Ticker

6/recent/ticker-posts

AP TET and DSC Class 3 EVS Complete and BEST Notes

AP TET and DSC Class 3 EVS Complete and BESTNotes 3వ తరగతి

AP Class 8th Social Bits Chapter 1 Best Notes and MCQ

ఆనందమైన కుటుంబం

  • మనమందరం మన కుటుంబంతో కలసి జీవిస్తాం .
  • కుటుంబం లో ఉన్న అన్నదమ్ములు మరియు అక్కచెళ్లెల్లను తోబుట్టువులు అంటారు .
  • కుటుంబ సభ్యులందరూ విభిన్నమైన పనులు చేస్తుంటారు .
  • కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఇంటి పనులను నిర్వహిస్తారు .
  • ఇలా పనులు పంచుకోవడం వలన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు అభివృద్ధి చెందుతాయి.
  • గ్రామంలో వివిధ రకాల వృత్తులు చేసేవారు ఉన్నారు.
  • సాధారణంగా కుటుంబ సభ్యులు పెద్దల పోలికలతో ఉంటారు .
  • సాధారణంగా పిల్లలకు చర్మం రంగు (గోధుమ , నలుపు , తెలుపు ), ఎత్తు మొదలైనవి తల్లి దండ్రుల నుండి వస్తాయి .
  • కుటుంబాలలో కొన్ని పద్దతులు తల్లిదండుల నుండి పిల్లలకు సంక్రమిస్తాయి .
  • కొన్నిసార్లు పిల్లల ప్రవర్తన తల్లిదండుల, ఇతర కుటుంబ సభ్యులను పోలి ఉంటుంది.
  • మన చుట్టూ ఉండే మొక్కలు
  • మొక్కకు వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు మొదలైన భాగాలుంటాయి .
  • వేర్లు నేలకు దిగువన ఉంటాయి .
  • వేర్లు మొక్క భాగాలు అన్నింటిలో ముఖ్యమైనవి .
  • వేర్లు మొక్కను నేలలో పట్టి ఉంచుతాయి .
  • నేలలో లవణాలను , నీటిని పీల్లుకుని మొక్కలోని కాండం, ఆకులకు పంపించే భాగాలు — వేర్లు.
  • మొక్కకు ఊతం అందించేది – కాండం.
  • వేర్లు పీల్లుకున్న నీటిని, లవణాలును మొక్కలోని భాగాలకు అందించేది – కాండం.
  • మొక్కల కాండాలు వివిధ రకాలుగా ఉంటాయి.
  • కొన్ని మొక్కల కాండాలు మెత్తగా, ఆకుపచ్చ రంగులో, కొన్ని మొక్కల కాండాలు గట్టిగా, గోధుమరంగులో ఉంటాయి .
  • టమాటా మొక్కల కాండం సన్నగా ఉండి, చుట్టూ నూగుగా ఉంది.
  • మొక్కలు పెరిగే కొద్ది కాండాలు కూడా బలంగా మారతాయి .
  • బలమైన కాండాన్ని నూను అంటారు…
  • న్రూనులు బెరడుతో కప్పి ఉంటాయి…
  • పెద్దగా, బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అంటారు .
  • ఉదా:. మర్రి , చింత
  • తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టికాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. ఉదా:- గులాబీ, మందార
  • చిన్నవిగా ,మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కలను గుల్మాలు అంటారు. ఉదా;. తులసి, గోధుమ
  • ఏదైన ఒక ఆధారాన్ని పట్టుకుని పెరిగే మొక్కల్ని ఎగబాకే మొక్కలు అంటారు. ఉదా: ద్రాక్ష , కాకర .
  • నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని పాకే మొక్కలు అంటారు .ఉదా:- పుచ్చకాయ, గుమ్మడికాయ
  • మొక్కకు కావలసిన ఆహారం తయారు చేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడేవి – ఆకులు
  • ఆకులు ఆహారాన్ని గాలి, నీరు, సూర్య రశ్మి సహాయంతో తయారు చేసుకుంటాయి.
  • ఆకులు మొక్కకు ఆహార కర్మాగారాలు .
  • ఆకులు వివిధ ఆకారాలు, పరిమాణాలు, రంగులు, వాసనలు కలిగి ఉంటాయి.
  • అరటి చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి .
  • మందార చెట్టు ఆకులు వెడల్పుగా, అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి.
  • బొప్పాయి చెట్టు ఆకులు హస్తం ఆకారంలో ఉంటాయి .
  • కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి.
  • చింత చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి.
  • పుదీనా, కొత్తిమీర, తులసి మొదలైన ఆకులు మంచి వాసన కలిగి ఉంటాయి .

AP TET and DSC Class 3 EVS Complete and BEST Notes AP TET 2022 EVS Notes aptet 2022, apdse 2022, ap new class 3 evs note

  • కొత్తిమీర ,కరివేపాకు , మునగ మొదలైన ఆకులను తింటాము .
  • వేపాకు ,తులసి మొదలైన ఆకుల్ని మందుల తయారీలో ఉపయోగిస్తారు .
  • తేయా లతో టీ తయారవుతుంది.
  • వైద్యానికి ఉపయోగించే ఆకులు — వేపాకు, తులసి .
  • విస్తర్లు, పాత్రలు తయారీలో ఉపయోగించే ఆకులు — అరటి, మర్రి, సాల్‌ చెట్టు.
  • మనం విడిచిన గాలిలోని కార్టన్‌ డై ఆక్సెడ్‌ ను మొక్కలు పీల్లుకుని మనకు ఆక్సిజన్‌ ఇస్తాయి .
  • పెద్ద మొక్కల వేర్లు ,నేలలో బలంగా చొచ్చుకుని పోవడం వలన నేల కోతకు గురికాకుండా కాపాడతాయి .
  • మన చుట్టూ ఉన్న ఇంతున్లులు
  • మన ఇళ్ళలో మనతో పాటుగా నివసించే పిల్లులు, కుక్కలు మొదలైన వాటిని పెంపుడు జంతువులు అంటారు .
  • మచ్చిక చేసుకునే జంతువులకు ఉదాహరణ:కుక్క,ఆవు , కుందేలు , మేక , కోడి పెట్ట , గుర్రం మేక ,పిల్లి
  • అడవి జంతువులు ( వన్య మృగాలకు ) ఉదాహరణ :ఏనుగు , పులి , నక్క ,జీబ్రా
  • కుక్కలు మన ఇండ్లకు కాపలాగా ఉండడమే కాకుండా దొంగలను పట్టుకోవడం లో సహాయ పడతాయి .
  • ఎలుకలును పట్టుకునేవి – పిల్లులు
  • మన ఇండ్లకు కాపలా ఉండడమే కాకుండా దొంగలను పట్టుకోవడంలో సహాయం చేసేవి – కుక్కలు .
  • ఆవులు, మేకలు, గొర్రెలు , బాతులు, గుర్రములను దేనిలో పెంచుతారు –క్షేత్రాలు
  • వ్యవసాయ పనులలో సహాయపడేవి – ఎద్దులు, దున్నలు .
  • బరువులు మోసేవి – గుర్రములు, గాడిదలు .
  • అడవులలో నివసించేవి – అడవి జంతువులు.
  • అడవి జంతువులకు ఉదాహరణ — సింహం, పులి, ఎలుగుబంటి .
  • చేపలు వాటి మొప్పలు, తోక సహాయంతో నీటిలో ఈదుతాయి .
  • నేలమీద నివసించే జంతువులను భూ చర జీవులు అంటారు.
  • ఆవు, కుక్క, పిల్లి, కోడి మొదలైనవి నేలపై నివసిస్తాయి.
  • కాకి, పిచ్చుక, గుడ్లగూబ, కోతి, మిడత మొదలైనవి చెట్లమీద నివసిస్తాయి .
  • నీటిలో నివసించే జంతువులను జలచర రజీవులు అంటారు.
  • జల చర జీవులకు పడవ ఆకారపు శరీరం, వాజాలు, మొప్పలు, తోక నీటిలో నివసించడానికి సహాయపడతాయి .
  • చేపలు నీటిలో నివసిస్తాయి.
  • కుందేలు బొరియలలో నివశిస్తుంది .
  • నేలమీద, నీటిలోనూ నివసించే జీవులను ఏమంటారు – ఉభయచరాలు .
  • ఉభయచరాలకు ఉదాహరణ — కప్ప, సాలమాండర్‌ .
  • తేమగా ఉండే చర్మం, వేళ్ళ మధ్య చర్మం బలమైన వెనుక కాళ్ళ ఉభయ చరాలకు నేలమీద, నీటిలోనూ నివసించుటకు సహాయపడును .
  • సింహం నివసించే ప్రదేశం – గుహ
  • పక్షులు నివసించే ప్రదేశం — గూడు.
  • పాములు, ఎలుకలు నివసించే ప్రదేశం — కలుగు .
  • ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రములు, ఏనుగులు, జింకలు మొదలయినవి మొక్కల నుండి లభించే పదార్థాలు మాత్రమే తింటాయి.
  • ఉడతలు కాయలు, గింజలు తింటాయి.
  • మొక్కల నుండి లబించే ఆహార పదార్దాలు తినేవారిని ఏమంటారు – శాకాహారులు
  • శాకాహారులకు ఉదాహరణ ;ఆవులు , ఎద్దులు , గాడిదలు , గుర్రములు , ఏనుగులు , జింకలు
  • జంతువుల మాంసాన్ని తినే జీవులను మాంసాహారులు అంటారు .
  • మాంసాహారులకు ఉదాహరణ :; పులి , సింహం , నక్క , మొసలి
  • మొక్కలు, జంతువులు రెండింటి నుండి లభించే ఆహార పదార్థాలు తినే వాటిని పమంటారు – ఉభయాహారులు
  • ఉభయాహారులకు ఉదాహరణ :;ఎలుగుబంటి , కాకులు , కోతులు , కుక్కలు
  • సీతాకొక చిలుకలు, తేనె టీగలు పుష్పాలలో ఉన్న మకరందం పీల్లుకుంటాయి .
  • సహజ పారిశుద్ద్య కార్షికులు అని వేటిని పిలుస్తారు – రాబందులు, కాకులు, నక్కలు.
  • రాబందులు, కాకులు, నక్కలు కుళ్ళిపోయిన జంతు కళేబరాల్ని తింటాయి
  • శుభ్రపరిచే తోటీలు అని పిలువబడేవి – రాబందులు , నక్కలు ,కుక్కలు
  • జంతువులు ఇతరుల్ని హెచ్చరించడానికి, తమ నివాసప్రంతంలోకి రాకుండా ఉండడానికి ధ్యనులు చేస్తాయి. అరుస్తాయి .
  • రాతిరిపూట కీచురాయి ఆపకుండా ధ్వని చేస్తుంది .
  • కుక్క – మొరగడం
  • పిల్లి – మ్యావ్‌
  • కాకి – కావ్‌ కావ్‌
  • పులి – గాండ్రింపు
  • మేక – మేమే
  • గొల్ల భామ — కీచు ధ్వని
  • గుర్రం – సకిలించడం
  • పంది – గుర్తు గుర్రు
  • గాడిద — ఓండ్రు పెట్టడం
  • మేక – మేమే
  • కోయిల -కూ ఊ
  • కోయిల – కూ. ఉ మ.

కింది వాటిని జతపరచుము

గొల్లభామ            (    )      (a) సకిలించడం

గుర్రం                 (     )     (b) కీచుద్వని

పంది                (     )     (c) అ ఓండ్రు పెట్టు

గాడిద               (     )     (d) గుర్ర గుర్ర

మన శరీరం

  • మన శరీరం ముఖ్యంగా 3 భాగాలుగా విభజించబడింది
  • 1.తల 2. మొండెం ౩. కాళ్ళు, చేతులు
  • తలను మిగతా శరీర భాగంతో కలిపేది – మెడ
  • తల అటు, ఇటూ కదపడానికి మెడ సహాయపడుతుంది
  • చల్లదనం, వెచ్చదనం, మృదుత్వం, గరుకు వంటి స్పర్శ్మలను గుర్తించుటకు చర్మం సహాయపడుతుంది
  • మంచి స్పర్శకు ఉదాహరణ :భధ్రత కలిగించే స్పర్శ ,అమ్మ కౌగిలింత, నాన్న మనల్ని చేయి పట్టుకుని నడిపించే విధానం, తండ్రి తల
  • నిమరడం , భుజాలపై చేయి వేయడం, స్నేహితుల కరచాలనం .
  • మనకు దుఖం ,భయం , కోపం ,ఆందోళన కలిగించే స్పర్శను చెడు స్పర్శ అంటారు.
  • రహస్య భాగాలను తాకే స్పర్శను చెడు స్పర్శ అంటారు
  • ఛాతీ, కాళ్ళ మధ్య పిరుదులు మొదలైన కొన్ని శరీర భాగాలు ఎవరూ చూడకూడని తాకకూడని భాగాలు కనుక వీటిని రహస్య భాగాలు అంటారు
  • మన రహస్య భాగాలను ఎవరైనా తాకితే ౩ పద్దతులు పాటించాలి
  • వద్దు అని గట్టిగా అరవాలి
  • అక్కడి నుండి దూరంగా పారిపోవాలి.
  • మీకు నమ్మకమైన వ్యక్తికి తెలపాలి
  • ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి సంరక్షించడానికి 24 గంటలు పని చేయు జాతీయ అత్యవసర సంస్థ – 1098 (వైల్డ్‌ లైన్‌ ).
  • జ్ఞానేందియాలు మొత్తం-5
  • APJ కలాం 1931 అక్షోబర్‌ 15న తమిళనాడులోని రామేశ్వరం లో జన్మించారు.
  • ఈయన భౌతిక శాస్త్రంలో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు .
  • APJ కలాం ను మిస్సెల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా అంటారు.
  • APJ కలాం రచనలు —
  • వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌
  • ఇండియా 2020
  • ఇగ్నిటెడ్‌ మైండ్స్‌
  • ఇన్‌ డామిటబుల్‌ స్పిరిట్‌
  • APJ కలాం భారతరత్న, పద్మ విభూషణ్‌ పురస్కారాలు పొందారు.
  • APJ కలాం 2015 జులై 27 న మరణించారు

ఆహారం — ఆరోగ్యం

  • మనకు లభించే ఆహారపదార్థాలను బట్టి ఆహారపు అలవాట్లు ఉంటాయి .
  • ఆహారం మనకు శక్తి ఇస్తుంది .
  • చిన్నపిల్లలకు దంతాలు ఉండవు. వారికిపి పాలు లేదా మెత్తని ఆహారాన్ని ఇస్తారు .
  • అన్నం మన ఆహారంలో ప్రధానమైనది. ఇది వరి నుండి లభిస్తుంది .
  • మనకు చెరకు నుండి చక్కెర, బెల్లం లభిస్తాయి
  • ప్రకృతిలో మనకు ప్రసాదించబడిన మొక్కలో పోషక విలువలు ఎక్కువగా ఉన్న భాగం — ఆకులు
  • ఆరతి, కాలీఫ్లవర్‌ వంటి పుష్పాలను ఆహారంగా తింటాము.
  • క్యాబెజీ అనునది పుష్పం
  • లవంగాలలో మొగ్గలు రుచిగా ఉంది మసాలాలుగా వాడతారు
  • కుంకుమ పూలను ప్రత్యేకమైన వంటకాలు తయారుచేయుటకు వాడతారు .
  • పుట్టగొడుగు అనునది ఒక శిలీంధ్రం .
  • పుట్టగొడుగు అనేక పోషకాలను కలిగి ఉంటుంది
  • వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం, ఆలివ్‌ విత్తనాల నుండి నూనెలు తయారు చేస్తారు
  • జీడిపప్పు, పచ్చిబఠాణీలు, రాజ్బీ గింజలు, ఎరుపు కిడ్నీ బీన్స్‌/ జునుములు, వేరుశనక్కాయలు మొదలగు వాటి విత్తనాలు మనం తింటాం
  • తేనెటీగలు పూలనుండి మకరందాన్ని సేకరిస్తాయి
  • తేనెపట్టులో మకరందం ను నిలువ చేస్తాయి
  • వంట వండడానికి వంట పాత్రలు ఉపయోగిస్తారు .
  • ఆహార పదార్ధాలను వండినప్పుడు ఆ పదార్థం , మెత్తగా , రుచిగా తయారవుతుంది సులభంగా జీర్ణం అవుతుంది .
  • ఇడ్లీలను ఆవిరిలో ఉడికిస్తారు .
  • అప్పడాలను వేయిస్తారు .
  • వేయించడానికి – పెనం
  • ఉడికించుటకు – కుక్కర్‌
  • తక్కువ సెగపై కాల్లడానికి ఉపయోగించేది – గ్రిల్‌
  • జంతువుల నుండి పాలు, మాంసం లబిస్తాయి .
  • పక్షుల నుండి గుడ్డు, మాంసం లభిస్తాయి.

నీరు – ప్రకృతి వరం

  • ప్రకృతి ప్రసాదించిన వరం — నీరు
  • ప్రపంచ జలదినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు – మార్షి 22
  • అటవీ ప్రాంతాలలో నీరు జలపాతాలు , సెల ఏర్ల నుండి తెచ్చుకుంటారు . ఉదాహరణ : సీతం పేట అటవీ ప్రాంతం
  • నీరు దొరికే సహజవనరులు – సముద్రములు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చెలమలు
  • మానవ నిర్మిత నీరు లభించే ప్రంతాలు — ఆనకట్టలు, కాలువలు, గొట్టపు బావులు, చేతిపంపులు
  • ఆటవి ప్రాంతంలో నీటిని జలపాతాలు, సెలయేర్లు నుండి తెచ్చుకుంటారు.
  • అటవీ ప్రాంతం వారు వేసవిలో తీవ్ర న నీటి ఎద్దడి ఎదుర్కొంటారు .
  • భూభాగం 3 వంతుల నీరుతో నింపబడి ఉంది.
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారు పాఠశాలలో నీటిగంట ఏర్పాటు చేశారు. ఇది రోజుకు ౩ సార్లు మోగుతుంది .
  • నీటిగంట కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులను మంచినీరు తాగేలా చేసి నిర్జలి కరణకు గురికాకుండా చూడడం
  • నీటి బాటిళ్లను వాడేవారు వాటిని తప్పనిసరిగా ఉప్పు నీటిలో శుభ్రపరచాలి .
  • రొయ్యల పెంపకం, చేపల పెంపకంను ఏమంటారు – మత్స్య వర్దనం .

మన ఇల్లు

  • మనం కట్టుకునే ఇల్లు ప్రధానంగా 4 అంశాలపై ఆధారపడి ఉంటుంది
  • వాతావరణం
  • ఆర్థిక పరిస్తితి
  • లభ్యమయ్యే సామాన్లు
  • స్ధలం లభ్యత
  • గుడారాలు కాన్వాస్‌ గుడ్డతో తయారువుతాయి .
  • గుడారాలు నిలబెట్టుటకు ఆధారంగా వెదురు బొంగులను నిలబెడతారు .
  • ఒక చోట నుండి ఇంకో చోటుకు బ్రతకడానికి వెళుతూ ఉండేవారు గుడారాలలో నివసిస్తారు.
  • గుడారాలు లో నివసించే వారికి ఉదాహరణ — నిర్మాణాలు జరిగే చోట కార్మికులు, మిలటరీ సైనికులు, సర్కస్‌ వారు .
  • చక్రములు, టైర్లతో నిర్మించబడి ఒక చోట నుండి మరోకచోటుకి నడవడానికి వీలుగా ఉండే నివాసం — కారవాన్‌
  • కొంతమంది గిరిజనులు నల్లమల అడవులలో నివసిస్తారు . వీరు అడవి నుండి లభించే తేనె , కుంకుడు కాయలు , చింత పండు వంటి వాటిని
  • అడవులలో అమ్మి బియ్యం , కూరగాయలు తెచ్చుకుంటారు .
  • ఏ ఇళ్లయితే ఒక చోట నుండి మరొక చోటుకు మార్తడానికి వీలుగా ఉంటాయో వాటిని తాత్కాలిక నివాసాలు అంటారు .
  • ఒక చోట నుండి మరొక చోటుకు మార్షడానికి వీలులేని నివాసాలను శాస్వత నివాసాలు అంటారు.
  • ఇల్లు 2 రకాలుగా విభజించబడి ఉంటాయి 1. కచ్చా ఇల్లు 2.పక్కా ఇళ్ళు
  • మానవ నివాసాల పరిణామ క్రమం :గుహలు , పూరిల్లు , మట్టిల్లు, పెంకుటిల్లు, డాబా ఇల్లు, బహుళ అంతస్తుల భవనం
  • పూరిల్లు వెదురుతో నిర్మించబడి ఉంటాయి .
  • పెంకుటిల్లు గోడలు ఇటుక ,సిమెంట్‌ తో నిర్మించబడి ఉంటాయి పై కప్పు పెంకులతో కప్పబడి ఉంటుంది వేసవిలో చల్లగా ఉంటుంది .
  • రాతితో గోడలు , పై కప్పు కట్టబడిన రాతి ఇల్లు రాయలసీమ లో ఉంటాయి .
  • మట్టి, గడ్డిచే నిర్మించబడే ఇళ్లను కచ్చా ఇళ్ళు అంటారు . ఉదాహరణ: గుడిసెలు
  • ఇటుకులు, ఇసుక, ఇనుముతో నిర్మించబడే ఇళ్లను పక్కా ఇళ్ళు అంటారు . ఇవి చాలా దృఢంగా ఉంటాయి .
  • ఉదా :- డాబా
  • ఇతికి ఉండే పై భాగాన్ని పైకప్పు అంటారు. ఉదాహరణ : లోహపు రేకులు , కాంక్రీటు కప్పు , గోల్డన్కుల కప్పు , గడ్డి ఆకులతో కప్పబడిన పైప్పు.
  • పై కప్పులు ఏటవాలుగా ఉంటాయి
  • జంతువులకు కూడా నివాసాలు ఉంటాయి. నివాసాలు జంతువులును ఎండ, వాన, చలి, శతురువుల నుండి రక్షిస్తాయి
  • సింహం, ఎలుగుబంటి అడవులలోని గుహాలలో నివసిస్తాయి .
  • కుందేలు, ఉడత బొరియలలో నివసిస్తాయి
  • పక్షులు గూళ్లలో నివసిస్తాయి .
  • పశువులు నివసించే ప్రదేశం – శాలలు
  • కుందేలు నివసించే ప్రదేశం – బొరియ
  • కోతులు నివసించే ప్రదేశం – చెట్లు పైన
  • కుక్కలు నివసించే ప్రదేశం – కెన్నెల్‌
  • కోళ్ళు నివసించే ప్రదేశం – బుట్ట
  • సింహం నివసించే ప్రదేశం – గుహ
  • పాము – పుట్ట
  • పందులు నివసించే ప్రదేశం – దొడ్డి
  • గుర్రం నివసించే ప్రదేశం -శాల
  • గొర్రెలు – దొడ్డి
  • చీమలు నివసించే ప్రదేశం – పుట్ట
  • నీటిలో చేపలు, తిమింగళాలు వంటి జీవులు జీవిస్తాయి
  • కప్ప , మొసలి వంటి జంతువులు నీటిపై, నేలపై జీవిస్తాయి..
  • కోతులు, ఏనుగులు వంటివి అడవిలో తిరుగుతూ ఉంటాయి. వాటికి ప్రత్యేకమైన నివాసాలు లేవు .
  • పక్షుల నివాసాలను గూళ్ళు అంటారు.
  • పక్షులు తమ పిల్లలను సంరక్షించుకోవడానికి గూళ్ళు కట్టుకుంటాయి .
  • పిచ్చుక తన గూడును చెట్లపైన, ఇంటి దూలాలపైన కట్టుకుంటుంది .
  • పిచ్చుక కర్రపుల్లలు, గడ్డి, ఆకులు, పత్తి ఉపయోగించి గూడు కడుతుంది.
  • కాండానికి పెద్ద తొర్రలు చేసి తన నివాసాన్ని నిర్మించుకునే పక్షి – వడ్రంగి పిట్ట
  • చెట్ల చిగుర్లలో గడ్డి, కర్రపుల్లలను ఉపయోగించి తన గూడు కట్టుకునేది – గిజిగాడు
  • గిజిగాడు పక్షి గూడు కింది వైపున ప్రవేశించుటకు ఒక ద్వారం ఏర్పరచుకుంటుంది .
  • అనేక రకాల కీటకాలు కూడా నివాసాలు పర్పరచుకున్నాయి : ఉదాహరణ : తేనె పట్టు, సాలె గూడు , పట్టు పురుగు

ఊరికి పోదాం

  • మనం ఒక చోట నుండి మరొక చోటుకు వెళ్లడానికి రవాణా సాధనాలు ఉపయోగిస్తారు .
  • పంచలింగాల ప్రాంతం ఏ జిల్లాలో కలదు – కర్నూలు
  • కర్నూలులో తుంగభద్ర నది ప్రవహిస్తుంది .
  • బస్సులు నిలుపు స్థలాన్ని బస్టాండ్‌ అంటారు .
  • వివిధ ప్రాంతాల నుండి వచ్చే బస్సులన్ని బస్టాండ్‌ లలో నిలుపుతారు .
  • ప్రయాణికులు బస్సుకోసం వేచి ఉండడానికి, కూర్చోవడానికి అనువైన స్ధలం (ప్లాట్‌ ఫారం ) బస్టాండ్‌ లో ఉంటుంది .
  • కార్లు, బైకులు, ఆటోలు రోడ్డుమీద నడుస్తాయి.
  • పడవలు, ఓడలు నీటి మీద ప్రయాణిస్తాయి
  • విమానాలు, హెలికాప్టర్‌ లు గాలిలో ప్రయాణిస్తాయి.
  • రోడ్లు తయారీకి వాడే పదార్ధాలను బట్టి రోడ్లు 6 రకాలు

1. మట్టిరోడ్డు       2. గ్రావెల్‌ రోడ్డు     ౩.ఎర్రమట్టిరోడ్డు

4.గ్రానైట్‌ రోడ్డు     5.తారు రోడ్డు       6.కాంక్రీట్‌ రోడ్డు

  • మచ్చలపురి అనే ఊరు కర్నూలు జిల్లాలో గలదు.
  • కొన్ని రోడ్డుకు పేర్లు కూడా ఉంటాయి
  • ఉదా:- ఆసుపతిరి రోడ్డు, మహాత్మాగాంధి రోడ్డు , బీసెంట్‌ రోడ్‌
  • వాహనాలు ఎరుపు రంగు సిగ్నల్‌ పడినపుడు ఆగాలి .
  • పచ్చరంగు సిగ్నల్‌ పడినపుడు వాహనాలు కదిలి ముందుకు పోతాయి..
  • బస్సు నడిపే వ్యక్తి – డ్రైవర్‌
  • పడవ నడిపే వ్యక్తి – నావికుడు
  • విమానం నడిపే వ్యక్తి – పైలట్‌
  • రైలు నడిపే వ్యక్తి – లోకో పైలట్‌
  • వాహనాలు నడపాలంటే ఇంధనాలు అవసరం .
  • వాహనాలు నడపడానికి పెట్రోల్, డీజిల్‌, CNG వంటి ఇంధనాలు ఉపయోగిస్తారు .
  • CNG – Compressed Natural Gas

మాట్లాడుకుందాం

  • ఇతరులకు మన భావాలను ఆలోచనలు తెలియ పరిచే విధానాన్ని భావ వ్యక్తీ కరణ అంటారు.
  • భావ వ్యక్తి కరణమును కమ్యూనికేషన్‌ అంటారు .
  • చూడడం, తల ఊపడం, కాళ్ళు చేతులు కదపడం మొదలైన శారీరక సంజ్ఞలు కూడా కమ్యూనికేషన్‌ విధానాలే .
  • నృత్య కళాకారులు, మైమ్‌ కళాకారులు వివిధ రకాల సంజ్ఞల భాషను ఉపయోగిస్తారు .
  • నృత్య కళాకారులు భావాలు వ్యక్తీకరించుటకు ముద్రలు ఉపయోగిస్తారు .
  • కమ్యూనికేషన్‌ ముఖ్య ఉద్దేశ్యం మన భావాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం .
  • భావ వ్యక్తీకరణ రెండు రకాలుగా చేయవచ్చు 1. మౌఖిక సంభాషణ 2.శబ్ద సంభాషణ
  • మౌఖిక సంభాషణలో వ్యక్తులు ఒకరికి ఒకరు ఫోన్‌ ద్వారా కానీ పరస్పరం కానీ మాట్లాడుకుంటారు .
  • శబ్ద వ్యక్తి కరణలో వ్యక్తి తన భావాలను, ఆలోచనలను హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులు అర్ధం చేసుకుంటారు .
  • భావ వ్యక్తీకరణ సూచించే హావభావాల గుర్తులను ఎమోజీలు అంటారు
  • భావవ్యక్తీకరణ రెండు విధాలుగా జరుగుతుంది
  • ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ 2.పరోక్ష భావవ్యక్తీకరణ
  • స్నేహితులతో ఉపాధ్యాయులతో, తల్లిదండులతో మాట్లాడడం ప్రత్యక్ష భావవ్యక్తీకరణ ॥
  • ప్రత్యక్ష భావవ్యక్తీకరణ లో వ్యక్తుల భావాలను, ఆలోచనలను వారి శరీర కదలికల ద్వారా వ్యక్తీకరిస్తారు .
  • కరచాలనం అను నది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ .
  • దూరదర్శిని చూడడం — పరోక్ష భావ వ్యక్తీకరణ
  • దూర దర్శిని చూడడం ద్వారా సమాచారం తెలుసుకోవడం పరోక్ష భావవ్యక్తీకరణ “పోస్ట్‌ కార్డ్‌ లు, ఫోన్‌ కాల్‌, మెయిల్‌, మెసెజ్‌ లు మొదలైన
  • వాటి పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉపయోగిస్తాం .
  • పూర్వకాలంలో దూర ప్రాంతంలో ఉన్న వారికి సమాచారం తెలిపిన మార్గాలు 1. ఢంకా ధ్వని ద్వారా 2. పొగ ద్వారా ౩. పావురాల ద్వారా
  • మనషులు లేదా గుర్రపు స్వారీచేసేవారి ద్వారా .
  • ప్రస్తుతం దూరంగా ఉన్నవారికి మెయిల్‌, మెసేసెజ్‌, మెసెంజర్‌ ద్వారా మన భావాలు వ్యక్త పరుస్తున్నాం.
  • భావాలను సంకేతాల ద్వారా వ్యక్త పరచడం ను సంకేత భాష అంటారు
  • చెవిటి, మూగ (దివ్యాంగులు ) వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు సంకేత భాషను ఉపయోగిస్తారు ం
  • పొలంలో దిష్టి బొమ్మలు పెట్టడం భావవ్యక్తీకరణ ॥
  • చీమలు వాటి కాళ్ళు, తల ద్వారా ఒకదానితో మరొకటి తమ భావాలను వ్యక్త పరుస్తాయి .
  • వివిధ జంతువులు వివిధ పద్ధతుల ద్వారా భావవ్యక్తీకరణం చేస్తాయి

1దృశ్య భావవ్యక్తీకరణ :

  • తాబేలు, నత్తలు బెదిరింపుకు గురైనపుడు రక్షణ కోసం వాటి తలను ముడుచుకుంటాయి .
  • కుక్కలు సంతోషంగా ఉన్నపుడు వాటి తోకను ఊపుతాయి

2. శ్రవణ భావ వ్యక్తీకరణ:

  • ఏనుగులు ఘీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయి.
  • గుంపులో ఇతర తోడేళ్లను పిలవడానికి తోడేళ్లు ఊలపెడతాయి .

3. స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ:

  • కుక్కలు, పిల్లులు తమ పిల్లలను నాకడం ద్వారా ప్రేమను వ్యక్త పరుస్తాయి .
  • నాకడం ద్వారా వాటి పిల్లలను శుభ్రం చేసి ఉద్దీపన కలిగిస్తాయి .
  • కోతులు, బబూన్‌ లు ప్రేమను కనపరచడానికి ఒకదానిని ఒకటి దువ్వుకుంటాయి
  • వాగల్‌ డ్యాన్స్‌ అనునది – దృశ్య భావ వ్యక్తీకరణ
  • వాగల్‌ డ్యాన్స్‌ వేటిలో చూడవచ్చు – తేనెటీగలు
  • వాగల్‌ డ్యాన్స్‌ చేసేవి – కూలి తేనెటీగలు .
  • వాగల్‌ డ్యాన్స్‌ ద్వారా కూలి తేనెటీగలు ఆహార సమాచారాన్ని తెలియ చేస్తాయి .

4 . రసాయన భావ వ్యక్తీకరణ :

  • పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి
  • పాములు , కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాసన జ్ఞానాన్ని వినియోగిస్తాయి .

ఆటలు — వినోదం

  • ఆటలు వినోదాత్మకం
  • ఆటలు ఆటడం ఆరోగ్యాన్ని కలిగిస్తుంది .
  • లోపల ఆడే ఆటలను ఇండోర్‌ గేమ్స్‌ అంటారు
  • ఉదా:- లుడో, చైనీస్‌ చెక్కర్స్‌, టేబుల్‌ టెన్నిస్‌. ఆష్టా చెమ్మ ,చదరంగం , పులి మేక , వామన గుంతలు , గచ్చమ్‌ కాయలు
  • అవుట్‌ డోర్‌ గేమ్స్‌ కు ఉదాహరణ — కబడ్డీ, ఖోఖో , కికెట్‌
  • ఆనందం కోసం, మనశరీరం తేలికగా ఉండడం కోసం చేసే క్రియను వినోదం అంటారు
  • Ex: చదవడం, ఆటలు, సంగీతం, TV చూడడం, తోట పని, ట్రావెల్లింగ్‌
  • ఖాళీప్రదేశాలలో, క్రీడా మైదానంలో ఆడే ఆటలను అవుట్‌ డోర్‌ గేమ్స్‌ అంటారు .ఉదాహరణ : ఫూట్ బాల్‌ , టెన్నిస్‌ , టెన్ని కాయిట్‌
  • పల్లెలలో వివిధ రకాలైన ఆటలు ఆడతారు. వీటిని ప్రాంతీయ క్రీడలు అంటారు .
  • ఉదా:- ఏడు పెంకులాట, కోతికొమ్మచ్చి, బొంగురాలాట, పులిమేక, ముక్కు గిల్లే ఆట, తొక్కుడు బిళ్ళ
  • మన రాష్ట్ర క్రీడ – కబడ్డీ
  • మన జాతీయ క్రీడ – హాకీ
  • చదరంగం క్రీడకు కావలసిన క్రీడాకారులు – 1
  • క్యారమ్స్‌ …………………. 2
  • కబడ్డీ  ……………………7
  • క్రికెట్ ……………………………………11
  • సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకూ పిల్లలు ఆటలు ఆడదానికి సరైన సమయం
  • ఆటలు ఆడేటపుడు జడ్లతో ఉన్న ఆటగాళ్ల పరస్పర సహకారంతో ఒకరినొకరు హౌరావించుకోవడం అలవాటువుతుంది. దీనినే బృంద స్ఫూర్తి
  • అంటారు
  • నువ్వు పామును చేరుకున్నపుడు భయపడకు, ఎక్కడం, దిగడం ఈ ఆటలో సహజం దీనికి పొడుపు కథ — వైకుంఠ పాళీ
  • నలుపు, తెలుపు గళ్ళ మధ్యన రాజు రాణి — చెస్‌.
  • రంగు రంగుల గాజు బంతులు గురి చూసి కొడితే అన్నీ నీ సొంతం – గోళీలాట
  • రెక్కలు లేవుగాని ఎగరగలదు. ఆకాశంలో ఫైఫైకి వెళుతుంది – గాలిపటం .
  • ఆటలు , వినోదాల వలన పిల్లలలో ఏకాగ్రత , సహనం , క్రీడా స్పూర్తి అభివృద్ధి చెందుతాయి .

దిక్కులు — మూలలు

  • మన ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సమీప ప్రాంతం అంటారు.
  • సమీప ప్రాంతం లోని ఇళ్ళలో నివసించేవారు — ఇరుగుపొరుగువారు
  • సమీప ప్రాంతం కొన్ని సౌకర్యాలు మన జీవితాన్ని సౌకర్యవంతం చేస్తాయి.
  • సూర్యుని వైపు ఉదయాన నిలబడి ఉంటే అది – తూర్పు
  • సూర్యునికి ఎదురుగా నిలబడినప్పుడు వెనుకవైపు ఉన్నది – పడమర
  • కుడిచేతి వైపు ఉన్నది – దక్షిణం.
  • ఎడమ చేతివైపు ఉన్నది – ఉత్తరం .
  • ఒక ప్రాంతం , భవనం లేదా ఉరియొక్క హద్దులను సరిహద్దులు అంటారు .
  • ర0డు దిక్కుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మూల అంటారు.
  • తూర్చు, ఉత్తరం మధ్య ఉన్న మూల — ఈశాన్యం ం
  • దక్షిణం , పడమర మధ్య ఉన్న మూల — నైరుతి.
  • పడమర, ఉత్తరం మధ్య ఉన్న మూల – వాయువ్యం .
  • తూర్పు, దక్షిణం మధ్య ఉన్న మూల — ఆగ్నేయం .
  • పురాతన కాలంలో నావికులు సూర్యుడు, నక్షత్రము లు, పవనాల దిశలను బట్టి దిక్కులు కనుగొనేవారు .
  • ప్రస్తుత కాలంలో దిక్టూచి, 6౧౩ ఉపయోగించి దిక్కులను కనుగొంటున్నాం .
  • GPS – Global Positioning System
  • ఏదైనా బాగా తెలిసిన ప్రదేశం సహాయం తో సమీపంలోని చిరునామాను సులవుగా కనుక్కోవచ్చు. ఈ బాగా తెలిసిన ప్రదేశాలను మైలురాయి అంటారు.
  • గుర్తులతో కూడిన చిత్రమును పటం(MAP) అంటారు.
  • గుర్తులు అనేవి గుర్తింపు చిహ్నాల ప్రదేశాలను తెలుపుతాయి.
  • గుర్తింపు చిహ్నం అనేది ఆ ప్రాంతం లో బాగా తెలిసిన ప్రదేశం.

Post a Comment

0 Comments