Ticker

6/recent/ticker-posts

AP DSC Quick Review | Class 4 Telugu

 

4వ తరగతి – తెలుగు తోట

1. గాంధీ మహాత్ముడు

కవి పరిచయం:

బసవరాజు అప్పారావు (13.12.18914 – 10.06.1933)

భావకవి, గీత కర్త

బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి

పదాలు – అర్ధాలు:

స్వరాజ్యం = సొంత పాలన

ప్రణవం = ఓంకారం

మోక్షం = విడుపు, విముక్తి

అధర్మం = అన్యాయం

కంపించుట = వణుకుట

స్వస్తి = శుభం

తేనెల తేటల మాటలతో

కవి పరిచయం:

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (29.05.1944 – 25.07.2019)

కవి, కధకులు, విమర్శకులు,లలిత గీత కర్త. ఆకాశవాణిలో పని చేశారు 

తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి.

కవితా సంపుటి – అనుభూతి గీతాలు

తెలివైన దుప్పి – జాతక కధ

 

2. గోపాల్ తెలివి

పదాలు – అర్ధాలు:

దర్బారు = రాజసభ

విదూషకుడు = హాస్యగాడు

సామంతులు = రాజు కింద రాజులు

చూడగంటి

కవి పరిచయం:

తాళ్ళపాక అన్నమయ్య (09.05.1408 – 23.02.1503)

పదకవితా పితామహులు. 32 వేల సంకీర్తనలు రాశారని ప్రతీతి

వేంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతి ని నిర్మించారు

తేట తెలుగు పలుకుబడి, దేశి పదసంపద, వాడుక భాషలో అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో ఉంటాయి

విందు

కవి పరిచయం:

సోదుం రామ్మోహన్ (02.03.1939 – 12.11.2008)

పత్రికా రచయిత, పలు రచనలు అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం చేశారు.

రెండు దశాబ్దాలు విశాలాంద్ర లో ఒక దశాబ్దం పాటు ఉదయం పత్రికలో పని చేశారు

 

3. దేశమును ప్రేమించుమన్నా..

కవి పరిచయం:

గురజాడ వెంకట అప్పారావు (21.09.1862 – 30.11.1915)

ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు

యుగకర్త, కవి, కధకులు, నాటక కర్త, చరిత్రకారులు, శాసన పరిశోదకులు, భాషావేత్త

తెలుగు సాహిత్యంలో వాడుక భాష ప్రవేశపెట్టి చిరస్మరణీయ రచనలు చేశారు

కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన

పదాలు – అర్ధాలు:

ఒట్టి = ఏమి లేని

కద్దు = కలదు, ఉన్నది

దేశాభిమానం = దేశం మీద ప్రేమ

తోడుపడు = సహాయపడు

చెట్టా పట్టాలు = ఒకరి చేయి మరొకరు పట్టుకోవడం

భాషాంశాలు:

ప్రశ్నార్ధక గుర్తు (?) గల వాక్యాలను ప్రశ్నార్ధక వాక్యాలు అంటారు

తెలుగు తల్లి

కవి పరిచయం:

పిల్లలమర్రి వెంకట హనుమంతరావు (07.05.1921 – 13.09.1989)

విమర్శకుడు, కవి

సాహిత్య వ్యాసాలు, కధలు, ఏకాంకికలు, ఖండ కావ్యాలు రచించారు

ముఖ్య రచనలు – సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు

కందిరీగ కిటుకు

కవి పరిచయం:

రావూరి భరద్వాజ (05.07.1927 – 18.10.2013)

జననం – గుంటూరు జిల్లా తాడికొండ

ఈయన రాసిన తొలికధ – విమల

అపరిచితులు, కధాసాగరం వంటి 37 కధాసంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కధలు, జల ప్రళయం, కరి మింగిన వెలగపండు వంటి 17 నవలలు రాశారు

అవార్డులు – జ్ఞానపీఠ్, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ, సోవియట్ భూమి నెహ్రూ పురష్కారం, రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డ్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురష్కారం, కళారత్న (ఆ. ప్ర.), లోక్ నాయక్ ఫౌండేషన్ పురష్కారం

 

4. పరివర్తన

కవి పరిచయం: వెంకట పార్వతీశ కవులు

బాలాంత్రపు వెంకట రావు (1882 – 1955)

తల్లిదండ్రులు – సూరమ్మ, వెంకట నరసింహం

జన్మ స్థలం – మళ్ళాము, తూ. గో. జిల్లా

ఓలేటి పార్వతీశం (1880 – 1970)

తల్లిదండ్రులు – వెంకమ్మ, అచ్యుత రామయ్య

జన్మ స్థలం – పిఠాపురం, తూ. గో. జిల్లా 

పదాలు – అర్ధాలు:

పరివర్తన = మార్పు

చిందర వందర = క్రమం లేకపోవుట

ఆహ్లాదంగా = సంతోషంగా

ఆసక్తి = ఇష్టంగా

ఆత్మీయంగా = ప్రేమగా

చిన్నబుచ్చుకొను = నిరాశపడు 

పడవ నడపవోయి

కవి పరిచయం:

వింజమూరి శివరామారావు (1908 – 1982)

జన్మ స్థలం - తూ. గో. జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం

రచనలు – గోర్కీ కధలు, కల్పవల్లి, ఖండకావ్య సంపుటి

బిరుదు – కళాప్రపూర్ణ

ఉపాయం – ఇతిహాసం, మహాభారతం

 

5. సత్య మహిమ

కవి పరిచయం:

అవధాని రమేష్ (20వ శతాబ్దం)

ఆంధ్ర రాష్ట్రంలో కర్నూల్ జిల్లా అవుకు అగ్రహారంలో జన్మించారు

తల్లిదండ్రులు – సుబ్రమణ్య శాస్త్రి, సావిత్రమ్మ

రచనలు – కాసుల పేరు, ప్రతీకారం, మూడు మంచి కధలు

ఈ గేయకధ రమేష్ గారి రచన అయిన “గుజ్జెన గూళ్ళు” నుండి తీసుకోబడింది

పదాలు – అర్ధాలు:

మహిమ = గొప్పతనం

ఆకలంక = చెడుగుణం లేనట్టి

చరితుండు = చరిత్ర కలవాడు

సత్య వ్రతంబు = ఎల్లవేళలా నిజం చెప్పడం

నిత్యంబు = ఎల్లప్పుడూ

గతి = జీవితం నడిచే విధానం

తెన్నులు చూచి = ఎదురు చూసి  

మోము = ముఖం

తత్తరం = గాబర

ఆర్తి = దుఖం

కని = చూసి

దీనత = దారిద్ర్యం

కరుణ = దయ, జాలి

మిరుమిట్లు = మెరుగులు

తిలకించు = చూసి

మది = మనసు, బుద్ధి

మొగంబు = ముఖం

మిసిమి = నూతన కాంతి

బహుమానం = కానుక

వన్నె = అందం రంగు

చెన్ను = అందం

భాషాంశాలు:

పనుల గురించి తెలిపే పదాలు – క్రియా పదాలు

కన్నడ గేయం – ఎస్.సి.ఈ.ఆర్.టి పాఠ్య పుస్తకం

ఏ కాలుది నేరం? – మర్యాద రామన్న కధలు

 

 

6. ముగ్గులలో సంక్రాంతి

పదాలు – అర్ధాలు:

పద్మం = తామరపువ్వు

విశిష్టత = గొప్పతనం

సంబరం = సంతోషం

ధనస్సు = విల్లు

రాశి = నక్షత్ర గుంపు

కలశం = చిన్న కుండ, చెంబు

గొబ్బిళ్ళు = ముగ్గుపై అలంకరించిన  ఆవుపేడ ముద్దలు

ఆయనం = గమనం 

భాషాంశాలు:

నామవాచకం యొక్క గుణాలను తెలిపే పదాలు “విశేషణాలు”

విశేషణం నామవాచకం ముందు వస్తుంది

గొబ్బిళ్ళ పాట – సంప్రదాయ జానపద గేయాలు

నకిలీ కన్ను – నసీరుద్దీన్ కధలు

 

7. పద్య రత్నాలు

1. ధనము కూడబెట్టి దానంబు సేయక -------------------- వినుర వేమ!                            (వేమన)                                     

అర్ధాలు:

లెస్స = మిక్కిలి / ఎక్కువగా

తెరువరి = బాటసారి

 

2. పుత్రోత్సాహం తండ్రికి --------------------- సుమతీ!                                                       (బద్దెన)

అర్ధాలు:

పుత్రోత్సాహం = కొడుకు పుట్టిన సంతోషం

జన్మించినపుడు = పుట్టినప్పుడు

కనుగొని = గుర్తించి  

పొందురు = పొందుతారు

జనులు = ప్రజలు

3. పరులకొరకె నదులు ప్రవహించు, గోవుల -------------------- తెలుగు బాల!        (జంధ్యాల పాపయ్య శాస్త్రి)

అర్ధాలు:

పరులు = ఇతరులు

గోవులు = ఆవులు

పరహితము = ఇతరులకు మేలు

పరమార్ధం = నిజమైన ప్రయోజనం

 

4. బలవంతుడ నాకేమని --------------- సుమతీ!                                                                   (బద్దెన)

అర్ధాలు:

బలవంతుడు = బలం కలవాడు

పలువురు = చాలా మంది

సర్పం = పాము

నిగ్రహించు = ఎదిరించి

పలుకుట = మాట్లాడడం

5. మొదలు చూచిన కడుగొప్ప పిదప కురుచ -------------------- కుజన సజ్జనుల మైత్రి     (ఏనుగు లక్ష్మణ కవి)

అర్ధాలు:

కురచ = పొట్టి

ఆది = మొదలు

తనరు = వర్ధిల్లు 

దినపూర్వ = ఉదయకాల

ఛాయ = నీడ

కుజన = చెడ్డవారి

సజ్జనుల = మంచివారి

మైత్రి = స్నేహం

6. ఎంత చెలిమి యున్న ఎగతాళి చేయకు ---------------------- తెలుగు బిడ్డ!                                 (నార్ల చిరంజీవి)

అర్ధాలు:

చెలిమి = స్నేహం

ఎగతాళి = వెటకారం

వేళాకోళం = సరసం

విరసం = అయిష్టం

7. మతము లెన్ని యున్న మానవత్వమొక్కటే -------------------- నార్లవారిమాట!       (నార్ల వేంకటేశ్వర రావు)

అర్ధాలు:

మానవత్వం = మనిషికి ఉండే సహజగుణం  

పరమార్ధం = గొప్పదైన అర్ధం

 

8. బ్రతుకవచ్చు గాక బహుబంధనము లైన ---------------------- మానధనులు!                              (పోతన)

అర్ధాలు:

బంధనములు = కట్లు

లేమి = పేదరికం

మానధనులు = మానమే ధనంగా కలవారు(పరువు కలవారు)

జీవధనం = ప్రాణం 

9. పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు -------------------- వినురవేమ!                                            (వేమన)

అర్ధాలు:

బుద్ధి = ఆలోచన

ప్రధానం = ముఖ్యం

దృడం = గట్టిది

భాషాంశాలు:

జరిగిపోయిన పని తెలిపేది – భూత కాలం

జరుగుతున్న పని తెలిపేది – వర్తమాన కాలం

జరగబోయే పని తెలిపేది – భవిష్యత్ కాలం

వీరగంధం

కవి పరిచయం:

త్రిపురనేని రామస్వామి (15.01.1887 – 16.01.1943)

హేతువాద రచయిత. ఈయన “కవిరాజు” అనే బిరుదు పొందారు

రచనలు – సూత పురాణం, పల్నాటి పౌరుషం

పేను – నల్లి – నీతి చంద్రిక

 

8. బారిష్టర్ పార్వతీశం

కవి పరిచయం:

మొక్కపాటి నరసింహ శాస్త్రి (09.10.1892 – 05.03.1973)

ఈయన ప. గో. జిల్లా నరసాపురంలో జన్మించారు

బారిష్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల

రచనలు – మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య

పదాలు – అర్ధాలు:

కాపుర స్థలం = నివాసం

ఐదవ ఫారం = పదవ తరగతి

హితోపదేశం = మేలు చేసే మాట

బారిస్టర్ = ఇంగ్లాండ్ లో న్యాయశాస్త్రం  చదివేవాడు

సామాగ్రి = సామాన్లు, వస్తువులు

దంతధావనం = పళ్ళు తోమడం

కచ్చికలు = కాల్చిన పిడకలు

అంగవస్త్రం = తువ్వాలు

చాదు = పిండితో చేసిన బొట్టు

దేశవాళీ దువ్వెన = చెక్క దువ్వెన

గార్డు = కాపలా వ్యక్తి

ప్రాధేయపడి = బతిమాలి

చెన్నపట్నం = మద్రాస్

దొర = తెల్లజాతి పురుషుడు

దొరసాని = తెల్లజాతి స్త్రీ

బస = తాత్కాలిక నివాసము

బంట్రోతు = సేవకుడు

స్టీమరు = ఆవిరితో నడిచే పెద్ద నావ

అంతరిక్ష మార్గం = ఆకాశం వైపు 

భాషాంశాలు:

వాక్యం పూర్తి అయితే సమాపక క్రియ అంటారు

వాక్యం పూర్తి కాకపోతే అసమాపక క్రియ అంటారు

ఏరువాక పాట

కవి పరిచయం:

బిరుదురాజు రామరాజు (16.04.1925 – 08.02.2010)

జననం – వరంగల్ దగ్గర దేవనూరు గ్రామం

తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటగా పరిశోదన చేశారు

రచనలు – జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు

అత్యాశ – పంచతంత్రం కధ

 

9. రాజు – కవి

కవి పరిచయం:

గుర్రం జాషువా (28.09.1895 – 24.07.1971)

జననం – గుంటూరు జిల్లా వినుకొండ

కవిత్వ లక్షణాలు – ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార, అట్టడుగు వర్గాల పట్ల ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం

బిరుదులు – నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ

రచనలు – ఫిరదౌసి, గబ్బిలం, క్రీస్తు చరిత్ర

పదాలు – అర్ధాలు:

సౌధం = భవనం

జన్మించడం = పుట్టడం

ప్రబలడం = ఎక్కువ కావటం

సుకవి = మంచి కవి

శతం = నూరు, వంద

రాజదండం = రాజశాసనం

ధనమయం = ధనంతో నిండినది

రుచిమయం = కాంతితో నిండినది

గండవితతిమయం = రాళ్ళతో నిండినది

ప్రస్తుతింతురు = పొగుడుతారు

సుధ = అమృతం 

ఆత్మగౌరవకాములు = తమ గౌరవం కోరుకునేవారు

ఇహం = ఈ లోకం

పరం = పరలోకం

గగనం = ఆకాశం

తార = నక్షత్రం 

 

 

పర్యాయ పదాలు:

ఇల్లు =

ధనం =

కత్తి =

ప్రపంచం =

తార =

వెయ్యేళ్ళ కవినోయ్

కవి పరిచయం:

అడవి బాపిరాజు (08.10.1895 – 22.09.1952)

కవి, నవలాకారుడు, కధకుడు, చిత్రకారుడు

రచనలు – నారాయణరావు, హిమబిందు, గోనగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు

 

     

        

 

Post a Comment

0 Comments