I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. ‘జన’ అని సంస్కృతంలో వీనినంటారు.
A) తెగలను
B) గ్రామాలను
C) రాజ్యా లను
D) పట్టణాలను
జవాబు:
A) తెగలను
2. కోసల ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలదు.
A) బెంగాల్
B) బీహార్
C) అవధ్
D) మహారాష్ట్ర
జవాబు:
C) అవధ్
3. ప్రస్తుత పాట్నా, గయలో కొన్ని జిల్లాలు ఈ మహాజనపదంలో ఉండేవి.
A) కోసల
B) పాంచాల
C)కురు
D) మగధ
జవాబు:
D) మగధ
4. వజ్జి ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలదు.
A) కాశీ
B) జనక్ పూర్
C) కుశినగర్
D) పావాపురి
జవాబు:
B) జనక్ పూర్
5. వత్స ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలదు.
A) గయ
B) కేదార్నాథ్
C) అలహాబాద్
D) గండక్
జవాబు:
C) అలహాబాద్
6. గృహపతి/ గహపతి అని వీరిని పిలిచేవారు.
A) కుటుంబ పెద్దని
B) గ్రామ పెద్దని
C) రాజును
D) భూ యజమానిని
జవాబు:
D) భూ యజమానిని
7. గాంధార శిల్పకళ ఈ మతానికి చెందినది.
A) హిందూ
B) జైన
C) బౌద్ధ
D) సిక్కు
జవాబు:
C) బౌద్ధ
8. వజ్జి – గణరాజ్యంలో వీరికి సమావేశంలో పాల్గొనే, అవకాశం ఉండేది కాదు.
A) మహిళలకు
B) బానిసలకు
C) సేవకులకు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
9. అలెగ్జాండర్ ఈ దేశానికి రాజు.
A) రోమ్
B) గ్రీకు
C) మగధ
D) ఈజిప్ట్
జవాబు:
B) గ్రీకు
10. ‘పెయింటెడ్ గ్రేవేర్’ అంటే మహాజనపదాల నాటి ఈ వస్తువులు.
A) మట్టి కుండలు
B) ఇనుప నాగళ్ళు
C) చెక్కబండ్లు
D) వెదురు కర్రలు
జవాబు:
A) మట్టి కుండలు
11. చివరకు గణ రాజ్యాలను జయించిన రాజ వంశం.
A) మౌర్యులు
B) గుప్తులు
C) శాతవాహనులు
D) పల్లవులు
జవాబు:
B) గుప్తులు
12. క్రింది పటంలో ఇవ్వబడిన ఫలకం ఈ ప్రదేశంలో బయల్పడినది.
A) సారనాథ్
B) సాంచి
C) కార్లే
D) మొహంజొదారో
జవాబు:
B) సాంచి
13. ‘నాగటి కర్రులు’ను తయారుచేసే వారిని ………….. అంటారు.
A) కమ్మర్లు
B) కుమ్మర్లు
C) కంసాలులు
D) ఒడ్రంగులు
జవాబు:
A) కమ్మర్లు
14. ఇంటి పనివారిని ……………….. అని పిలుస్తారు.
A) సేవకులు
B) భర్తుకా
C) సహాయకులు
D) చెలికత్తెలు
జవాబు:
B) భర్తుకా
15. మహాజనపదాల రాజులను వీరితో పోల్చవచ్చు.
A) సర్పంచ్
B) సేనా నాయకుడు
C) పట్లా
D) పంచాయత్
జవాబు:
C) పట్లా
16. ప్రజలు ఆజ్ఞలు పాటించేలా చూడటానికి ………… ఉంటారు.
A) సైనికులు
B) అధికారులు
C) మంత్రులు
D) భటులు
జవాబు:
B) అధికారులు
17. పన్నుల వసూలు వీరి సంపద పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
A) అధికారుల
B) గ్రామపెద్దల
C) మంత్రుల
D) భటులు
జవాబు:
B) గ్రామపెద్దల
18. మహాపద్మనందుడు ఈ ప్రాంతపు రాజు ……….
A) మగధ
B) వజ్జి
C) అస్మక
D) కాంభోజ
జవాబు:
A) మగధ
19. ఉత్తర భారతదేశంలో విశాలమైన మైదాన ప్రాంతం
A) గంగా-సింధూ మైదాన ప్రాంతం
B) కృష్ణా, గోదావరి మైదాన ప్రాంతం
C) జీలం-సట్లెజ్ మైదానం
D) గద్దర్ మైదానం
జవాబు:
A) గంగా-సింధూ మైదాన ప్రాంతం
20. హిమాలయాలకు, ద్వీపకల్ప పీఠభూమికి మదం ప్రవహించే నదులు
A) కృష్ణా, గోదావరి
B) కావేరి, తుంగభద్ర
C) గంగా, యమున
D) మహానది
జవాబు:
C) గంగా, యమున
21. గంగా-సింధూ మైదానంలో స్థిరపడిన ప్రజలు ప్రారంభంలో
A) వ్యాపారం చేశారు
B) వ్యవసాయం చేశారు
C) పరిశ్రమలు స్థాపించారు
D) ఏవీకావు
జవాబు:
B) వ్యవసాయం చేశారు
22. ప్రారంభంలో వివిధ తెగలు స్థిరపడిన ప్రాంతాలే
A) గ్రామాలు
B) పట్టణాలు
C) నగరాలు
D) జనపదాలు
జవాబు:
D) జనపదాలు
23. ప్రజలు ఎన్ని సంవత్సరాల క్రితం నదుల వెంట స్థిరపడటం మొదలుపెట్టారు?
A) 2000
B) 2500
C) 2700
D) 3000
జవాబు:
C) 2700
24. లోహ పనిముట్లతో వ్యవసాయం చేసి పెద్ద పెద్ద గ్రామాలను ఏర్పాటు చేసి పట్టణాలుగా , రూపొందించారు. వీటిని ఈ విధంగా పిలిచారు.
A) మహా జనపదాలు
B) పెద్ద జనపదాలు
C) పై రెండూ
D) మహా నగరాలు
జవాబు:
C) పై రెండూ
25. మహాజనపదాలను గురించి తెలుసుకొనుటకు ప్రధాన ఆధారం
A) పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన త్రవ్వకాలు
B) ఆ కాలంలో వ్రాయబడిన పుస్తకాలు
C) పై రెండూ
D) విదేశీ దండయాత్రలు
జవాబు:
C) పై రెండూ
26. మహాజనపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతం కానిది
A) ఢిల్లీ
B) అత్రంజిఖేర
C) కౌశంబి
D) హైదరాబాద్
జవాబు:
D) హైదరాబాద్
27. మహాజనపదాల కాలానికి చెందని పుస్తకం
A) ఉపనిషత్తులు
B) ధర్మసూత్రాలు
C) స్వారోచిష మనుసంభవం
D) దిగానికాయ
జవాబు:
C) స్వారోచిష మనుసంభవం
28. మహాజనపదాల కాలం నాటి భూ యజమానులను ఈ విధంగా పిలిచేవారు.
A) గృహపతి
B) గహపతి
C) పై రెండూ
D) భూస్వామి
జవాబు:
C) పై రెండూ
29. యుద్ధాల్లో బందీలై రైతులకు అమ్మబడిన వారు
A) దాసులు
B) బానిసలు
C) పై వారిద్దరూ
D) భర్తుకాలు
జవాబు:
C) పై వారిద్దరూ
30. భర్తుకాలు అనగా
A) యుద్ధాల్లో ఓడినవారు
B) బందీ గావింపబడ్డవారు
C) కూలీ ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు
D) పై వారందరూ
జవాబు:
C) కూలీ ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు
31. గ్రామపెద్ద ప్రధాన విధి
A) పన్నులు వసూలు చేయుట
B) న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా వ్యవహరించుట
C) శాంతి భద్రతల నిర్వహణ
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
32. వ్యవసాయదారులకు ఉపయోగపడే ఇతర ప్రధాన వృత్తులు
A) కమ్మరి
B) కుమ్మరి
C) నేతపనివారు
D) పై వారందరూ
జవాబు:
D) పై వారందరూ
33. మహాజనపదాలలో ఉన్న ప్రధాన పనివారు
A) లోహకారులు, గణకులు, సైనికులు
B) తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు
C) ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు, బొమ్మలు తయారు
D) పై వారందరూ
జవాబు:
D) పై వారందరూ
34. మహాజనపదాలలో రాజ్యా నికి ప్రధాన ఆదాయ వనరు
A) పన్నులు
B) సైనికులు
C) వ్యాపారవేత్తలు
D) భూస్వాములు
జవాబు:
A) పన్నులు
35. రాజులు సిరి సంపదలతో, గొప్పగా ఉండటానికి చేసినది
A) పన్నులను పెంచుట
B) పొరుగు రాజ్యాలను జయించుట
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ
36. వ్యవసాయం చేసే రైతులు తమ పంటను ఆరు భాగాలు చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ఈ విధంగా పిలిచారు.
A) బలి
B) భాగ
C) కర
D) తుల
జవాబు:
B) భాగ
37. గ్రామపెద్ద అధికారం, సంపద పెరుగుదలకు దోహదం చేసిన అంశం
A) వ్యాపారాన్ని ప్రోత్సహించటం
B) పన్నులు పెంచటం
C) యుద్ధాలు చేయటం
D) ఏదీకాదు
జవాబు:
A) వ్యాపారాన్ని ప్రోత్సహించటం
38. మహాజనపదాలలో బలమైనది
A) కాశి
B) కోసల
C) మగధ
D) అంగ
జవాబు:
C) మగధ
39. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఖనిజ నిక్షేపాలు
A) బంగారం
B) ఇనుము
C) వజ్రాలు
D) రాగి చేసేవారు
జవాబు:
B) ఇనుము
40. మగధ రాజ్యాన్ని బలమైన రాజ్యంగా తీర్చిదిద్దినది
A) బింబిసారుడు
B) అజాత శత్రువు
C) మహా పద్మనందుడు
D) పై వారందరూ
జవాబు:
D) పై వారందరూ
41. ఇతనికాలంలో మగధ రాజ్యం వాయవ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించింది.
A) బింబిసారుడు
B) అజాతశత్రువు
C) మహాపద్మనందుడు
D) బిందుసారుడు
జవాబు:
C) మహాపద్మనందుడు
42. గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగియున్న మహాజనపదం
A) వట్టి
B) అంగ
C) వంగ
D) కౌశంబి
జవాబు:
A) వట్టి
43. గణాలకు చెందినవారు
A) బుద్ధుడు
B) మహావీరుడు
C) పై వారిద్దరూ
D) ఎవరూ కాదు
జవాబు:
C) పై వారిద్దరూ
44. గణరాజ్యాలు ఎన్ని సం||రాల పాటు మనగలిగాయి?
A) 1000
B) 1500
C) 2000
D) 2500
జవాబు:
B) 1500
II. ఖాళీలను పూరించుట
కింది ఖాళీలను పూరింపుము.
1. జనపద ప్రజలు ……….. లోహ ఉపకరణాలతో వ్యవసాయం చేసారు.
2. ……… యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది.
3. ‘గాంధార జనపదం ……….. నదీ తీరాన నెలకొంది.
4. యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడయినవారిని ………… అనేవారు.
5. మహా జనపదాల కాలంలో యజ్ఞాలు మరియు ………. లు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
6. ‘గణ’ అనే పదానికి …….. ఉన్న వారు అని అర్థం.
7. …….. అంటే రాజు లేదా రాణి పాలించే భాగం.
8. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో …… ఖనిజ నిక్షేపాలుండేవి.
9. గాంధార శిల్పకళ …….. చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది…
10. ప్రపంచ విజేతగా మారాలని కోరుకున్న మాసి డోనియా పాలకుడు ……………
11. అలెగ్జాండర్ భారతదేశ …….. నదీ తీరం వరకూ వచ్చా డు.
12. సిద్ధార్థుడు స్థాపించిన మతం ………..
మహావీరుడు స్థాపించిన మతం
14. గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం ………
15. దక్షిణా పథంలో నెలకొన్న జనపదం ………..
జవాబు:
- ఇనుప
- ఇనుము
- జీలం
- దాసులు/బానిసలు
- జంతుబలు
- సమాన హోదా
- రాజ్యం
- ఇనుప
- తక్షశిల
- అలెగ్జాండర్
- బియాస్
- బౌద్ధమతం
- జైనమతం
- అస్మక
- అస్మక
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group-B |
i) కోసల | a) రాజరికం |
ii) రాజు | b) పంటలో 6వ భాగం |
iii) మగధ | c) మహాజనపదం |
iv) భూయజమాని | d) గంగానది కిరువైపులా |
v) భాగ | e) గృహపతి |
జవాబు:
Group – A | Group-B |
i) కోసల | c) మహాజనపదం |
ii) రాజు | a) రాజరికం |
iii) మగధ | d) గంగానది కిరువైపులా |
iv) భూయజమాని | e) గృహపతి |
v) భాగ | b) పంటలో 6వ భాగం |
2.
Group-A | Group-B |
i) పెద్ద గ్రామాలు | a) దాసులు |
ii) మజ్జిమనికాయ | b) పనివారు |
iii) బానిస | c) మహాజనపదాలు |
iv) అత్రంజిఖేర | d) పురాతత్వ ప్రాంతం |
v) భర్తుకా | e) పుస్తకం |
జవాబు:
Group-A | Group-B |
i) పెద్ద గ్రామాలు | c) మహాజనపదాలు |
ii) మజ్జిమనికాయ | e) పుస్తకం |
iii) బానిస | a) దాసులు |
iv) అత్రంజిఖేర | d) పురాతత్వ ప్రాంతం |
v) భర్తుకా | b) పనివారు |
0 Comments