I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. 1920ల్లో ఈ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర రెండు వేల సం||రాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది.
A) హరప్పా
B) మొహంజోదారో
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
C) A & B
2. హరప్పా నాగరికత ఈ సం||రాల మధ్య వికసించింది.
A) క్రీ.పూ. 1700-2500
B) క్రీ.పూ. 2500-1700
C) క్రీ.పూ. 1700-2500
D) క్రీ.పూ. 2500-1700
జవాబు:
B) క్రీ.పూ. 2500-1700
3. హరప్పా నాగరికత పాకిస్థాన్లో ఈ ప్రాంతాలలో కూడా బయటపడింది.
A) పంజాబు
B) సింధూ
C) బెలూచిస్తాన్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
4. హరప్పా నగరంలో ఎన్ని పెద్ద ధాన్యాగారాలు కలవు.
A) 5
B) 6
C) 7
D) 8
జవాబు:
B) 6
5. హరప్పా నాగరికత నాటి అతిపెద్ద నౌకాశ్రయం ఈ ప్రాంతంలో కలదు.
A) మొహంజోదారో
B) హరప్పా
C) లోథాల్
D) కాలిబంగన్
జవాబు:
C) లోథాల్
6. హరప్పా ప్రజలు ఈ దేశాలతో వ్యాపారం చేశారు.
A) మెసపటోమియా
B) ఈజిప్టు
C) ఇరాన్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
7. సింధూ నాగరికత ప్రజల ఆరాధ్య దైవం.
A) అమ్మతల్లి
B) రాముడు
C) కృష్ణుడు
D) పైవన్నీ
జవాబు:
A) అమ్మతల్లి
8. ఈ ప్రాంతంలో అగ్ని పేటికలు అనగా యజ్ఞ వాటికలు ఉన్నాయి.
A) లోథాల్
B) కాలిబంగన్
C) A & B
D) మొహంజోదారో
జవాబు:
C) A & B
9. సింధూనాగరికత పతనానికి వీరి దండయాత్రలే కారణమనే సిద్ధాంతం కలదు.
A) ఆర్యుల
B) ద్రావిడుల
C) గ్రీకుల
D) రోమన్ల
జవాబు:
A) ఆర్యుల
10. ఆర్యుల జన్మ స్థానం
A) మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం
B) ఇండో యూరోపియన్ ప్రాంతం
C) భారతదేశం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
11. వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని ఇలా అంటారు.
A) వేదకాలం
B) తొలివేద కాలం
C) మలివేద కాలం
D) ఇతిహాసా కాలం
జవాబు:
A) వేదకాలం
12. ఈ వేదంలో సరస్వతి నది గురించి పలుసార్లు ప్రస్తావించడం జరిగింది.
A) యజుర్వేదం
B) ఋగ్వేదం
C) సామవేదం
D) అధర్వణవేదం
జవాబు:
B) ఋగ్వేదం
13. “వేద కాలానికే మరలా వెళ్ళాలి” (Back to vedas) అని పిలుపు నిచ్చినవారు?
A) స్వామి వివేకానంద
B) స్వామి దయానంద
C) స్వామి రామానంద
D) పైవన్నీ
జవాబు:
B) స్వామి దయానంద
14. భారతీయ సంగీతము యొక్క మూలాలు ఈ వేదంలో కలవు.
A) ఋగ్వేదం
B) యజుర్వేదం
C) సామవేదం
D) అధర్వణవేదం
జవాబు:
C) సామవేదం
15. వేద కాలం నాటి విద్యవంతులైన స్త్రీలు
A) ఘోష, అపాలా
B) లోపాముద్ర, ఇంద్రాణి
C) విష్వవర
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
16. ఆర్యుల తెగల నాయకుడిని ఇలా పిలుస్తారు.
A) సామ్రాట్
B) రాజాధిరాజ
C) రాజన్
D) చక్రవర్తి
జవాబు:
C) రాజన్
17. రాజుకు పరిపాలనా విషయంలో సలహాలు ఇచ్చేవి.
A) సభ
B) సమితి
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
C) A & B
18. ఆశ్రమ వ్యవస్థ ఈ కాలంలో ప్రారంభమైనది.
A) హరప్పా కాలం
B) తొలి వేదకాలం
C) మలి వేదకాలం
D) పైవన్నీ
జవాబు:
C) మలి వేదకాలం
19. ‘ఆది కావ్యం’ అని దీనిని పిలుస్తారు.
A) వేదంను
B) రామాయణం
C) మహాభారతం
D) ఉపనిషత్తులను
జవాబు:
B) రామాయణం
20. రామాయణాన్ని సంస్కృతంలో రచించినవారు
A) వేద వ్యాసుడు
B) వాల్మీకి
C) తులసీదాసు
D) నన్నయ్య
జవాబు:
B) వాల్మీకి
21. వీరి ‘లిపిని హోరియోగ్లిఫిక్’ లిపి అందురు.
A) మెసపటోమియన్ల
B) ఈజిప్షియన్ల
C) చైనీయులు
D) సింధూ ప్రజలు
జవాబు:
B) ఈజిప్షియన్ల
22. తొలి వేదకాలం నాటి గురించి సరియైన వాక్యం కానిది
A) ఎటువంటి వివక్షత లేదు
B) కులాంతర వివాహాలపై నిషేధం లేదు
C) సమాజంలో స్త్రీలకు గౌరవం కలదు
D) సతీసహగమనం ప్రారంభమైనది
జవాబు:
C) సమాజంలో స్త్రీలకు గౌరవం కలదు
II. ఖాళీలను పూరించుట
కింది ఖాళీలను పూరింపుము
1. …………… సం||రంలో సింధులోయ నాగరికత బయల్పడింది.
2. …………… లో గొప్ప స్నానవాటిక బయల్పడింది.
3. ……….. ని మొట్టమొదట పండించింది హరప్పా ప్రజలే.
4. అరేబియా సముద్రంలోని …….. నౌకాశ్రయం ద్వారా సింధూ ప్రజలు ఇతర దేశాలతో వ్యాపారం చేసేవారు.
5. సింధూ ప్రజల ప్రధాన వృత్తి …………..
6. సింధూ ప్రజలు శివుడుని …….. గా పూజించారు.
7. సింధూ ప్రజలు ………. గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు.
8. ……… ప్రజల లిపిని ఇంతవరకు అర్థం చేసుకోలేక పోయారు.
9. ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్ట మొదట ఉపయోగించింది ………
10. థార్ ఎడారిలో ఇంకిపోయిన నదినే …… నది అంటారు.
11. సంస్కృత భాషలో వేదమనగా …………
12. వేదాలను ……… అనికూడా అంటారు.
13. భారతీయ యోగాకు ………. లే ఆధారాలు.
14. విద్యావాదము, క్రతువులు, సంస్కరాల గురించి తెలియజేయునది ……….
15. తొలి వేద కాలము ………….
16. మలి వేద కాలము …………
17. వేద కాల సమాజానికి ……. ప్రాథమిక అంగం.
18. ……….. కుటుంబానికి పెద్ద.
19. వాసా అనగా …………
20. ఆదివాసా అనగా ………
21. వేదకాలంలో ……… రకాలైన సంగీత వాయిద్యాలను ఉపయోగించారు.
22. ……… వేద కాలంలో ఎటువంటి వివక్షత లేదు.
23. ……….. వేద కాలంలో సభ మరియు సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి.
24. భారతదేశ గొప్ప ఇతిహాసాలు …………..
25. అధర్మంపై ధర్మం సాధించిన విజయమే ………….. గా చెప్పబడినది.
26. ……….. కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి.
జవాబు:
- 1920
- మొహంజోదారో
- ప్రత్తి:
- లోథాల్
- వ్యవసాయం
- పశుపతి
- సింధూ
- హరప్పా
- సరస్వతి
- జానం
- శృతులు
- వేదా
- అరణ్యాకాలు
- క్రీ.పూ. 1500-1000
- క్రీ.పూ.1000-600
- కుటుంబం
- తండ్రి
- ధోవతి
- శరీరముపై భాగానికి కప్పుకునేది
- 30
- తొలి
- మలి
- రామాయణం, మహాభారతం
- మహా భారతం
- విద్య
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group-B |
తొలి నాగరికత | నది |
i)మెసపటోమియా | a) యూఫ్రటిస్ & టైగ్రిస్ |
ii) ఈజిప్టు | b) నైలు |
iii) హరప్పా | c) సింధూ |
iv) చైనా | d) హోయాంగ్ హో |
జవాబు:
Group – A | Group-B |
తొలి నాగరికత | నది |
i)మెసపటోమియా | a) యూఫ్రటిస్ & టైగ్రిస్ |
ii) ఈజిప్టు | b) నైలు |
iii) హరప్పా | c) సింధూ |
iv) చైనా | d) హోయాంగ్ హో |
2.
Group-A | Group-B |
i) సింధూ నాగరికత కాలం. | a) క్రీ.శ. 1920 |
ii) తొలి వేద కాలం | b) క్రీ.పూ. 1000-600 |
iii) మలి వేద కాలం | c) క్రీ.పూ. 1500-1000 |
iv) సింధూ త్రవ్వకాలు | d) క్రీ.పూ. 2500-1700 |
జవాబు:
Group-A | Group-B |
i) సింధూ నాగరికత కాలం. | d) క్రీ.పూ. 2500-1700 |
ii) తొలి వేద కాలం | c) క్రీ.పూ. 1500-1000 |
iii) మలి వేద కాలం | b) క్రీ.పూ. 1000-600 |
iv) సింధూ త్రవ్వకాలు | a) క్రీ.శ. 1920 |
3.
Group-A | Group- B |
i) భారతీయ సంగీతము యొక్క మూలాలు | a) సామవేదము |
ii) ఆత్మ, ప్రకృతి రహస్యాలు | b) ఉపనిషత్తులు |
iii) అధర్మంపై ధర్మం సాధించిన విజయం | |
iv) యజ్ఞ యాగాది క్రతువుల నియమాలు |
జవాబు:
Group-A | Group- B |
i) భారతీయ సంగీతము యొక్క మూలాలు | a) సామవేదము |
ii) ఆత్మ, ప్రకృతి రహస్యాలు | b) ఉపనిషత్తులు |
iii) అధర్మంపై ధర్మం సాధించిన విజయం | c) మహాభారతం |
iv) యజ్ఞ యాగాది క్రతువుల నియమాలు | d) యజుర్వేదము |
0 Comments