. AP 6TH CLASS TELUGU 2021 Part - 1 Best Notes

Ticker

6/recent/ticker-posts

AP 6TH CLASS TELUGU 2021 Part - 1 Best Notes

AP 6TH CLASS TELUGU 2021 Part – 1 Best Notes

 

1. అమ్మ ఒడి

AP 6TH CLASS TELUGU 2021 Part - 1 Best Notes

కవి బి.వి నరసింహారావు

బాడిగ వెంకట నరసింహారావు కవి  (15.8.1913 – 6.1.1994)

కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు.

AP 6TH CLASS TELUGU 2021

‘బాలరసాలు’, ‘పాలబడి పాటలు, “ఆవు-హరిశ్చంద్ర’, ‘బాల తనం’, ‘చిన్నారి లోకం’, ‘పూలబాలలు ఋతువాణి’ వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు.

‘బాలబంధు’గా ప్రసిద్ధులు,

బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బి.వి.నరసింహారావుపెట్టుకున్నారు.

వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన ‘అనార్కలి’ నాటకంలో అనార్కలి పాత్ర ధరించి, ‘అనార్కలి నరసింహారావు గా ఖ్యాతి గడించారు.

ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బి.వి. నరసింహారావు సంపూర్ణ రచనలు రెండవ సంకలనం లోనిది

 

2. తృప్తి

AP 6TH CLASS TELUGU 2021 Part - 1 Best Notes

కవి : సత్యం శంకరమంచి (3.3.1937 – 21.5.1987)

గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు.

 ‘అమరావతి కథలు’, ‘కార్తీక దీపాలు’ కథా సంపుటాలు, ‘రేపటి దారి’, ‘సీత స్వగతాలు’, ‘ఆఖరి ప్రేమలేఖ’, ‘ఎడారిలో కలువపూలు’ మొదలైన నవలలు, హరహర మహాదేవ నాటకం, దిన, వార పత్రికలలో అనేక వ్యాసాలు రాశారు.

1979లో “అమరావతి కథల’కు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.

ఈ పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలు లోనిది.

AP 6TH CLASS TELUGU 2021

పాత్ర పూర్ణయ్య బావగాడు

“లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోంది”

“సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం? రెండు ఆకులు కలిపి వేయించు”    – పూర్ణయ్య

 

అక్షరాలు

వజ్రమువ్ + ఆ+జ్ ర్ +  +మ్ + 

కార్యము క్ +  + ర్ + య్ అ మ్ + 

 

AP 6TH CLASS TELUGU 2021

కుచెలోపాఖ్యానం

కుచేలుడు శ్రీ కృష్ణదగ్గరకి తీస్కొని వెళ్ళింది – అటుకులు

 

 

3. మాకోధ్ధితెల్లదొర తనము

AP 6TH CLASS TELUGU 2021 Part - 1 Best Notes

కవి గరిమెళ్ళ సత్యనారాయణ

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధులు, 1921లో ‘స్వరాజ్య గీతములు’, 1923లో హరిజనుల పాటలు’, 1926లో ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు రాశారు.

‘దండాలు దండాలు భారతమాత’, ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అనే గేయాలతో సామాన్య ప్రజల్లో

సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి.

దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ల,

AP 6TH CLASS TELUGU 2021

వర్ణమాల

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఇ, (లు, లు)  ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ = (16) అచ్చులు.

క, ఖ, గ, ఘ, జ, చ, చ, ఛ, జ, జ, ఝ,ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప,

ఫ, బ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ = (37) హల్లులు.

0 (సున్న), c (అరసున్న), A (విసర్గ) = (3) ఉభయాక్షరాలు

AP 6TH CLASS TELUGU 2021

అచ్చులు – విభాగం

ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు – అ, ఇ, ఉ, ఋ, (లు), ఎ, ఒ – హ్రస్వాలు.

రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు – ఆ, ఈ, ఊ, ఋ,(లూ), ఏ, ఐ, ఓ, – దీర్ఘాలు.

AP 6TH CLASS TELUGU 2021

హల్లులు – విభాగం

‘క’ నుండి ‘మ’ వరకు గల అక్షరాలను అయిదు వర్గాలుగా విభజించవచ్చు

క -ఖ – గ – ఘ – జ్ఞ.         – ‘క’ వర్గం

చ – ఛ – జ – ఝ – ఇ‌‌‍్.   – చ వర్గం

ట – ఠ- డ-ఢ-ణ.             – ట వర్గం

త – థ – ద – ధ – న        – త వర్గం

ప – ఫ – బ – భ – మ.     – ప వర్గం

AP 6TH CLASS TELUGU 2021

కఠినంగా పలికే అక్షరాలు – క, చ, ట, త, ప – పరుషాలు

తేలికగా పలికే అక్షరాలు – గ, జ, డ, ద, బ – సరళాలు

వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు ఖ,ఘ  ఛ ఝ ఠ, ఢ, ధ, ఫ, భ‌    – వర్గయుక్కులు,

ముక్కు సాయంతో పలికే అక్షరాలు –   జ్ఞ ఇ్ ణ, న, మ – అనునాసికాలు.

అంగిలి సాయంతో పలికే అక్షరాలు య, ర, ఱ్ఱ, ల, ళ, వ – అంతస్థాలు,

గాలిని బయటికి ఊదుతూ, అక్షరాలు – శ, ష, స, హ – ఊష్మాలు.

పరుష, సరళాలు కాకు మిగిలిన హల్లులు – స్థిరాలు,

‘క’ నుండి ‘మ’ గల హల్లులు – స్పర్శాలు.

 

AP 6TH CLASS TELUGU 2021

వర్ణోత్పత్తి

కంఠం నుండి పుట్టే అక్షరాలు – అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ, : – – కంఠ్యాలు.

తాలువు (దౌడ) భాగంలో పుట్టే అక్షరాలు – ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, ఇ్, య, శ –   తాలవ్యాలు.

నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు – ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ ర, ష – మూర్ధన్యాలు.

దంతాల సాయంతో పలికే అక్షరాలు – (చ, జ), త, థ, ద, ధ, న, ల, స – దంత్యాలు.

పెదవి సాయంతో పలికే అక్షరాలు – ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ – – ఓష్ట్యాలు.

ఎ, ఏ, ఐ – కంఠతాలవ్యాలు

ఒ, ఓ, ఔ – కంఠోష్ట్యాలు

వ- దంతోష్ణ్యం

 

 

4. సమయస్ఫూర్తి

AP 6TH CLASS TELUGU 2021 Part - 1 Best Notes

రచయిత కందుకూరి వీరేశలింగం

రాజమండ్రిలో జన్మించారు.

రాజశేఖర చరిత్రము’, ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’, ‘హాస్య సంజీవని’, ‘సతీహిత బోధిని’, ‘ఆంధ్రకవుల చరిత్ర’, మొదలైనవి వీరి రచనలు.

వీరు సంఘసంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, ‘గద్య తిక్కన ఆయన బిరుదు.

ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోని కథ,

పాత్రలు రోమశుడు అనే పిల్లి,పలితుడు అనే ఎలుక చంద్రకుడు అనే గుడ్లగూబ ,

AP 6TH CLASS TELUGU 2021

“మిత్రమా! నమస్కారం జాతి వైరమున్నా శత్రు మిత్రులము. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాము ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది. కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం.”   – పలీతుడు

 “తెలియనిదాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చేకన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరమూ స్నేహంగా ఉందామని, కాదంటే నీకాహారం అయిపోదామని తెగించి వచ్చాను. ప్రాణభీతితో కకాదు ప్రాణ స్నేహం కోసంతహతహలాడుతూ…”.    పలీతుడు

 

“మిత్రమా! జీవితం చివరిదశలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవుత్యాగబుద్ధి తో నన్ను రక్షించదలచావు, నీకు కృతజ్ఞతలు. ”.    – రోమషుడు

 

 “నిజానికి జాతి లక్షణం కాదనలేని వైరలక్షణం. బయటకు వచ్చాననుకో నాకు ప్రాణగండం తప్పదని తెలుసు”పలితుడు.

 

 “మిత్రమా! పలితుడా!! రాతుడు కాలయమునిలా వస్తున్నాడు. నన్ను తొందరగా రక్షించు”.   -.  రోమశుడూ

AP 6TH CLASS TELUGU 2021

పకృతి – వికృతి

ఆహారం – ఓగీరం

ధర్మము – ధమ్మం

ప్రాణం. – పానం

కథ – కత

సంతోషం – సంతసం

 

సంధులు

1.వాడెక్కడ. = వాడు + ఎక్కడ

మనమందరం = మనము + అందరం

ఎవరిక్కడ = ఎవరు + ఇక్కడ

వారందరూ = వారు + అందరూ

మహనీయులెందరో = మహనీయులు + ఎందరో

AP 6TH CLASS TELUGU 2021

ముసలివాళ్లు + అందరు = ముసలివాళ్ళందరు

ఇల్లు + ఉంది. = ఇల్లుంది

ప్రజలు + అందరూ = ప్రజలందరూ

డోక్కలు + ఎండిపోయిన = డోక్కలెండిన

ముసలివారు + అంటే = ముసలివారంటే

 

 

6. సుభాషితాలు

AP 6TH CLASS TELUGU 2021 Part - 1 Best Notes

కవి పరిచయం :

నార్ల చిరంజీవి – తెలుగుపూలు శతకం – 20శతాబ్దం

కరుణశ్రీ – తెలుగుబాల శతకం – 20శతాబ్దం

పక్కి అప్పల నరసింహం – కుమారా, కుమారీ శతకాలు – 17శతాబ్దం

పోతులూరి వీరబ్రహ్మం – కాళికాంబా సప్తశతి – 17శతాబ్దం

మారద వెంకయ్య – భాస్కర శతకం – 16శతాబ్దం

కంచర్ల గోపన్న – దాశరథీ శతకం – 17శతాబ్దం

AP 6TH CLASS TELUGU 2021

శతకం:

శతకం అంటే సూరు పద్యాల రచన. శతక పద్యాల చివర ‘మకుటం’ ఉంటుంది. ఇందులో పద్యాలు ‘ముక్తకాలు’గా ఉంటాయి. అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రభావం కలిగి ఉంటుంది. మకుటం ఉండటం వలన శతకకవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది.

ప్రకృతి – వికృతి

శ్రీ – సిరి

రోషం – రోసం

దీపం – దివ్వె

నానార్ధలు

హరి కోతి,సూర్యుడు,చంద్రుడు,సింహం

సంధులు

మాయమ్మ = మా + య్ + అమ్మ

మీయిల్లు.  = మీ + య్  + ఇల్లు

మేనయత్త = మేన + య్ + అత్త

ఉన్నయూరు = ఉన్న + య్ + ఊరు

సరియైన = సరి + య్  + ఐన

నాదియన్న = నాది + య్ + ఉన్న

పై పదాల మధ్య ‘య్’ అదనంగా వచ్చి చేరింది. అలా చేరడాన్ని ‘యడాగమం’ అంటారు. 

AP 6TH CLASS TELUGU 2021

ఏమంటివి – ఏమి + అంటివి (మ్ + ఇ +అ) సంధి జరిగితే,

ఏమియంటివి = ఏమి + య్ + అంటివి (య్ + అ) సంధి జరగకపోతే,

 ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు. జరగవచ్చు. జరగకపోవచ్చు. వ్యాకరణం పరిస్థితిని ‘వైకల్పికం’ అంటారు.

నాదన్న = నాది + ఉన్న

నాదియన్న = నాది + ఉన్న

అదొకటి = అది + ఒకటి

అదియొకటి = అది + ఒకటి

లేకున్న = లేక + ఉన్న

మణి + ఏమి = మణియేమి

ఇది + అంత = ఇదంతా

రానిది + అని = రానిదని

అది + ఎట్లు = అదెట్లు

కాలమూరక = కాలము + ఊరక

దీపమున్న = దీపము + ఉన్న

నేరములెన్నడు = నరములు + ఎన్నడు

AP 6TH CLASS TELUGU 2021

సమాసాలు

సమాసం: అర్థవంతమైన రెండు పదాలు కలిసి, ఒకే పదంగా ఏర్పడటాన్నే సమాసం అంటారు.

సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తరపదమని అంటారు.

ఉదా : సరస్వతీమందిరం – సరస్వతి యొక్క మందిరం

సరస్వతి పూర్వపదం, మందిరం ఉత్తరపదం ఇలా సమాసాలు ఏర్పడతాయి.

 

ద్వంద్వసమాసం : సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది

ద్వంద్వసమాసం.

ఉదా: సూర్యచంద్రులు : సూర్యుడును, చంద్రుడును

తల్లిదండ్రులు : తల్లియు, తండ్రియు

రామలక్ష్మణులు : రాముడును, లక్ష్మణుడును

“ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు” అని సూత్రం

 AP 6TH CLASS TELUGU 2021

For more

My Class Notes

TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము

 TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి

అలంకారాలు Usefull for TS AND AP Best Notes

TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన

TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం

My Vijetha

Telugu e Tutor

 

 

Post a Comment

0 Comments