వ్యక్తీకరణ :
  •                 పిల్లులు తమ వాసన గుర్తించుటకు వస్తువుల మీద రుద్దెను.
  •                 పాములు, కుక్కలు శత్రువులు గుర్తించుటకు వాసన జ్ఞానం ఉండెను.\
  • స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ :
  •                 కుక్కలు, పిల్లులు తమ ప్రేమ వ్యక్త పరచడానికి పిల్లలను నాకుతాయి.
  •                 కోతులు, బబూన్ లు ఒకదానితో ఒకటి ప్రేమ కనబరచడానికి దువ్వుతాయి.
  • “వాగల్ డ్యాన్స్” అనేది తేనెటీగలలో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ. కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారం నాట్యం ద్వారా తెల్పును.

ఆటలువినోదం

  • ఆటలు అనేవి వినోదాత్మకం
  • లోపల ఆడే ఆటలు – ఇండోర్ గేమ్స్. అష్టా చెమ్మా, చదరంగం, పులి-మేక, వామన గుంతలు, గుచ్చం గాయలు, చైనీస్ చెక్కర్స్, టేబుల్ టెన్నిస్ మొదలైనవి.
  • ఖాళీ ప్రదేశాల్లో, క్రీడా మైదానంలో ఆడే ఆటలు – అవుట్ డోర్ గేమ్స్. కబడ్డీ, ఖోఖో, ఫుట్ బాల్, టెన్నిస్, టెన్నికాయిట్, క్రికెట్ మొదలైనవి.
  • ఆనందం కోసం, మన శరీరం తేలికగా ఉండడం కోసం చేయు క్రియ – వినోదం. చదవడం, ఆటలు, సంగీతం వినడం, తోటపని, ప్రయాణం మొదలైనవి.
  • పార్కులు, బీచ్ లు కొన్ని వినోదం కలిగించే ప్రదేశాలు.
  • మన రాష్ట్ర క్రీడ – కబడ్డీ (చెడుగుడు), జాతీయ క్రీడ – హాకీ
  • పల్లెల్లో పిల్లలు వివిధ ఆటలు ఆడతారు. ఏడు పెంకులాట, కోతి కొమ్మచ్చి, బొంగరాలు ఆట, పులి మేక, ముక్కు గిల్లే ఆట, తొక్కుడు బిళ్ళ, నేల – బండ, కర్ర – బిళ్ళ మొదలైనవి. వీటిని “ప్రాంతీయ క్రీడలు” అంటారు.
  • మనం ఆటలు ఆడేందుకు కొన్ని పరికరాలు, ఆట సామగ్రి అవసరం
  • టెన్నికాయిట్ – రింగ్ బాల్, తాడు
  • క్రికెట్ – బ్యాట్, బాల్, స్టంప్స్
  • పిల్లల అటల సమయం – సాయంత్రం 4 నుండి 6 గం.
  • ఆటల వల్ల ఆనందం, ఆరోగ్యం కలిగెను.
  • పరస్పర సహకారం, ఐక్యత, పరస్పర అవగాహన, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందును.
  • జట్టులో ఆటగాళ్లు పరస్పరం ఒకరిని ఒకరు సహకరించుకోవడం – బృంద స్ఫూర్తి

దిక్కులుమూలాలు

  • మన సమీప ప్రాంతంలో సౌకర్యాలు మన జీవితాలను సౌకర్యవంతం చేయును.
  • సూర్యుని ఎదురుగా నిలబడితే – ఎదురుగా ఉండేది తూర్పు, వెనుక పడమర, ఎడమ – ఉత్తరం, కుడి – దక్షిణ
  • అన్ని దిక్కులు స్థిరం. ఉత్తరం నుండి లెక్కించబడెను.
  • ఒక ప్రాంతం/ఊరు హద్దులు – సరిహద్దులు
  • రెండు దిక్కుల మధ్య ప్రాంతం – మూల
  • తూర్పు – ఉత్తర మధ్య — ఈశాన్యం
  • తూర్పు – దక్షిణ మధ్య — ఆగ్నేయం
  • పడమర – ఉత్తర మధ్య — వాయువ్యం
  • పడమర – దక్షిణ మధ్య — నైఋతి
  • పురాతన కాలంలో నావికులు సూర్యుడు, నక్షత్రాలు, పవనాలు దిశ బట్టి దిక్కులు కనుగొనేవారు.
  • నేడు దిక్సుచి, GPS ద్వారా దిక్కులు కనుగొంటున్నాం.
  • GPS – GLOBAL POSITIONING SYSTEM
  • ఒక ప్రాంత సమీపంలో తెలిసిన ప్రదేశాలను “గుర్తింపు చిహ్నాలు” అంటారు.
  •  

Post a Comment

0 Comments