Ticker

6/recent/ticker-posts

APTET Special - Class 7 Science | Complet Notes - 1,2 Units

7వ తరగతి 

ఆహారంతో ఆరోగ్యం

  • మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకపదార్థాలు – పిండి పదార్ధాలు , మాంస కృత్తులు, కొవ్వులు, ఖనిజ లవణాలు ,విటమిన్‌ లు
  • మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలు అధిక మొత్తంలో అవసరం అవుతాయి .ఇలా అధికమొత్తంలో అవసరంయ్యే వాటిని స్ఫూల పోషకాలు అంటారు.
  • స్థూలల పోషకాలకు ఉదాహరణ — పెండి పదార్ధాలు , మాంస కృత్తులు ,కొవ్వులు .
  • ఆహారంలో కొన్ని పదార్ధాలు చాలా తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి .వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు .
  • సూక్ష్మ పోషకాలకు ఉదాహరణ — ఖనిజాలు , విటమిన్‌ లు
  • అంగన్‌ వాడీ కేంద్రాల నుండి పిల్లలకు అంద చేస్తున్న బాలామృతం పాకెట్‌ లో ఉన్న పోషక పదార్థాలు వివరాలు.

పిండి పదార్ధాలు 67 gms( 414 కికాలరీ )

మాంసకృత్తులు 11 gms

కొవ్వులు 11 gms 

ఐరన్‌ 9.1మిల్లీ gms

విటమిన్‌ A 202.5 మిల్లీ gms

కాల్షియం 367మిల్లీ gms

విటమిన్‌ B1 0.6 మిల్లీ gms

విటమిన్‌ B2 0.55 మిల్లీ gms

విటమిన్‌ C 15.3 మిల్లీ gms

ఫోలిక్‌ ఆమ్లం 22.1 మిల్లీ gms

నియాసిన్‌ 6.3 మిల్లీ gms

  • ఆటగాళ్లు ఆటలో అలసిపోయినప్పుడు తక్షణ శక్తి కోసం గ్లూకోజ్‌ తీసుకుంటారు .
  • గ్లూకోజ్‌ ఒక రకమైన పిండి పదార్థం .
  • మన శరీరానికి ప్రధాన శక్తి ఇచ్చే వనరులు — పిండి పదార్థాలు .
  • పిండి పదార్థాలను శక్తిని ఇచ్చే పోషకాలు అంటారు .
  • పెండి పదార్థాలు ఆహారంలో సాధారణంగా స్టార్చ్ మరియు చక్కెరల రూపంలో ఉంటాయి .
  • స్టార్చ్ ఉనికిని గుర్తించే పరీక్ష — అయోడిన్‌ పరీక్ష .
  • చక్కెర ఉనికిని గుర్తించే పరీక్ష – బెనెడిక్ట్‌ ద్రావణ పరీక్ష .
  • అయోడిన్‌ పరీక్షలో అయోడిన్‌ స్పటికాలను గోధుమ రంగులోకి వచ్చే వరకు నీటిలో కరిగించాలి
  • అయోడిన్‌ ద్రావణాన్ని బంగాళా దుంప ముక్కల పైన వేస్తే పెండి పదార్థం ఉన్న చోట నీలం – నలుపు రంగులోనికి మారుతుంది .
  • గుడ్డు సోనలో పిండి పదార్ధాలు ఉండవు .
  • పాలు ,గుడ్డు, పప్పు ధాన్యాలలో అధికంగా ఉండే పోషక పదార్థాలు – మాంస కృత్తులు .
  • మాంస కృత్తులు అనగా proteins
  • కండరాలు ,ఇతర శరీర అవయువాలు ఏర్పడడానికి మాంస కృత్తులు అవసరం .
  • శరీర నిర్మాణ పోషకాలు అని వేటిని అంటారు – మాంస కృత్తులు .
  • మాంసకృత్తులు జీవ రసాయన ప్రతిచర్యలను నియంత్రిస్తాయి .
  • శరీరంలోని గాయాలను బాగు చేసి నయం చేసేవి – మాంస కృత్తులు .
  • వ్యాధుల నుండి కోలుకోవడానికి కావలసిన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయ పడేవి- మాంస కృత్తులు .
  • మాంసం , చేపలు ,గుడ్లు, పాలు తృణ ధాన్యాలు , సోయా చిక్కుడు మొదలైన వాటి నుండి మాంస కృత్తులు పొందుతాము .
  • మన సాంప్రదాయ ఆహార పదార్థాలైన పెసరట్టు , మినపట్టు , గారే , వడ, పునుగులు , సున్నుండలు, ఇద్లీ మొదలైన వాటిలో proteins ఉంటాయి.
  • గుడ్డు తెల్ల సోనలో మాంసకృత్తుల నిర్దారణ పరీక్ష లో ఉపయోగించే ద్రావనాలు – కాపర్‌ సల్ఫెట్‌, సోడియం హైడ్రాక్సైడ్ 
  • Protiens నిర్దారణ పరీక్షలో 2 శాతం కాపర్‌ సల్ఫేట్‌ ను 100 ml నీటిలో , అలాగే 10 శాతం సోడియం హైడ్రాక్సెడ్‌ ను 100 ml నీటిలో కలపాలి.
  • పరీక్ష నాళకలో 10 చుక్కల కోడి గుడ్డు తెల్ల సొన తీసుకుని అందులో రెండు చుక్కల కాపర్‌ సల్ఫేట్‌ మరియు 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలపాలి .
  • కోడి గుడ్డు తెల్ల సొన ఊదారంగులోకి మారింది. అందువలన అందులో protiens ఉన్నట్లు నిర్దారించవచ్చు .
  • సోయాచిక్కుడు పొడి కూడా ఊదారంగులోకి మారింది .
  • నెయ్యి ఊదారంగులోకి మారలేదు . నెయ్యిలో protiens ఉండవు .
  • పాలు ఊదారంగులోకి మారాయి.
  • నూనె మరియు వెన్నలో కొవ్వులు ఉంటాయి .
  • మన శరీరంలో ఇంధన వనరుగా ఉపయోగపడేది — కొవ్వులు .
  • కొవ్వులను శక్తిని ఇచ్చే పోషకాలు అంటారు.
  • కొవ్వులు అదే మొత్తంలోని కార్బోహైడ్రేట్స్ తో పోలిస్తే ఎక్కువ శక్తిని ఇస్తాయి .
  • కొవ్వులు సాధారణంగా నూనెల వలె జిడ్డుగా ఉంటాయి.
  • కొవ్వులు ఉన్న ఆహారాన్ని మనం కాగితంపై ఉంచినప్పుడు కాగితం అపారదర్శకంగా మారింది .
  • ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వారు పాఠశాలకు వెళ్లినప్పుడు రాక్తహీనత కలిగిన విద్యార్థులకు ఐరన్‌ టాబ్లెట్స్‌, దృష్టి సమస్య ఉన్న విద్యార్థులకు కళ్ళజోడు ను అందిస్తారు .
  • ఖనిజ లవణాలు మరియు విటమిన్లను రక్షక పోషకాలు అంటారు.
  • ఖనిజ లవణాలకు ఉదాహరణ — కాల్షియం , ఇనుము , భాస్వరం , అయోడిన్‌ , సోడియం .
  • కాల్షియం (ca) లభించే పదార్ధాలు – పాలు పెరుగు , ఆకుకూరలు ,చేప.
  • దృఢమైన ఎముకలు , దంతాలు ఏర్పడుటకు ఉపయోగపడే ఖనిజ లవణం -కాల్నియం .
  • ఇనుము (fe) లభించే వనరులు – మాంసం , ఎండిన ఫలాలు ,ఆకుకూరలు..
  • రక్తం ఏర్పడడానికి , ఆక్సిజన్‌ సరఫరాకు అవసరమయ్యే ఖనిజ లవణం — ఇనుము .
  • భాస్వరం(p) లభించే పదార్థాలు – పాలు ,పెరుగు ,ధాన్యాలు ,గింజలు ,మాంసం .
  • బలమైన ఎముకలు ,దంతాలు కావడానికి అవసరమయ్యే ఖనిజలవణం — భాస్వరం
  • అయోడిన్‌ (I) లభించే ఆహార పదార్థాలు – సముద్ర ఆహారం ,ఉప్పు .
  • థైరాయిడ్‌ హార్మోన్‌ తయారీకి అవసరమయ్యే ఖనిజలవణం — అయోడిన్‌.
  • ఏ ఖనిజలవణం లోపిస్తే గాయిటర్‌ వ్యాధి కలుగుతుంది – అయోడిన్‌ .
  • సోడియం(Na) లభించే వనరు – ఉప్పు
  • శరీరానికి కావలసిన నీటిని పట్టి ఉంచే ఖనిజలవణం — సోడియం .
  • ఖనిజలవణాలు లభించే పదార్థాలు – పండ్లు కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్స్
  • రక్తహీనత నివారించడానికి పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమం — WIFS
  • WIFS- weekly iron folic acid
  • WIFS కార్యక్రమం ప్రారంభం అయిన సంవత్సరం – 2012.
  • WIFS కార్యక్రమం కింద 1 నుండి 10 తరగతులు చదువుతున్న పిల్లలకు ప్రతివారం (పింక్‌/నీలం) ఐరన్‌ మాత్రలు ఇస్తారు .
  • ఐరన్‌ ఫోలిక్‌ ఆమ్లాల మాత్రలను ఖచ్చితంగా భోజనం తర్వాత తీసుకోవాలి .లేకపోతే వికారం వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు .
  • ఫోలిక్‌ ఆమ్లం ఒక అనుబంధపదార్ధం కావున అది రక్తం లోకి ఆహారంతో కలిసి ప్రవేశించాలి .
  • రేచీకటి నివారించడానికి విటమిన్‌ A అవసరం .
  • విటమిన్‌ లు రెండు రకాలు. 1. కొవ్వులో కరిగే విటమిన్లు – A,D,E,K.

2. నీటిలో కరిగే విటమిన్లు _ ౦ మరియు 8 కాంస్లెక్స్‌..

విటమిన్‌ పేరువిధులుఆహార వనరులులోపించినపుడు కలిగే వ్యాధి
విటమిన్‌ Aకళ్ళు, రోమాలు, చర్మం యొక్క ఆరోగ్యానికిక్యారెట్‌, మునగ, పాలు పాదార్థాలు, లివర్‌ ఆయిల్స్‌కళ్ళు పొడిబారడం, రేచీకటి, కార్నియా వైఫల్యం
విటమిన్‌ Bపిండి పదార్ధాలు, మాంస కృత్తులుతవుడు, పాలుబెరి బెరి, ఫిట్స్‌, పెల్లాగ్రా
కాంప్లెక్స్‌వినియోగం, ఎర్ర రక్తకణాల తయారీగుడ్డు, ఆకుకూరలుపొలుసు చర్మం, ఫోటో ఫోబియా జ్ఞాపక శక్తి తగ్గడం
విటమిన్‌ Cచర్మం, దంతాలు, చిగుళ్ళు, రక్తకణాల ఆరోగ్యానికినిమ్మ, నారింజ జాతి ఫలాలు, మునగ, మొలకలుస్కర్వి
విటమిన్‌ Dఎముకలు, దంతాలు ఆరోగ్యంసూర్యరశ్మి, పాల ఉత్పత్తులురికెట్స్‌
విటమిన్‌ Eనాడులు, రక్తకణాల ఆరోగ్యంపండ్లు, కూరగాయలు, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌వంధ్యత్వ సమస్యలు
విటమిన్‌ Kదెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టడానికిక్యాబేజీ, ఆకుకూరలురక్తం గడ్డకట్టడం ఆలస్యమవడం
  • కోవిడ్‌ 19 పరిస్థితులలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం కోసం అందరూ విటమిన్‌౦ లభించే ఆహార పదార్థాలు అధికంగా తీసుకున్నారు
  • గాయాలయినప్పుడు రక్తం గడ్డ కట్టడం లో సహాయపడే విటమిన్‌ – విటమిన్‌ K
  • సూర్య రశ్మి నుండి లభించే విటమిన్‌- విటమిన్‌ D.
  • విటమిన్‌ C అనునది ఆస్కార్టిక్‌ ఆమ్లం అనే ఒక సేంద్రీయ పదార్థం .
  • ఆహారంలో విటమిన్‌ C ఉందని నిర్ధారించే పరీక్షలో నిమ్మకాయ , అయోడిన్‌ ద్రావణం , ఒక తెల్ల కాగితంతో చేస్తారు .
  • ఒక తెల్ల కాగితంపై అయోడిన్‌ ద్రావణం రెండు చుక్కలు వేసి దానిపై నిమ్మకాయ ముక్కను బోర్లించాలి .
  • నిమ్మకాయలో విటమిన్‌ C ఉన్నట్లైతే నిమ్మకాయ కింద అయోడిన్‌ ద్రావణం పోసి ఉన్న కాగితం భాగం రంగును కోల్పోతుంది .
  • చిలగడ దుంపలో అధికంగా ఉండే పోషక పదార్ధాలు – పీచు పదార్థాలు .
  • జీర్ణ వ్యవస్థలో పేగులలో ఆహార కదలికలకు మరియు మలబద్ద నివారణకు సహాయపడేవి – పీచు పదార్ధాలు .
  • పీచు పదార్ధాలు ప్రధానంగా మొక్కల నుండి లభిస్తాయి .
  • చిలగడ దుంప , బత్తాయి వంటి ఆహార పదార్థాలలో పీచు పదార్థం ఎక్కువ .
  • పీచు పదార్థం లభించే పదార్ధాలకు ఉదాహరణ — కూరగాయలు, ఆకు కూరలు, దుంపలు, పండ్లు, మొలకలు.
  • మన రక్తంలో నీరు ఒక భాగం.
  • మన శరీరంలో దాదాపు మూడింట రెండు వంతుల నీరు ఉంటుంది .
  • నీరు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ద పరుస్తుంది .
  • శరీరం నుండి కొన్ని వ్యర్థాలు మూత్రం మరియు చెమట రూపంలో బయటకు వెళ్లడానికి, ఆహారాన్ని జీర్ణం చేయడానికి నీరు సహాయపడుతుంది .
  • బాటిల్‌ వాటర్‌ కంటే. పంపు నీరు తాగడం ఉత్తమం .
  • మినరల్‌ వాటర్‌ అనగా వివిధ ఖనిజ లవణాలు ఉన్న బుగ్గ నీరు ను వడపోయగా వచ్చే నీరు.
  • ఆయుర్వేదం లో వివరించిన విబంధ ను పోలి ఉండే వ్యాధి – మలబద్దకం
  • మలబద్దకం అనునది జీర్ణ నాళ. పేగుకు సంబంధించిన వ్యాధి.
  • తగినంత పీచు పదార్ధం , తగినంత నీరు తెసుకోక పోవడం వలన మలబద్దకం ఏర్పడుతుంది .
  • అన్నీ రకాల పోషకాలు తగిన పరిమాణంలో కలిగిఉన్న ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు.
  • సమతుల ఆహారం అంటే ఖరీదైన ఆహారం అని అర్థం కాదు.
  • నేషనల్‌ ఇన్స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ఎక్కడ కలదు …హైదారాబాద్‌
  • NIN ఏర్పాటు చేయబడిన సంవత్సరం — 1918
  • జాతీయ పోషకాహార సంస్థ (NIN) నంది విసృత ఆధారితమైన ఆహారం మరియు పోషణకు సంబంధించి సంపూర్ణ పరిశోధన జరుగుతుంది
  • పోషకాల లోపించడం వలన కలిగే వ్యాధులను న్యూనతా వ్యాధులు అంటారు.
  • పిల్లల ఆహారంలో కావలిసిన మాంస కృత్తులు (protiens) లభించని స్థితి ఎక్కువ కాలం కొనసాగితే వచ్చే వ్యాధి – క్వాషి యార్కర్‌
  • పిల్లల ఆహారంలో మాంస కృత్తులు మరియు పెండి పదార్థాలు లభించని స్థితి ఏర్పడితే కలిగే వ్యాధి – మేరాస్మస్.
  • మనం రోజు కొవ్వులతో కూడిన ఆహారం తీసుకుంటే కలికే లక్షణం – ఊబకాయం
  • రోజూ జంక్‌ ఫుడ్స్‌ తినడం వలన మన జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది .
  • జంక్‌ ఫుడ్స్‌ అధికంగా కొవ్వులు కలిగి ఉంటాయి .పీచు పదార్ధాలు ఉండవు .
  • జింక్‌ ఫుడ్స్‌ కు ఉదాహరణ:- పెజ్లా, బర్గర్‌, చిప్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌, నూడుల్స్‌, కూల్‌ డ్రింక్స్‌
  • స్థానికంగా దొరికే వారి మొదలగు ధాన్యాలు ఆరోగ్యానికి అవసరం .
  • జొన్నలు, రాగులు వంటి ధాన్యాలలో కాల్షియం మరియు ఇనుము అధికంగా దొరుకుతుంది .
  • బాగా పాలిష్‌ చేసిన బియ్యంలో పోషక విలువలు తగ్గుతాయి . ఫైబర్‌ తక్కువగా ఉంటుంది .
  • జీర్ణక్రియ ఆరోగ్యానికి పీచు పదార్థాలు చాలా అవసరం
  • శీతల పానీయాలలో ఉండే ఆమ్లగుణం ఎముకలకు, దంతాలకు చేటు చేస్తుంది .
  • భోజనానికి ముందు గాని తర్వాత గాని కాఫీ , టీ తాగడం వలన శరీరం ఐరన్‌ ధాతువును గ్రహించలేదు .
  • బెల్లం ద్వారా మనకి ఐరన్‌ లభిస్తుంది .
  • చిక్కి ద్వారా విటమిన్‌ B, protein, ఐరన్‌ లభిస్తాయి. .
  • మొలకెత్తిన ధాన్యాలు , పప్పు దినుసులు చాలా సూక్ష్మ పోషకాలకు , శక్తి వనరులుగా సహాయపడతాయి
  • మట్టిని సజీవంగా ఉంచడం కోసం సేంద్రీయ ఎరువులు మరియు సేంద్రీయ పురుగు మందులు ఉపయోగించి వ్యవసాయం చేయు పద్దతిని సేంద్రీయ వ్యవసాయం అంటారు.
  • సేంద్రీయ వ్యవసాయంలో పండించిన ఆహార పదార్థాలను సేంద్రీయ ఆహారాలు అంటారు .
  • కలుషిత ఆహారాలను నియంత్రించడం కోసం ఏర్పాటైన సంస్థ – FSSSI
  • ఈ కింద ఇవ్వబడిన 7C లు మంచి ఆరోగ్యం పొందడానికి తోడ్పడతాయి

1. Check-తాజా ఆహారాన్ని తనిఖీ చేసి ఎంచుకోండి

2. Clean-ఆహారాన్ని నిలువచేసే ముందు అన్నీ పాత్రలు కడగండి లేదా తుడవండి

3. Cover – ఆహారం మరియు తాగునీటిని నిల్వ ఉంచే ప్రదేశానికి మూతలు ఉంచండి

4. Cross contamination avoided-వందని మరియు వండిన ఆహారాన్ని వేరుగా ఉంచండి .

5. Cook – ఆహారాన్ని బాగా ఉడికించి తాజాగా వండినదైనట్లు చూసుకోండి .

6. Cool/chill-మాంసం , కోడి , గుడ్డు ఇతర పాడైపోయే వస్తువులు శీతలీకరించండి

7. Consume – పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వడ్డించండి . శుభ్రమైన పాత్రలు వాడండి .

  • తృణ ధాన్యాలు మరియు చిరుధాన్యాలలో పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి
  • పప్పు ధాన్యాలలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి .
  • మలబద్దకాన్ని నివారించడానికి ఎక్కువ పీచు పదార్ధారు తీసుకోవాలి .
  • విటమిన్‌ D లోపం వలన రికెట్స్‌ అనే వ్యాధి కలుగుతుంది .
  • విటమిన్‌ C లోపం వలన స్కర్వీ అనే వ్యాధి కలుగుతుంది .
  • రక్త హీనత అనునది దేని లోపం వలన కలుగుతుంది – ఐరన్‌
  • విటమిన్‌ A లోపం వలన మనకు దృష్టి లోపాలు కలుగుతాయి .

పదార్ధాల స్వభావం

  • ఆహార పదార్ధాలలో కొన్ని పదార్థాలు పుల్లని రుచిని కలిగి ఉంటాయి . పుల్లని రుచిని కలిగి ఉండే పదార్ధాలను ఆమ్లాలు అంటారు .
  • ఆమ్లాలు రుచికి పుల్లని స్వభావం కలిగి ఉంటాయి .
  • ఆమ్లం అనే పదాన్ని ఆంగ్లం లో Acid అంటారు .
  • Acid అనే పదం ఏసీర్‌ అనే లాటిన్‌ పదం నుండి వచ్చింది .
  • ఏసీర్‌ అనగా అర్థం – పులుపు
  • టమాటా రసం, పెరుగు, పచ్చి మామిడికాయ, ఉసిరి కాయ, కమలా రసం వంటివి పుల్లని రుచిని కలిగి ఉంటాయి.
  • విటమిన్‌ C యొక్క రసాయన నామం — ఆస్కార్టిక్‌ ఆమ్లం
  • ఆస్కార్టిక్‌ ఆమ్లం నిమ్మజాతి పండ్లు , ఉసిరిలో అధికంగా లభిస్తుంది .
  • స్నానపు గదులను శుభ్రం చేయడానికి ఉపయోగించే ఆమ్లం — హైడ్రో క్లోరిక్‌ ఆమ్లం (Hcl)
  • Hcl ఘాటైన వాసన కలిగి దట్టమైన పోగాలను విడుదల చేస్తుంది .
  • వాహనాలలో ఉపయోగించే బ్యాటరీలలో ఉపయోగించే ఆమ్లం – సల్ఫ్యూరిక్‌ ఆమ్లం
  • భూమి నుండి తవ్వి తీసిన ఖనిజాల నుండి కృత్రిమంగా తయారు చేసిన ఆమ్లములను ఏమని పిలుస్తారు -ఖనిజ ఆమ్లాలు లేదా కృత్రిమ ఆమ్లాలు .
  • ఖనిజ లేదా కృత్రిమ ఆమ్లములకు ఉదాహరణ — హైడ్రో క్లోరికామ్లం, సల్ఫ్యూరిక్‌ ఆమ్లం, నత్రికామ్లం
  • సోడాలు మరియు శీతల పానీయాలలో ఉండే ఆమ్లం — కార్టోనిక్‌ ఆమ్లం .
  • కార్డన్‌ దై ఆక్సైడ్‌ ను నీటితో కలిపి కార్టోనిక్‌ ఆమ్లం తయారు చేస్తారు .
  • సబ్బులు ,టూత్‌ పేస్ట్‌ లు క్షారాలను కలిగి ఉంటాయి
  • క్షారాలు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి .
  • జారుడు స్వభావం కలిగి ఉండే రసాయన పదార్థాలను క్షారాలు అంటారు .
  • క్షారాలు జారుడు స్వభావాన్ని మరియు చేదు రుచిని కలిగి ఉంటాయి .
  • టూత్‌ పేస్ట్‌ లో గల ముఖ్య అనుఘటకాలు — అల్యూమినియం హైడ్రాక్టైడ్‌, సోడియం బై కార్టొనేట్‌ .
  • స్నానం చేయు సబ్బులలో ఉండే ముఖ్య అనుఘటకం — పొటాషియం హైడ్రాక్సెడ్‌
  • బట్టలు ఉతికే డిటర్జెంట్‌ సబ్బులలో ఉండే ముఖ్య అనుఘటకం — సోడియం హైడ్రాక్టైడ్‌
  • నీటిలో కరిగే క్షారాలను ఏమంటారు – ఆల్కలీలు
  • ఆల్కలీలకు ఉదాహరణ — సోడియం హైడ్రాక్సెడ్‌ , పొటాషియం హైడ్రాక్సెడ్‌, కాల్షియం హైడ్రాక్సెడ్‌
  • ఆమ్లాలకు, క్షారాలకు సరికొత్త నిర్వచనాలు ఇచింది – స్వంటే అర్హీనియస్‌
  • అర్హీనియస్ ఏ దేశానికి చెందినవారు — స్వీడన్‌
  • అర్హీనియస్ రసాయన శాస్త్రంలో చేసిన పరిశోధనకు గాను ఏ సంవత్సరం లో నోబెల్‌ బహుమతి లభించింది – 1903 .
  • పదార్ధాలను వాటి రుచి మరియు జారుడు స్వభావం ఆధారంగా ఆమ్లాలు ,క్షారాలు అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు .
  • ఆమ్లం మరియు క్షారం కానీ పదార్ధాలను తటస్థ పదార్థాలు అంటారు .
  • స్వచ్చమైన నీరు ఒక తటస్థ పదార్ధం .
  • తటస్థ పదార్థాలకు ఉదాహరణలు — స్వేదన జలం , ఉప్పు ద్రావణం , చక్కెర ద్రావణం .
  • కొన్ని ఆమ్లాలు మరియు క్షారాలు చాలా ప్రమాదకరమైనవి మరియు క్షయం చేయు స్వభావం కలవి…ఇలాంటి వాటిని స్పర్శ లేదా రుచి ద్వారా పరీక్షించలేము ..ఉదాహరణ :హైద్రో క్లోరికామ్లం ,సల్ఫ్యూరిక్‌ ఆమ్లం ,నత్రికామ్లుం ,సోడియం హైడ్రాక్సెడ్‌, మెగ్నీషియం హైడ్రాక్సెడ్‌ , పొటాషియం హైడ్రాక్సెడ్‌.
  • ఆమ్లాలు, క్షారాలను గుర్తించడానికి సహాయపడే పరిసరాలలో లభించే స్టార్ధాలను సూచికలు అంటారు.
  • సూచికలలో ముక్యమైనవి:

1. సహజ సూచికలు 

2. క్రుత్రిమ సూచికలు 

3. ఘ్రాణ సూచికలు 

4. సార్వత్రిక సూచికలు

  • సహజ సూచికలు :
  • ప్రకృతిలో సహజంగా లభించే పసుపు మరియు మందారం లను సహజ సూచికలు అంటారు .
  • సాధారణంగా ఎక్కువ గా ఉపయోగించే సూచిక — లిట్మస్‌
  • లిట్మస్‌ లను దేని నుండి గ్రహిస్తారు – లైకేన్‌
  • లిట్మస్‌ కాగితపు పట్టీలు రెండు రంగులలో ఉంటాయి ..1. ఎర్ర లిట్మస్‌ 2. నీలి లిట్మస్‌ ..
  • ఒక పసుపు కాగితం పట్టీని నిమ్మరసం వంటి ఆమ్లంలో ఉంచినప్పుడు ఆ పసుపు కాగిత పట్టీ పసుపు రంగులోనే ఉండిపోతుంది .
  • పసుపు రంగు కాగితం పట్టీని సబ్బు వంటి ద్రావణంలో ముంచినప్పుడు అది ఎరుపు గోధుమ రంగులోకి మారుతుంది .
  • పసుపు రంగు కాగితం పట్టీని సున్నపు ద్రావణంలో ముంచినప్పుడు అది ఎరుపు గోధుమ రంగులోకి మారుతుంది .
  • ఆమ్లాలు, క్షారాలను పరీక్షించడానికి పసుపు ముద్దను వినియోగించవచ్చు .
  • ఇండిగోఫెరా టింక్షోరియా పువ్వులను కూడా సూచికగా వినియోగించవచ్చు ,
  • ఇండిగోఫెరా టింక్టోరియా- నీలి చెట్టు ..
  • మందార సూచిక తయారు చేయడానికి మందార పూల రేకులను తీసుకుని గోరు వెచ్చని నీటిలో నీరు ఊదా రంగు లోకి మారేంత వరకు కలియబెట్టాలి .తర్వాత వడపోసి ద్రావణం తీసుకోవాలి .
  • మందార ద్రావణం నిమ్మరసం ,వెనిగర్‌ లలో గులాబీ రంగులోకి మారింది .
  • మందార ద్రావణం సబ్బు మరియు సున్నపు ద్రావణంలో ఆకుపచ్చగా మారింది .
  • మందారను ఆమ్ల.క్షార సూచికగా వినియోగించవచ్చు ..
  • కృత్రిమ సూచికలు :
  • కృత్రిమంగా తయారు చేసిన సూచికలను కృత్రిమ సూచికలు అంటారు…
  • ప్రయోగ శాలలో సాధారణంగా ఉపయోగించే సూచికలు — మిథైల్‌ ఆరెంజ్‌ , ఫీనాప్తలిన్‌
  • నీలి లిటస్‌ ను ఎర్పు రంగులోనికి మార్ప్దేవి – ఆమ్లాలు
  • ఎర్ర లిట్మస్‌ ను నీలి రంగులోనికి మార్లేవి -క్షారాలు
  • మిథైల్‌ ఆరెంజ్‌ ఆమ్లాలలో ఎరుపు రంగు లోనికి మారుతుంది .
  • మిథైల్‌ ఆరెంజ్‌ క్షారాలలో పసుపు రంగులోనికి మారుతుంది .
  • ఫీనాప్తలిన్‌ సూచిక క్షారాలలో పింక్‌ రంగులోనికి మారుతుంది .
  • ఆమ్లాలలో ఫీనాప్తలిన్‌ రంగు లో మార్పు రాదు.
  • స్వచ్చమైన నీటిలో ఏ సూచిక యొక్క రంగు కూడా మారదు..ఎందుకంటే నీరు తటస్థ పదార్ధం .
  • నిమ్మకాయకు రక్తం తెచ్చే మెజీషియన్స్‌ నిమ్మకాయకు ముందుగానే మిథైల్‌ ఆరెంజ్‌ లేదా మందార పూల రసం రాసి ఉంచుతారు ..
  • ఘ్రాణ సూచికలు(ఘాణ):
  • కొన్ని పదార్ధాలను ఆమ్లం లేదా క్షారంలో కలిపినప్పుడు వాటి వాసనలో మార్పు వస్తుంది .వీటిని ఘ్రాణ సూచికలు అంటారు .
  • ఘ్రాణ సూచికలకు ఉదాహరణ –ఉన్నిరసం , వెనిల్లా, లవంగ నూనె.
  • ఘ్రాణ సూచికలను సమ్మిళిత బోధనలో ఉపయోగిస్తారు .
  • సార్వత్రిక సూచిక :
  • ఇది వివిధ రంగుల మిశ్రమం
  • వివిధ పదార్ధాలతో వేరు వేరు రంగులను ఇస్తుంది .
  • మిథైల్‌ ఆరెంజ్‌ , ఫీనాప్తలిన్‌ కు విరుద్దంగా ఇది ఆమ్లాలు మరియు క్షారాల బలాన్ని సూచిస్తుంది. పదార్థాల PH:
  • ఆహార పదార్ధాలలో ఉపయోగించే వెనిగర్‌ ముట్టుకున్నా గాని మనకు హాని చేయదు కానీ హైడ్రో క్లోరికామ్లం తాకకూడదు ప్రమాదకరం ..
  • వెనిగర్‌ కన్నా హైడ్రో క్షోరికామ్లం బలం లో తేడా ఉంటుంది .( ఆమ్లం యొక్క బలం )
  • ఆమ్ల క్షార.బలాలను దేనితో కొలుస్తారు – PH స్కేలు
  • PH స్కేలు ను ప్రవేశ పెట్టిన శాస్త్ర వేత్త – సొరేన్‌ సన్‌
  • PH స్కేలు వ్యాప్తి ౦ నుండి 14 వరకు ఉంటుంది.
  • ఆమ్లాల PH విలువ 7 కన్నా తక్కువ ఉంటుంది.
  • క్షారాల PH విలువ 7 కన్నా ఎక్కువ ఉంటుంది.
  • తటస్థ పదార్థాల PH విలువ 7 ఉంటుంది .
  • 0 నుండి 7కు గి విలువ వెళుతున్న కొలదీ ఆమ్ల స్వభావం తగ్గుతుంది .
  • 7 నుండి 14కు PH విలువ వెళుతున్న కొలదీ క్షార స్వభావం పెరుగుతుంది .
  • వివిధ పదార్థాల PH లను సార్వత్రిక సూచికలు లేదా PH పేపర్‌ లతో పరీక్షించవచ్చు .
  • బలమైన ఆమ్లాలు మరియు క్షారాలకు క్షయం చెందించే స్వభావం ఎక్కువ.
  • బలమైన ఆమ్లాలు మరియు క్షారాలు తీవ్రమైన కాలిన గాయాలను ఏర్పరుస్తాయి.
  • బలమైన ఆమ్లములకు ఉదాహరణ :హైడ్రో క్లోరిక్‌ ఆమ్లం , సల్ఫ్యూరిక్‌ ఆమ్లం , నత్రికామ్లం .
  • బలహీనమైన ఆమ్లాలకు ఉదాహరణ : ఆసిటిక్‌ ఆమ్లం , సిట్రిక్‌ ఆమ్లం , ఆక్ష్టాలిక్‌ ఆమ్లం ..
  • బలమైన క్షారాలకు ఉదాహరణ : సోడియం హైడ్రాక్సెడ్‌, పొటాషియం హైడ్రాక్సెడ్‌.
  • బలహీనమైన క్షారాలకు ఉదాహరణ : అమ్మోనియం హైడ్రాక్సైడ్‌ .
  • సహజ ఆమ్లాలు సాధారణంగా చాలా బలహీనమైనవి .
  • ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి ఏ వాయువును విడుదల చేస్తాయి – హైడ్రోజన్‌
  • మండుతున్న పుల్లను టప్‌ అనే శబ్దం తో ఆర్పి వేసే వాయువు – హైడ్రోజన్‌
  • హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం జింక్‌ తో చర్య జరిపి హైడ్రోజన్‌ వాయువుని విడుదలచేయును .
  • హైడ్రో క్లోరికామ్లం + జింక్‌ → జింక్‌ క్లోరైడ్‌ + హైడ్రోజన్‌
  • గాలికన్న హైడ్రోజన్‌ వాయువు తేలికైనది కావున హైడ్రోజన్‌ వాయువు ఉన్న బెలూన్‌ పైకి ఎగురుతుంది .
  • పచ్చళ్లను అల్యూమినియం,రాగి స్పీల్‌ మొదలైన పాత్రలలో నిల్వ చేయరు ఎందుకంటే పచ్చళ్లలో ఆమ్లాలు ఉంటాయి
  • పచ్చళ్లలో ఉన్న ఆమ్లాలు లోహపు పాత్రలతో చర్య జరిపి విష పదార్ధాలు ఏర్పరచి పచళ్లను పాడు చేస్తాయి .
  • అందువలన పచ్చళ్లను సాధారణంగా పింగానీ లేదా గాజు పాత్రలలో నిల్వ చేస్తారు .
  • ఎక్కువ కాలం పచ్చళ్లలో ఉంచిన చెంచా క్షయం చెందడం మనం గమనించవచ్చు .
  • సోడియం హైడ్రాక్సెడ్‌ వంటి క్షారాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్‌ వాయువును విడుదల చేస్తాయి కానీ అన్నీ క్షారాలు లోహాలతో చర్య జరపవు .
  • గుడ్డు పెంకు కాల్షియం కారొనేట్‌ తో నిర్మించబడి ఉంటుంది .
  • పరీక్షనాళికలో గుడ్డు పెంకు ముక్కలను తీసుకుని దానికి సజల హైడ్రో క్లోరికామ్లం కలిపితే ఒక వాయువు విడుదలవుతుంది ..ఈ వాయువు దగ్గర మండుతున్న పుల్లను ఉంచితే అది ఆరిపోతుంది .
  • మండుతున్న పుల్లను ఆర్వే వాయువు – కార్టన్‌ డై ఆక్సెడ్‌
  • ఆమ్లము కాల్షియం కార్టొనేట్‌ తో చర్య జరపడం వలన కార్డన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతుంది .
  • ఆమ్లం మరియు క్షారాల మధ్య జరిగే చర్యను పమంటారు – తటస్టీకరణం
  • తటస్థీకరనం  లో ఏర్పడేవి – నీరు, లవణాలు
  • సోడియం హైడ్రాక్సెడ్‌ ద్రావణమునకు ఫీనాస్తలిన్‌ సూచిక కలిపితే అది గులాబీ రంగులోకి మారును. ఆ ద్రావణానికి హైడ్రో క్లోరిక్‌ ఆమ్లాన్ని గులాబీ రంగు పోయేంతవరకు కలపండి ..ఇప్పుడు ఆ ద్రావణం ఆమ్లం కాదు క్షారం కాదు. తటస్టీకరించ బడింది
  • క్షారాలలో ఫీనాప్తలిన్‌ గులాబి రంగులోకి మారుతుంది .
  • ఆమ్లాలలో మరియు తటస్థ ద్రావణాలలో ఫీనాప్తలిన్‌ కు రంగు ఉండదు .
  • హైడ్రో క్లోరిక్‌ ఆమ్లం + సోడియం హైడ్రాక్సెడ్‌ → నీరు + సోడియం క్లోరైడ్‌
  • ఆమ్లం మరియు క్షారం మధ్య చర్య జరిగి లవణం మరియు నీరు ఏర్పడినాయి .
  • సోడియం క్లోరైడ్‌ అనునది లవణం .దీనిని సాధారణ ఉప్పు అంటారు .
  • ఈ ద్రావణానికి మరల హైడ్రో క్లోరిక్‌ ఆమ్లం కలిపితే అది ఆమ్లీకృతం అయ్యి గులాబీ రంగులోనికి మారుతుంది .
  • తటస్థీకరనం  ఏర్పడిన లవణ స్వభావం అది ఏర్పడడానికి ఉపయోగించిన ఆమ్ల క్షార స్వభావం పై ఆధారపడి ఉంటుంది .
  • సోడియం క్లోరైడ్‌ (ఉప్పు ) ఒక తటస్త్స పదార్దం .
  • సోడియం కార్డొనేట్‌ ( వాషింగ్‌ సోడా ) ఒక క్షార పదార్థం .
  • అమ్మోనియం క్లోరైడ్‌ ఒక ఆమ్ల లవణం .
  • మన నిత్య జీవితంలో ఆమ్లాలు , క్షారాలు శుభ్ర పరిచే పదార్ధాలుగా , తటస్థీకరణ ద్రావణాలుగా , నిలువ చేయు పదార్థాలుగా, మరకలను తొలగించే పదార్ధాలుగా , మందులుగా ఉపయోగపడతాయి .
  • మన జీర్ణాశయం గాస్త్రిక్‌ ఆమ్లం విడుదల చేస్తుంది .
  • గాస్త్రిక్‌ ఆమ్లం అనగా – హైడ్రో క్లోరిక్‌ ఆమ్లం
  • గాస్త్రిక్‌ ఆమ్లం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది .
  • గాస్త్రిక్‌ ఆమ్లం అధిక మొత్తంలో విడుదల అవ్వడం వలన అజీర్ణం లేదా ఎసిడిటీ ఏర్పడుతుంది .
  • అసిడిటీ వలన పొట్టలో మంట , నొప్పి కలుగుతాయి .
  • అసిడిటీ నుండి ఉపశమనం పొందడానికి మనకు సహాయ పడేవి- అంటాసిడ్‌ లు
  • అంటాసిడ్‌ లు క్షారాలను కలిగి ఉంటాయి
  • అంటాసిడ్‌ లు కలిగి ఉండే క్షారాలకు ఉదాహరణ : అల్యూమినియం హైడ్రాక్సైడ్‌ , మెగ్నీషియం హైడ్రాక్సెడ్‌.
  • మిల్క్‌ ఆఫ్‌ మెగ్నీషియా అని దేనిని పిలుస్తారు – మెగ్నీషియం హైడ్రాక్సెడ్‌
  • అంటాసిడ్‌ లలో ఉండే క్షారాలు గాస్త్రిక్‌ ఆమ్లాన్ని తటస్టీకరించి ఉపశమనాన్ని కలిగిస్తాయి .
  • చీమలు మరియు తేనె టీగలు కుట్టినప్పుడు వాటి నుండి విడుదలయ్యే ఆమ్లం – ఫార్మిక్‌ ఆమ్లం
  • ఫార్మిక్‌ ఆమ్లం చర్మం లోకి వెళ్ళడం వలన దురద, నొప్పి కలుగుతాయి .
  • చీమలు, తేనెటీగలు కుట్టిన ప్రదేశం లో బేకింగ్‌ సోడా ముద్దను రుద్ది ఉపశమనం పొందవచ్చు .
  • బేకింగ్‌ సోడాలో ఉన్న క్షార పదార్ధం ఫార్మిక్‌ ఆమ్లాన్ని తటస్టీకరిస్తుంది .
  • ఇటీవల కాలంలో పొలంలో కృత్రిమ ఎరువుల వాడకం ఎక్కువ అవ్వడం వలన పొల్లాల్లోని మట్టి PH హెచ్చు తగ్గుదలకు కారణం అవుతుంది.
  • మట్టి యొక్క ఆమ్లత్వం , క్షారత్వం ఏది ఎక్కువ అయినా మొక్కలు బాగా పెరగవు . ఇలాంటప్పుడు మట్టిని తటస్థ స్థితి లోనికి మార్చాలి 
  • మట్టి ఆమ్లత్వం ఎక్కువ ఉంటే రైతులు పొడి సున్నం ,పొటాషియం హైడ్రాక్సెడ్‌ వంటి క్షార స్వభావం ఉన్న పదార్థాలు కలుపుతారు .
  • మట్టి కి క్షార స్వభావం అధికంగా ఉంటే కంపోస్ట్‌ (పశువుల ఎరువు ) వంటి సేంద్రీయ ఎరువులు కలుపుతారు .
  • 10 గ్రాముల మట్టిని సేకరించి అరలీటర్‌ నీటిని కలిపి ద్రావణము తయారు చేసి ఆ ద్రావణాన్ని వడగట్టి వడ కట్టిన ద్రావణాన్ని యూనివర్సల్‌ సూచిక లేదా PH పేపర్‌ తో పరీక్షించాలి .
  • మట్టి స్వభావాన్ని బట్టి వివిధ రంగుల పూలను ఇచ్చే మొక్క — హైడ్రాంజియా
  • మట్టి PH 5.5 కన్నా తక్కువ ఉంటే హైడ్రాంజియా నీలం రంగు పువ్వులను ఇస్తుంది .
  • మట్టి PH 6.5 కన్నా ఎక్కువ ఉంటే హైడ్రాంజియా పింక్‌ రంగు పూలను ఇస్తుంది .
  • పూసే పూల రంగులను బట్టి హైడ్రాంజియా మొక్కల ద్వారా మట్టి స్వభావం తెలుసుకోవచ్చు .
  • ఆమ్ల స్వభావం కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు.
  • ఆమ్ల వర్షాలకు అతి పెద్ద కారణం – వాయు కాలుష్యం
  • ఆమ్ల వర్షం వలన భవనాలకు , తాజ్‌ మహల్‌ వంటి చారిత్రక కట్టడాలకు, మొక్కలకు, జంతువులకు హాని కలుగుతుంది .
  • ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియం నూనెలు దహనం చెందడం వలన సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ , నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ వాయువులు వర్షపు నీటి చుక్కలతో చర్య జరపడం వలన సల్ఫ్యూరిక్‌ ఆమ్లం , నత్రికామ్లం తయారవుతాయి .
  • ఆమ్ల వర్షంలో ప్రధానంగా ఉండే వాయువులు – సల్ఫ్యూరిక్‌ ఆమ్లం , నత్రికామ్లం
  • భారతదేశంలో అనాదిగా దంతదావనానికి ఉపయోగిస్తున్న మొక్కలు – వేప , మిస్వాక్‌ , గానుగ.
  • ఈ మొక్కలలో క్షార లవణాలు గల పదార్థాలు ఉన్నాయి . ఈ క్షారాలు నోటిలోని బాక్టీరియా విడుదలచేసే ఆమ్లాలను తటస్థీకరిస్తాయి .
  • ఈ మొక్కలు బ్యాక్టీరియా ,ఫంగస్‌ లను హరించడమే కాక నొప్పి నివారణలకు కూడా పనిచేస్తాయి .

ఆమ్లం ఉపయోగం

వెనిగర్‌ (ఆసిటిక్‌ ఆమ్లం)   – ఆహార పదార్థాల తయారీ , నిల్వ

సిట్రిక్‌ ఆమ్లం   – ఆహార పదార్థాల నిల్వ , శీతల పానీయాలు

నత్రికామ్లం మరియు సల్ఫ్యూరిక్‌ ఆమ్లం   – రసాయన ఎరువులు ,రంగులు ,అద్దకాలు

సల్ఫ్యూరిక్‌ ఆమ్లం     – వాహనాల బ్యాటరీలు

టానిక్‌ ఆమ్లం     – సిరా తయారీ మరియు తోలు పరిశ్రమ

క్షారాలు ఉపయోగాలు

 కాల్షియం హైడ్రాక్సైడ్‌   నేల లోని క్షారతను తటస్థీకరిస్తుంది ,గోడల సున్నము

మెగ్నీషియం హైడ్రాక్సెడ్‌ అంటాసిడ్‌ మరియు విరోచనకారి

అమ్మోనియం హైడ్రాక్సైడ్‌ కిటికీలు మొదలయినవి శుభ్రపరచడానికి

సోడియం హైడ్రాక్సెడ్‌ పేపర్‌ సబ్బులు , డిటర్జెంట్ల ఉత్పత్తి కొరకు

పొటాషియం హైడ్రాక్సైడ్‌ సబ్బులు మరియు బ్యాటరీల ఉత్పత్తి కొరకు

  • సబ్బు అనేది క్షార స్వభావం గల లవణం .
  • సబ్బును కొబ్బరి నూనె వంటి ఫ్యాటీ ఆమ్లాలను సోడియం హైడ్రాక్సెడ్‌ లేదా పొటాషియం వంటి ఆల్కలీలకు కలిపి తయారు చేస్తారు
  • బట్టల సబ్బు దేనిని కలిగి ఉంటుంది – సోడియం హైడ్రాక్సెడ్‌
  • శరీర శుభ్రతకు వినియోగించే సబ్బు దేనిని కలిగి ఉంటుంది – పొటాషియం హైడ్రాక్సెడ్‌
  • జింక్‌ హైడ్రాక్సెడ్‌ క్షారం కానీ ఆల్కలీ కాదు.
  • జింక్‌ ఆక్సైడ్‌ ను సౌందర్య లేపనాలలో ఉపయోగిస్తారు .
  • ఆల్కలీలు క్షారాలే కానీ అన్నీ క్షారాలు ఆల్కలీలు కాదు .

Post a Comment

0 Comments