TS TELUGU 6TH CLASS 2021 6th lesson పోతన బాల్యం
6. పోతన బాల్యం
ప్రక్రియ : కావ్యం
ఇతివృత్తం : పిల్లల ఆసక్తులు
మూలం :పోతన చరిత్రములోని – ప్రథమా శ్వాసంలోనిది.
కవి : డా, వానమామలై వరదాచార్యులు
జన్మస్థలం : జననం : 16, 8, 1912, మరణం : 30, 10, 1984
జన్మస్థలం : వరంగల్ జిల్లా మడికొండ గ్రామం (ప్రస్తుతం : వరంగల్ అర్బన్ జిల్లా)
నివాసం : ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు గ్రామం (ప్రస్తుతం : మంచిర్యాల జిల్లా)
రచనలు : పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ (వచన కవితా సంపుటి) రైతుబిడ్డ (బుజ్జ కథల సంపుటి)
బిరుదులు : అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవిచక్రవర్తి,
పురస్కారాలు : : పోతన చరిత్రమునకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వారి విద్యావాచస్పతి (డిలిట్) అవార్డు
పక్రీయ : కావ్యం – కావ్యం అనగా వర్ణనతో కూడినది అని అర్థం.
పాఠ్యాంశ విశేషాలు:
పోతన అన్న పేరు – తిప్పన
తిప్పనకు పంచప్రాణాల వంటివాడు – పోతన
‘పైనీగ వ్రాలనీడు’ అను జాతీయానికర్థం – చిన్న ఆపాయం కూడా దరిచేరనివ్వడు
తిప్పన పద్యం చదివితే దానిని విని పుస్తకం విప్పకుండానే దానిని అప్పజెప్పే ఏక సంతాగ్రాహి – పోతన
పోతనకు హరికథలు వినాలనే కోరిక ఉండేది.
చదువుల్లో పోతనకు పోతనే సాటి అనే వాక్యంలోని అలంకారం -ఉపమేయోపమాలంకారం
పోతనకు ఎదిగే వయస్సులో వేటి పై ఆసక్తి పెరిగింది – సాధు సజ్జనుల దర్శనం, హరికథా పురాణాలు వినడం, శివుని పూజించడములయందు.
తిప్పన చదివెడు పద్యముఁ
జప్పున సౌకసారి వినిన సరి పోతన తా
విప్పక పొత్తము నొప్పం
జెప్పును నద్దాని నేమి చెప్పుట తెలివిన్
ఆటల మేటి విద్యల యందున వానికి పొందే సాటి కొ
ట్లాటను బాలు రంద బొకటైన నెదిర్చెడి ధాటి, తీయగా
బాటలు పాడుటందుఁ బికవాణికి వానికిఁ బోటి యెందు మో
మోటముఁ గొంకు జంకులను బొత్తుగ వీడి చరించు నాతఁడున్.
సాధుసజ్జన దర్శనోత్సాహ గతియు
హరికథాపురాణ శ్రవణాభిరతియు
శంభుపద సరోజార్చ నాసక్త మరియు
బెరుగసాగే వేటొక ప్రక్క బిడ్డ యెడద,
అర్ధాలు :
పికవాణి – కోకిల
భాషా భాగాలు :
నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం – (ఎర్రని)
నామవాచడానికి బదులుగా వాడేది సర్వనామం – (ఆమె)
పనిని తెలిపే మాట క్రియ – (చదివింది)
లింగవచన భక్తులు లేనిది. అవ్యయం – (కాని)
పేరును తెలిపే పదం నామవాచకం – (హైదరాబాదు)
ప్రకృతి – వికృతులు :
భోజనం – బోనం
నిద్ర – నిదుర
పుస్తకం – పొత్తం
పర్యాయపదాలు :
పురం : పట్టణం , నగరం
ధరణి = పుడమి, అవని
కోతి = కపి, వానరము
గుడి = కోవెల, దేవాలయం
తమ్ముడు = అనుజుడు , అవరజుడు,అను జన్ముడు
సంధులు:
చిన్న పెద్దలందరికి = చిన్న పెద్దలు + అందరికి – ఉత్వ సంధి
తనకెవ్వరేదేని = తనకు + ఎవ్వరు + ఏదేని – ఉత్వసంధి
వెదకుంగన్పడుదాఁక = వెదకున్ + కన్పడుదాఁక – సరళాదేశ సంధి
బాలురందఱొకటైన = బాలురందరు + ఒకటైన – ఉత్వ సంధి
విస్మయమంద = విస్మయము + అంద – ఉత్వ సంధి
దర్శనోత్సాహం = దర్శన + ఉత్సాహం – గుణసంధి
శ్రవణాభిరతి = శ్రవణ + అభిరతి – సవర్ణదీర్ఘ సంధి
సమాసాలు:
రామలక్ష్మణులు – రాముడును, లక్ష్మణుడును – ద్వంద్వ సమాసం
గొంకు జంకులు – గొంకును, జంకును – ద్వంద్వ సమాసం
ఆటలమేటి – ఆటలలో మేటి – షష్టీతత్పురుష సమాసం
చిఱుతందసాధ్యుండు – అసాధ్యుడైన చిరుతడు – విశేషణ ఉత్తరపదకర్మధారయ సమాసం
0 Comments