. 6వ తరగతి కవి కాలాదులు

Ticker

6/recent/ticker-posts

6వ తరగతి కవి కాలాదులు

6వ తరగతి కవి కాలాదులు, for TET and DSC 2022 | నూతనం గా ప్రవేశ పెట్టిన ఆరవ తరగతి కవులు మరియు వారి విశేషాలు .

 

6వ తరగతి కవి కాలాదులు

పాఠం కవి కాలం బిరుదులు / అవార్డులు మూలాగ్రంధం ఇతర రచనలు
అమ్మవడి బాడిగ వెంకట నరసింహారావు 15.08.1913 – 06.01.1994 బాలబంధు బి.వి.నరసింహారావు సంపూర్ణ రచనలు రెండవ సంకలనం బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు-హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారిలోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు.
కృష్ణా జిల్లా కౌతారం లో జన్మించారు.

బాలసాహిత్యాన్ని ఉద్యమ స్పూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయం.

వింజమూరి లక్ష్మీనరసింహారావు రాసిన “అనార్కలి” నాటకంలో అనార్కలి పాత్ర ధరించి “అనార్కలి నరసింహారావు”గా ఖ్యాతి గడించారు.

తృప్తి సత్యం శంకరమంచి 03.03.1937 – 21.05.1987  అమరావతి కధలు అమరావతి కధలు, కార్తీక దీపాలు – కధా సంపూటాలు.

రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు – నవలలు

హారహారమహాదేవ నాటకం, దిన వార పత్రికలలో అనేక వ్యాసాలు

గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు.

1979 లో “అమరావతి కధలు” కు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

మాకొద్దీ తెల్లదొరతనం గరిమెళ్ళ సత్యన్నారాయణ 14.07.1893 – 18.12.1952   హరిజనుల పాటలు(1923), స్వరాజ్య గీతములు(1921), ఖండ కావ్యాలు(1926), భక్తి గీతాలు, బాల గీతాలు.

దండాలు దండాలు భరతమాత, మాకొద్దీ తెల్లదొరతనం – గేయాలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు లో జన్మించారు.

స్వాతంత్ర్య సమరయోధులు, కవి, రచయిత.

దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ.

సమయస్ఫూర్తి కందుకూరి వీరేశలింగం 16.04.1848 – 27.05.1919 గద్య తిక్కన పంచతంత్ర కధలు విగ్రహం అనే భాగంలో కధ రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత భోదిని, ఆంధ్రకవుల చరిత్ర,
రాజమండ్రిలో జన్మించారు.

వీరు సంఘసంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త

సుభాషితాలు నార్ల చిరంజీవి 20వ శతాబ్దం   తెలుగుపూలు శతకం
వేమన 17వ శతాబ్దం   వేమన శతకం
కరుణశ్రీ20వ శతాబ్దం   తెలుగుబాల శతకం
తిక్కన 13వ శతాబ్దం   మహాభారతం
పక్కి అప్పలనరసింహం 17వ శతాబ్దం   కుమార, కుమారీ శతకాలు
పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం   కాళికాంబ సప్తసతి
మారద వెంకయ్య 16వ శతాబ్దం   భాస్కర శతకం
కంచర్ల గోపన్న 17వ శతాబ్దం   దాశరదీ శతకం
మమకారం చిలుకూరు దేవపుత్ర 24.04.1952 – 18.10.2016  ఆరుగ్లాసులు కదా సంపుటి ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, ఆరుగ్లాసులు మొ. కథాసంపుటాలు.

అద్దంలో చందమామ, పంచమం నవలలు

అనంతపురం జిల్లా కాల్వపల్లెలో జన్మించారు.

పంచమం నవలకి అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవల పోటీలో తృతీయ బహుమతి(1996), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం(2000), చా.సో.స్ఫూర్తి సాహితీ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించాయి.

మేలుకొలుపు కుసుమ ధర్మన్న 17.03.1900 – 1946  హరిజన శతకం అనుబంధం నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం వంటి రచనలు
రాజమహేంద్రవరం లక్ష్మీవారపు పేట లో జన్మించారు.

తల్లిదండ్రులు – కుసుమ నాగమ్మ, వీరాస్వామి

వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్లం, హిందీ ఉర్దూలలో పాండిత్యం కలవారు.

కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు.

అంబెడ్కర్ స్ఫూర్తితో అంటరానితనం నిర్ములించాలని తపించిన తొలి దళిత కవి.

ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో రవీంద్రనాధ్ ఠాగూర్ 07.05.1861 – 07.08.1941  గీతాంజలి 
విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త.

బెంగాలీ, ఇంగ్లీష్ లలో అన్ని సాహిత్య ప్రక్రియల్లో విస్తృతంగా రచనలు చేశారు.

1913 లో గీతాంజలి రచనకు నోబెల్ బహుమతి వచ్చింది.

 గుడిపాటి వెంకట చలం18.05.1894 – 04.05.1979 కవి, కధారచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త. తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత.

స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం గురించి పరితపించారు.

ఉపాధ్యాయునిగా, పాఠశాల పర్యవేక్షకునిగా తాను గమనించిన అంశాలు దృష్టిలో ఉంచుకొని “బిడ్డల శిక్షణ” అనే పుస్తకం రాశారు.

విద్యను, పిల్లల పెంపకాన్ని మేళవించవలసిన అవసరం గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు.

 

ధర్మ నిర్ణయం విశ్వనాధ సత్యనారాయణ “ఆంధ్ర ప్రశస్తి”, “శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్మ్యం” ఈ పాఠానికి ఆధారం.
త్రిజట స్వప్నం ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దం  మొల్ల రామాయణం సుందరకాండ  
కడప జిల్లాలో గోపవరంలో జన్మించారు. రామభక్త కవయిత్రి.

మొల్ల రామాయణంలో 871 గద్య, పద్యాలు ఉన్నాయి.

తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి.

డూ డూ బసవన్న రావూరి భరద్వాజ 05.07.1927 – 18.10.2013 కళాప్రపూర్ణ జీవన సమరం విమల (ఈయన రాసిన తొలికధ). అపరిచితులు, కదాసాగరం వంటి 37 కథాసంపుటాలు. ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కధలు. కరిమ్రింగిన వెలగపండు, జల ప్రళయం వంటి 17 నవలలు.
గుంటూరు జిల్లా తాడికొండ లో జన్మించారు.

వీరి “పాకుడురాళ్లు” నవలకి జ్ఞానపీఠ్ అవార్డు లభించింది.

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రు పురస్కారం, రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు. గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న(ఆంధ్రప్రదేశ్), లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు.

 

Post a Comment

0 Comments